లారీ నడుపుతూ రూ. 22 లక్షల కారు కొన్న దంపతులు.. భర్త కష్టం చూసి స్టీరింగ్ పట్టిన భార్య..
ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. పెద్ద చదువులు ఉన్న వారికే మంచి ఉద్యోగం, జీతం ఉంటుందనే భావన ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలని లేదంటే డాక్టర్, ఇంజనీర్ కావాలనే కోరిక ఉండేది. కానీ రాను రాను అలాంటి మాటలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. ప్రజల ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చాయి. చదువుతోనే కాకుండా ఇతర పనులు చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్ పని చేసే వారు కూడా సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఆర్జిస్తున్నారు. దేశంలోని మెట్రో నగరాలు, ఇతర టైర్ 2,3 వంటి నగరాల్లో క్యాబ్‌ల వాడకం అధికంగా పెరిగింది. అలాగే, టెక్ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకెళ్లడం, తీసుకురావడం , లారీలు, ట్రక్కుల్లో సామాన్లు తీసుకెళ్లడానికి డ్రైవర్లు ఎక్కువగా అవసరమవుతున్నారు. దీంతో వారికి డిమాండ్ అధికంగా ఉంది.
భారత్‌లోనే కాకుండా విదేశాల్లో కూడా డ్రైవర్ ఉద్యోగాలను భారీ డిమాండ్ ఉంటుంది. దుబాయ్, యూరప్‌లలో వివిధ సరుకుల రవాణకు డ్రైవర్ల కొరత అధికంగా ఉంటుంది. అక్కడ భారీ ట్రక్కులు, లారీలను నడిపే వారికి నెలకు లక్షలకు పైగా జీతం అందుతుంది. అయితే ఇది డిజిటల్ యుగం. ఇలాంటి సమయంలో కొంతమంది డ్రైవింగ్ చేస్తూనే తమ ప్రయాణాలను వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు.

డ్రైవింగ్‌తో జీవనోపాధి పొందుతూనే వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన దంపతులు లారీ నడుపుతూనే, దానిని ఒక వ్లాగ్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అలా వచ్చిన ఆదాయంతో ఏకంగా రూ.22 లక్షల విలువైన థార్ రాక్స్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఈ జంట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా ఉన్నారు.
పూర్తి వివరాళ్లొకి వెళితే, తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్ ఒక డ్రైవర్. తన భర్త కష్టాన్ని చూడలేక ఆయన భార్య రేవతి కూడా డ్రైవింగ్ నేర్చుకుని అతనికి తోడయ్యింది. దీంతో ఇద్దరు కలిసి లారీ డ్రైవింగ్ చేసే వారు. ఎంత దూరం అయిన కూడా ఇద్దరు కలిసే వెళ్లేవారు.

సామాన్లు ఉన్న లారీలతో ఇండియా మొత్తం కూడా తన భర్తతో కలిసి ఆమె కూడా తిరిగింది. అయితే ఈ క్రమంలో వారు తమ కష్టాలు, డ్రైవింగ్ అనుభవాలను షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పెట్టేవారు. ఈ దంపతులు 'మారియమ్మన్' పేరుతో అకౌంట్ క్రియేట్ వీడియోలను షేర్ చేయగా, అవన్నీ కూడా బాగా వైరల్ అయ్యాయి.
దీంతో సోషల్‌మీడియాలో దంపతులు ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయారు. ఈ క్రమంలో వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీకి రెండున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్లు వచ్చారు. దీంతో కొంత ఆదాయాన్ని ఆర్జించడం మొదలుపెట్టారు. ఇలా వచ్చిన ఆదాయంతో ఏకంగా తమకు నచ్చిన మహీంద్రా థార్ రాక్స్‌ను కొనుగోలు చేశారు. దీని ధర రూ.22 లక్షలు.

ఈ దంపతులకు ఇప్పటికే మూడు లారీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తమ వ్యక్తిగత ప్రయాణాల కోసం ఈ ఎస్‌యూవీని తమ ఇంటికి తెచ్చుకున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి పని చేస్తే ఏదైనా సాధించివచ్చని ఈ ఇద్దరిని చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో వీరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ కొన్ని తమిళ టీవీ షోలలో సైతం గెస్ట్‌లుగా పాల్గొన్నారు.
సెంథిల్ దంపతులు తాజాగా తాము కొనుగోలు చేసిన థార్ రాక్స్‌కు సంబంధించిన ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. తమిళ జంట కొనుగోలు చేసిన మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్లతో వచ్చింది. ఇది ప్రధానంగా పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇండియాలో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఎస్‌యూవీలలో థార్ రాక్స్ మొదటి స్థానంలో ఉంటుంది.


Click it and Unblock the Notifications








