పోలీస్‌ వాహనంపై కూర్చుని రీల్స్‌ చేసిన యువతి.. పోలీస్‌ ఆఫీసర్‌ సస్పెండ్‌..!

సోషల్ మీడియా క్రేజ్‌ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే యువత సహా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌పై.. పబ్లిక్‌ రోడ్లపై స్టంట్స్‌ చేయడం సహా ఇతర కార్యక్రమాలు నిర్వహించడంపై ఇప్పటికే అనేక సార్లు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌ కారణంగా ఓ పోలీస్ అధికారి సస్పెండ్‌ అయ్యారు.

సదరు పోలీస్‌ అధికారికి చెందిన మహీంద్రా స్కార్పియో వాహనం బానెట్‌పై సోషల్‌ ఇన్‌ఫ్లూయన్సర్‌ కూర్చున్న వీడియో వైరల్‌ అయింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు సదరు అధికారిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన పంజాబ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

social media influencer doing reels on police vehicle

వీడియోలు చేసుకొనేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌కు పోలీసుల అధికారిక వాహనాన్ని వినియోగించుకొనేందుకు అనుమతి ఇచ్చినందుకు అశోక్‌ కుమార్‌ అనే పోలీస్ అధికారిని.. జలందర్‌ పోలీస్‌ కమిషనర్‌ కుల్‌దీప్‌ ఛాహల్‌ సస్పెండ్‌ చేశారు. అయితే ఎన్నిరోజులపాటు పోలీస్ అధికారి సస్పెండ్‌ చేశారో తెలియలేదు.

ఓ సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయన్సర్‌ పోలీసులకు చెందిన వాహనం మహీంద్రా స్కార్పియోపై కూర్చొని ఉండడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు. పంజాబీ పాటకు చిన్నగా డ్యాన్స్‌ చేయడం కనిపించింది. ఈ వీడియో రికార్డు చేస్తున్న సమయంలో పోలీసులు కూడా సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

social media influencer doing reels on police vehicle

పోలీసుల అనుమతితోనే వారి అధికారిక వాహనంపైన కూర్చొని వీడియో రికార్డు చేసిన కారణంగా.. అయితే సదరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయితే భారత్‌లో పబ్లిక్‌ రోడ్లపై అభ్యంతరకరమైన విధంగా సంజ్ఞలు చేయడం, పోలీసుల వాహనాన్ని వినియోగించడం చట్ట విరుద్ధం.

ఇలాంటి సందర్భాల్లో గతంలో పోలీసులు వారికి నేరుగా చిక్కిన వారిపైనే చర్యలు తీసుకొనేవారు. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియా వీడియాల ఆధారంగానూ చర్యలు తీసుకుంటున్నారు. వారికి జరిమానాలు విధిస్తున్నారు. పబ్లిక్ రోడ్లపై స్టంట్స్‌, రేసింగ్‌లకు పాల్పడినవారిపై వేల రూపాయలు జరిమానాలు విధించిన ఘటనలు కూడా అనేక ఉన్నాయి.

social media influencer doing reels on police vehicle

దీంతోపాటు ప్రస్తుతం చాలా నగరాల్లో భారీగా అందుబాటులో వచ్చిన సీసీటీవీ నెట్‌వర్క్‌ ఆధారంగా పోలీసులు ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలదారుల నంబర్‌ ప్లేట్ల ఆధారంగా వారిని ట్రాక్‌ చేసి జరిమానా విధిస్తున్నారు. రోడ్లను సురక్షిత ప్రాంతాలకు మార్చేందుకు కీలక చర్యలు తీసుకుంటున్నారు.

పబ్లిక్‌ రోడ్లపై, ప్రభుత్వ వాహనాలపై స్టంట్స్‌ చేయడం, వాహనాలదారులను అవస్థలకు గురిచేసిన చాలా ఘటనల్లో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానాతోపాటు కొన్నిసార్లు జైలుశిక్ష విధించే విధంగా చర‌్యలు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఫలితాలు వస్తున్నా.. మరికొన్ని చోట్ల ఆశించినంత మార్పు రావడం లేదు.

social media influencer doing reels on police vehicle

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, September 29, 2023, 16:09 [IST]
English summary
Social media influencer uses police vehicle for reels in punjab
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+