Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తండ్రి ఇచ్చిన కారును అంబులెన్స్‌గా మార్చిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?
కరోనా వైరస్ అధికంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారిని నిలువరించడానికి 2020 మార్చి 24 నుంచి కరోనా లాక్‌డౌన్ అమలు చేయబడింది. ఈ లాక్‌డౌన్ సమయంలో దాదాపు అన్ని రకాల వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. అత్యవసర సమయంలో మాత్రమే కూని వాహనాలకు అనుమతి ఇవ్వడం జరిగింది.

ప్రజలు ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండగా, కొందరు బాధలో ఉన్నవారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు సహాయం చేసిన వారిలో హాంగ్‌నావో కొన్యాక్ కూడా ఉన్నారు.

39 ఏళ్ల హాంగ్‌నావో కొన్యాక్ నాగాలాండ్‌లోని మాన్‌లో ఉన్న ఒక సామాజిక కార్యకర్త. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వబడింది. ఇంకా ప్రజలకు వాహనాలు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇంత క్లిష్టమైన సమయంలో హాంగ్‌నావో 48 మంది గర్భిణీ స్త్రీలను వారి అంబులెన్స్‌లో ఆసుపత్రిలో చేర్చారు.
MOST READ:ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

ఈ ఉదార సేవ తల్లి పిల్లల ప్రాణాలను కాపాడింది. అంతే కాకుండా హాంగ్‌నావో 100 మందికి పైగా రోగులు సకాలంలో ఆసుపత్రి చేర్చారు. ప్రజలకు సేవ చేయడానికి హాంగ్‌నావో తన తండ్రి మహీంద్రా బొలెరో కారును అంబులెన్స్‌గా మార్చారు.

అతను మొదట తమ పొరుగు గర్భిణీ స్త్రీని ఆసుపత్రికి తీసుకువచ్చానని హాంగ్‌నావో చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో మహిళ అంబులెన్స్ లేకుండా బాధలో ఉంది. హాంగ్‌నావో కలిపించుకోవడం వల్ల ఆ మహిళ ఆలస్యం చేయకుండా ఆసుపత్రి చేరింది. మహిళ సకాలంలో ఆసుపత్రిలో చేరినందున ఆమె సురక్షితంగా ప్రసవించబడింది. అతని తన దాతృత్వ సేవకు కేంద్ర బిందువుగా మారింది. క్రమంగా వారి సహాయక చర్యలు పరిసర ప్రాంతాల్లో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

మన్ షెరీఫ్ అతని పనిని ప్రశంసించారు మరియు అంబులెన్స్ స్రావీస్ కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా అందించారు. వారు ప్రజల నుండి ఎటువంటి డబ్బు తీసుకోరు. తాను ఎవరి నుండి ఆర్థిక సహాయం పొందలేదని హాంగ్‌నావో చెప్పారు.

ప్రజల ఆశీర్వాదమే తనకు సరిపోతుందని ఆయన అన్నారు. అంబులెన్స్ అద్దెకు డబ్బు లేని వారు చాలా మంది ఉన్నారు. అటువంటివారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.
MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

పెట్రోల్ కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉందని హాంగ్‌నావో చెప్పారు. కొన్నిసార్లు పెట్రోల్ బంకర్లు వారికి ఉచితంగా పెట్రోల్ ఇవ్వడం జరిగింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి తన కారును ఉపయోగించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఏది ఏమైనా ఎవరినుంచి ఏమి ఆశించకుండా ఇతడు చేసిన సేవ నిజంగా ప్రశంసనీయం.