2020లో కార్లు ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో వస్తాయి-ప్రత్యేక సేకరణ

By Anil

కార్ల యొక్క ఆధునిక టెక్నాలజీ వలన నెమ్మదిగా సౌకర్యాల స్థాయి కూడా పెరుగుతోంది. నిరంతరం ఇలా కొత్త టెక్నాలజీలు పరిచయం కావడం టెక్నాలజీ ఇండస్ట్రీలకు నిజంగా ఒక గొప్ప అభివృద్ది అని చెప్పవచ్చు. ఇది పరిశ్రమలకే సామాజికంగా మానవ మనుగడకు కూడా ఎంతో అవసరం అని చెప్పవచ్చు.

మీరు ఒక సారి గమనిస్తే ఈ సంత్సరం చివరి వరకు ఎన్ని కొత్త కార్లు విడుదల అయ్యాయో అన్నింటిలో కూడా కొన్ని కొత్త టెక్నాలజీలను పరిచయం చేస్తూవచ్చారు. ఇప్పటికే ఆటోమొబైల్ రంగం ఇన్ని కొత్త పుంతలు తొక్కుతోంది అంటే మరి భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి.
Also Read: మా బలం, మాకు గర్వకారణం, ఇండియాలో తయారైన మిలిటరీ వాహనాలు!!

2020 కార్ల ఎలాంటి కొత్త టెక్నాలజీతో వస్తాయో అని తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

1.బయోమెట్రిక్ యాక్సెస్

1.బయోమెట్రిక్ యాక్సెస్

బయోమెట్రిక్ విధానాన్ని ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్ లాక్,అన్‌లాక్, ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాఫ్, మరియు ఇతర ప్రదేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నాం. వేలి ముద్రలను ముందుగా నమోదు చేసుకోవడం వలన ఇతరులు మీ వాటిని యాక్సెస్ ‌చేస్ అవకాశం లేకుండా ఉంటుంది. దీని వలన చాలా వరకు దొంగతనాలను, మోసాలను అరికట్టవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ రకమైన టెక్నాలజీని కార్లలో ప్రవేశపెట్టనున్నారు.

2. ఆక్టివ్ విండో డిస్ల్పే :

2. ఆక్టివ్ విండో డిస్ల్పే :

హెడ్ -అప్ డిస్ల్పే అను సాంకేతికత ప్రస్తుతం ఖరీదైన కార్లలో మాత్రమే ఉంది. కారు యొక్క వేగం, ఇంధన సామర్థ్యం మరియు వెనుక వైపు అద్దం వ్యూ ఇలాంటి సమాచారం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం మినహాయిస్తే ప్రమాదం జరిగే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే, విండ్ స్క్రీన్ నావిగేషన్ మరియు విండో అద్దాలు చూపించే మార్గాలు మరియు రూట్ మ్యాప్‌లు మన గమ్యస్థానాన్ని చూపించడంలో ఎంతో సహాయపడతాయి. ఇది కూడా త్వరలో రానున్నాయి.

3.రిమోట్ వెహికల్ షట్‌డౌన్ :

3.రిమోట్ వెహికల్ షట్‌డౌన్ :

రిమోట్ ద్వారా వెహికల్‌ను కార్ల‌ను ఆఫ్ చేసే విధానాన్ని ప్రస్తుతం కార్లలో ఉపయోగిస్తున్నారు. అయితే ఆర్డినరి కార్లలో ఈ విధానం ఇంకా రాలేదు. దీని వలన మనం కొంత సమయం వరకు ఇంజన్ ఆఫ్ చేయకుండా ఉంటే మరియు కారును కీ ద్వారా కాకుండా దూరంలో ఉన్నప్పుడు ఆఫ్ చేయాలంటేఈ రిమోట్ ద్వారా వెహికల్ ఆఫ్ చేయవచ్చు. దీదీని 2020 లోపు సామాన్య కార్లలో కూడా ప్రవేశపెట్టనున్నారు.

4.బ్రేకులు ఫెయిలవడం :

4.బ్రేకులు ఫెయిలవడం :

బ్రేకులు ఫెయిల్ అవడానికి ముఖ్య కారణం టెక్నికల్ సమస్యల వలన ఇలా జరుగుతుంది మరియు ఆక్సలరేటర్ పెడల్ సరిగా లేకపోవడం వంటివి అన్ని కూడా టెక్నికల్ సమస్యల వలన వస్తాయి. అయితే 2020లో కారు ఆక్సలరేటర్ పెడల్ సెన్సార్, ఇంజన్ నుండి పొగ బయటకు వెళ్లే శాతం మరియు ఆటోమేటిక్‌గా బ్రేక్ పనిచేసేవిధంగా కార్లలో మార్పులు రానున్నాయి.

5.బాడీ ఫ్యానెల్‌ను బ్యాటరీస్‌గా ఉపయోగించుకోవడం :

5.బాడీ ఫ్యానెల్‌ను బ్యాటరీస్‌గా ఉపయోగించుకోవడం :

ప్రస్తుతం కార్లలో బ్యాటరీ బరువులు పెరిగిపోతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ కార్లలో అయితే ఈ సమస్య మరి ఎక్కువ. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ బరువులు మోయలేవు అందులో బ్యాటరీ బరువులు ఎక్కువగా ఉంటే ఆ కార్లను ఉపయోగించడం శుద్ద దండగా. అందుకే రాబోయే సంవత్సరాల్లో కారు బాడీలనే బ్యాటరిలుగా వాడుకోవాలనే ఆలోచనలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ ఆలోచన 2020లో ఆచరణలోకి వచ్చే విధంగా ఉంది.

6. సిగ్నల్ కంట్రోల్ చేయడం :

6. సిగ్నల్ కంట్రోల్ చేయడం :

మామూలుగా మనం చేతితో లేదా వేలుతో సిగ్నల్స్ ఇస్తుంటాం. ఎంతో మంది ఇది తప్పు అంటారు. అయితే ఇందుకు భిన్నంగా మీ చేతి పక్కనున్న స్క్రీన్ మీద మీరు ఎటువెళ్లాలంటే అటు వైపుకు వేళ్ళతో టచ్ చేయడం ద్వారా మీ వాహనం ఆ సిగ్నల్స్‌ను చూపిస్తుంది. అంటే చేతిని కారులో నుండి బయటకు పెట్టకుండా సిగ్నల్ ఇవ్వచ్చన్నమాట ఇది ఎంతో బాగుంది కదా అయితే ఇది 2020లో రానుంది. మరి అంత వరకు ఎదురు చూద్దాం.

7.ఆటోమేటిక్ కార్లు :

7.ఆటోమేటిక్ కార్లు :

రెండు సంవత్సరాల్లో భారత దేశంలోకి డ్రైవర్ తో అవసరం లేకుండా నడిచే కార్లు రానున్నాయి. ఇలాంటి కార్లను ఉత్పత్తి చేయడానికి చాలా కంపెనీలు సుముఖతతో ఉన్నాయి. మరియు కొన్ని కంపెనీలు వీటి ప్రదర్శనకు ఉంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక కంపెనీకి చెందిన సి.ఆ.ఒ మాట్లాడుతూ ఆటోమేటిక్ అంటే పూర్తిగా కాదు కొన్నింటిని మాత్రమే ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేయగలవు అని వివరించారు.

8.ఎలక్ట్రానిక్ శాన్ వైకార్ :

8.ఎలక్ట్రానిక్ శాన్ వైకార్ :

ఎప్పుడైనా మీరు కారును సూర్యునికి వ్యతిరేక దిశలో నడిపినపుడు కాంతి పరావర్తనం చెంది మీకు రహదారిని కనబడకుండా చేస్తుంది. ఇలాంటి వాటిని నివారించేందుకు వోక్స్‌వ్యాగన్ కంపెని ఒక కొత్త ఎలక్ట్రానిక్ శాన్ వైకార్‌ను కనుగొంది. డ్రైవర్ యొక్క ముఖానికి అనుగుణంగా సెన్సార్లు విండ్ షీల్డ్‌ను ఆపరేట్ చేస్తాయి ఇది సూర్యరశ్మిని మీ కళ్లకు తగలకుండా చేస్తుంది. ఒక వేళ ప్రక్కవైపుల నుండి ఎండ మీ కళ్లకు ఇబ్బందిని కలిగిస్తే ఆటోమేటిక్‌గా ఇది ఆ సూర్యరశ్మిని ఆపేస్తుంది మరియు రాత్రి వేళలో ఎదురుగా వస్తున్న వాహనాల వెలుతురు మీకు రహదారిని కనబడకుండా చేస్తుంది. ఇలాంటి వాటిని అన్నింటిని ఇది అరికడుతుంది.

 9. కార్‌ కమ్యునికేషన్ :

9. కార్‌ కమ్యునికేషన్ :

మీరు ఎప్పుడైనా కారును నడిపేటప్పుడు ఓవర్‌టేక్ చేస్తారు అదే టర్నింగ్ మరియు మలుపులో అలా చేస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ కారు కమ్యునికేషన్ ఏర్పాటు చేసుకోవడం వలన కార్లు ఒకదానికొకటి కమ్యునికేషన్ పంచుకుని ఆగిపోతాయి. దీని వలన ప్రమాదం జరిగే అవకాశాలు దాదాపుగా చాలా వరకు తగ్గిపోతాయి. అయితే 2020 లో ఇది అందుబాటులోకి రానుంది.

ఎంతో మంది వీటిని చదివారు. మరి మీరు చదివారా ?

ఎంతో మంది వీటిని చదివారు. మరి మీరు చదివారా ?

  • అద్భుతమైన & ప్రఖ్యాత 10 భారత రహదారులు: మరింత చదవండి

  • వర్షాకాలంలో ఘాట్ రోడ్ డ్రైవింగ్ టిప్స్.......
  • రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్న జపాన్ !

More from DriveSpark

Article Published On: Monday, October 26, 2015, 10:51 [IST]
English summary
Here are listed some advanced car technologies we’ll see in showrooms by 2020.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+