భారతదేశం యొక్క మొదటి బులెట్ రైలు 'బ్లూ మ్యాప్' ; తెలుసుకోల్సిన 10 విషయాలు
ప్రతి ఏడాది జరిగే వార్షిక బడ్జెట్ సమావేశాల్లో బుల్లెట్ రైలు గురించి మాట్లాడటం కొన్ని సంవత్సరాల నుండి సర్వసాధారణం అయిపోయింది. భారత దేశపు మొదటి బుల్లెట్ రైలును ముంబై మరియు అహ్మదాబాద్ల మధ్య ప్రారంభించనునున్న సంగతి తెలిసినదే. అయితే ఈ వారంలో జరగనున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంభందించిన ప్రతిపాదనలను మళ్లీ తెర మీదకు తెచ్చే ఏర్పాట్లను చేస్తున్నారు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఎయిర్‌లైన్స్
ఈ సందర్బంగా అడిషనల్ ఛీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, మరో ఏడు సంవత్సరాలలో భారతదేశపు మొదటి బుల్లెట్ రైలు ద్వారా ప్రజా రవాణాను మొదలు ప్రారంభిస్తామని తెలిపారు. భారీ మొత్తం మీద పెట్టుబడులు పెట్టి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి జపాన్ వారి సహరకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. భారతదేశపు మొదటి బుల్లెట్ రైలుగురించి విడుదలైన మరింత సమాచారం క్రింది స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

పనులు ప్రారంభం
మొదటి బుల్లెట్ రైలుకు చెందిన పనులను 2018 ఏడాది చివరి నుండి లేదా ఆ తరువాత వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభించనున్నారు. మరియు మొదటి బుల్లెట్ రైలుకు చెందిన పనులను సరిగ్గా 5 సంవత్సరాలలో ముంగించే విధంగా ప్రణాళికలను రూపొందించనున్నారు.

ఎలివేటెడ్ ట్రాక్
ముందుగా ఈ బుల్లెట్ రైలును నిర్మించే ముందు ఒక బృందం అధ్యనం చేసిన దీనివెనకున్న సాధ్యాసద్యాలను బేరీజు వేసుకుంది. ఈ ప్రాజెక్ట్ వెనక అనేక ప్రయోగాత్నక సమస్యలు మరియు భూ సర్వే కోసం ఉత్పన్నమయ్యే సమస్యలను అధ్యయనం చేసింది. అయితే భద్రత మరియు ప్రమాదాల నివారణ కోసం ట్రాక్‌కు ఇరువైపులా వలయాకారపు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీని వలన పశువులు మరియు ఇతర ప్రమాదాలు దాదాపుగా నివారించ్చు.

నిధుల వెల్లువ
గత ఏడాది ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం దాదాపుగా రూ. 98,000 కోట్ల అంచనా వేశారు. అయితే ఎలివేటెడ్ ట్రాక్ ప్రతిపాధనలు వచ్చిన నేఫథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసం అదనంగా 10,000 కోట్ల రుపాయల నిధులను సమకూర్చనున్నారు.

నిధులకు మూలం
ఈ మొదటి బుల్లెట్ రైలు కోసం జపాన్‌కు చెందిన అంతర్జాతీయ కోఆపరేషన్ సంస్థ 81 శాతం నిధులను ఇస్తోంది. అయితే 50 సంవత్సరాల కాలుపరిమితితో 1 శాతం వడ్డీ రేటుతో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన డబ్బును గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన రైల్వే జోన్లు సంయుక్తంగా నిధులను అందించాల్సి ఉంటుంది.

భారతదేశపు విడిభాగాలు
ఈ బుల్లెట్ రైలులో వినియోగించబోయే విడిభాగాలు దాదాపుగా 80 శాతం వరకు దేశీయంగా తయారైనవే మరియు 20 విడిభాగాలను జపాన్ నుండి దిగుమతి చేసుకోనున్నారు.

వేగం
బుల్లెట్ రైలు ప్రయాణించాల్సిన మార్గ నిర్మాణం పూర్తి అయితే, బుల్లెట్ రైలు గంటకు 300 నుండి 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టనుంది.

ప్రయాణ సమయం
505 కిలోమీటర్లు దూరం ఉన్న ముంబాయ్ మరియు అహ్మదాబాద్ల మధ్య ఈ బుల్లెట్ రైలు మీద కేవలం రెండు గంటల కాలంలో చేరుకోవచ్చు

కలిసే రైల్వే స్టేషన్లు
ఇంతకు ముందు ప్రణాళికల ప్రకారం బుల్లెట్ రైలు నాశిక్ స్టేషన్ మీదుగా వెళ్లనుండేది. అయితే అది ఖర్చుతో కూడుకున్నదని దీనిని మినహాయించారు. అయితే ముంబాయ్ అహ్మదాబాద్‌ల మధ్య గల సూరత్, వడోదర మరియు ఇతర స్టేషన్లను కలుపుతూ పోనుంది.

ముంబాయ్ స్టేషన్
ముంబాయ్‌లోని పంత్ర కుర్లా కాంప్లెక్స్‌ను బుల్లెట్ రైలుకు స్టేషన్‌గా మార్చనున్నారు. ఈ స్టేషన్‌లో దీని కోసం భూమి అడుగుభాగం నుండి మూడు లేయర్లుగా రూపొందించనున్నారు.

ప్రయాణ ధరలు
ప్రస్తుతం ముంబాయ్ మరియు అహ్మదాబాద్ల మధ్య సాధారణ రైలు టికెట్ ధర రూ. 1,855 లుగా ఉంది. అయితే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే 2,500 నుండి 3,000 టికెట్ ధరను నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య విమాన ప్రయాణపు ధర రూ. 2,250 గా ఉంది.

- నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్
- విమానంలో గల వసతులతో రానున్న విలాసవంతమైన రైళ్లు....!!
- విమాన ప్రమాదాలకు పూర్తిగా అడ్డుకట్ట


Click it and Unblock the Notifications