తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

తల్లిదండ్రులు పిల్లలకు కానుకలు ఇవ్వటం సహజం. కానీ, అదే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తమ సంపాదనతో తల్లిదండ్రులకు కానుకలు అందజేయటం విశేషం. పిల్లల నుండి అలాంటి కానుకులను పొందిన తల్లిదండ్రులు అనుభవించే భాగోద్వేగాలు నిజంగా వెల కట్టలేనివి.

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

పిల్లలు తమ తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ కానుకలను ఇచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తెతూ, వారు పొందే భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా వీడియోల రూపంలో ఇతరులతో పంచుకోవటం ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. ఇలాంటి వీడియోలను చూసి చాలా మంది స్పూర్తి పొంది తమ తల్లిదండ్రులకు తమకు తోచిన రూపంలో కానుకలను ఇస్తున్నారు.

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

తాజాగా, ఓ వ్యక్తి తన తండ్రి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనకు ఓ సరికొత్త కియా సెల్టోస్ కారును బహమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అతను సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను జజ్బా దర్శన్ దోషి అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు.

MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]

ఈ వీడియోలో కారును పుట్టినరోజు కానుకగా పొందిన తండ్రి, తన తనయుడు చూపించిన ప్రేమకు మురిసిపోతుండటాన్ని చూడొచ్చు. కొత్త సెల్టోస్ కారును అందుకున్న ఆ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియోలో, దర్శన్ తన తండ్రికి సెల్టోస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాడు.

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

ఇక కియా సెల్టోస్ కారు విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.9.89 లక్షల నుండి రూ.17.65 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). కియా మోటార్స్ నుండి ఈ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతూ, అతి తక్కువ సమయంలో మంచి విజయాన్ని సాధించింది.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

ఇదిలా ఉంటే, కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కొత్త 2021 కియా సెల్టోస్ ఎస్‌యూవీ మరింత రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో సరికొత్త ఫ్రంట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు ఫ్రంట్ గ్రిల్ వంటి మార్పులతో ఇది పూర్తిగా కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండొచ్చని అంచనా. అలాగే, ఇందులో మరిన్ని కొత్త వేరియంట్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టే అకాశం ఉంది.

MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

అయితే, ఇంజన్ పరంగా కొత్త కియా సెల్టోస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం కియా సెల్టోస్‌ను రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ 115 బిహెచ్‌పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

ఇకపోతే, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్!

డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ల విషయానికి వస్తే, ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఒకేరకంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్, 250 ఎన్ఎమ్ టార్క్‌లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

Image Courtesy: JAZBA DARSHAN DOSHI

Most Read Articles

English summary
Son Gifts Brand New Kia Seltos To Dad On His Birthday, Video Goes Viral. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X