Just In
- 38 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తండ్రి పుట్టిన రోజు కానుకగా తనయుడు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్!
తల్లిదండ్రులు పిల్లలకు కానుకలు ఇవ్వటం సహజం. కానీ, అదే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తమ సంపాదనతో తల్లిదండ్రులకు కానుకలు అందజేయటం విశేషం. పిల్లల నుండి అలాంటి కానుకులను పొందిన తల్లిదండ్రులు అనుభవించే భాగోద్వేగాలు నిజంగా వెల కట్టలేనివి.

పిల్లలు తమ తల్లిదండ్రులకు సర్ప్రైజ్ కానుకలను ఇచ్చి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తెతూ, వారు పొందే భావోద్వేగాలను సోషల్ మీడియా వేదికగా వీడియోల రూపంలో ఇతరులతో పంచుకోవటం ఇప్పుడు బాగా పాపులర్ అయ్యింది. ఇలాంటి వీడియోలను చూసి చాలా మంది స్పూర్తి పొంది తమ తల్లిదండ్రులకు తమకు తోచిన రూపంలో కానుకలను ఇస్తున్నారు.

తాజాగా, ఓ వ్యక్తి తన తండ్రి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనకు ఓ సరికొత్త కియా సెల్టోస్ కారును బహమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని అతను సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను జజ్బా దర్శన్ దోషి అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]
ఈ వీడియోలో కారును పుట్టినరోజు కానుకగా పొందిన తండ్రి, తన తనయుడు చూపించిన ప్రేమకు మురిసిపోతుండటాన్ని చూడొచ్చు. కొత్త సెల్టోస్ కారును అందుకున్న ఆ కుటుంబం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియోలో, దర్శన్ తన తండ్రికి సెల్టోస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాడు.

ఇక కియా సెల్టోస్ కారు విషయానికి వస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధరలు రూ.9.89 లక్షల నుండి రూ.17.65 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). కియా మోటార్స్ నుండి ఈ మోడల్ అత్యధికంగా అమ్ముడవుతూ, అతి తక్కువ సమయంలో మంచి విజయాన్ని సాధించింది.
MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ర్యాలీ చేపట్టిన కలకత్తా సీఎం.. ఎందుకో తెలుసా!

ఇదిలా ఉంటే, కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. కొత్త 2021 కియా సెల్టోస్ ఎస్యూవీ మరింత రిఫ్రెష్డ్ డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్లో సరికొత్త ఫ్రంట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు ఫ్రంట్ గ్రిల్ వంటి మార్పులతో ఇది పూర్తిగా కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండొచ్చని అంచనా. అలాగే, ఇందులో మరిన్ని కొత్త వేరియంట్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టే అకాశం ఉంది.
MOST READ:మీ వాహనంపై ఈ స్టిక్కర్ ఉందా.. ఉంటే వెంటనే తీసెయ్యండి.. లేకుంటే ?

అయితే, ఇంజన్ పరంగా కొత్త కియా సెల్టోస్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం కియా సెల్టోస్‌ను రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ 115 బిహెచ్పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఇకపోతే, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ పెట్రోల్ ఇంజన్. ఇది స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.
MOST READ:మనవరాలు చదువు కోసం ఉంటున్న ఇల్లు అమ్మేసిన 74 ఏళ్ల రియల్ హీరో

డీజిల్ ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులోని బిఎస్6 కంప్లైంట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు ఒకేరకంగా 115 బిహెచ్పి పవర్‌ను మరియు 114 ఎన్ఎమ్, 250 ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.
Image Courtesy: JAZBA DARSHAN DOSHI