చేపలు అమ్మేందుకు లగ్జరీ కారు.. తండ్రికి గిఫ్ట్ ఇచ్చిన కొడుకు.!
కుల వృత్తిలో కొనసాగుతూ తమను ఉన్నత స్థానానికి చేర్చిన తల్లిదండ్రుల కోసం వెలకట్టలేని బహుమతినిచ్చాడు ఓ కొడుకు.. ఆయన కోసం రూ.13.5 లక్షల విలువైన మారుతీ ఎక్స్ ఎల్6 కారును కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఆచంతన్ వ్యాల్ ప్రాంతానికి చెందిన శివానందం - కాళియమ్మాళ్ దంపతులు. వీరు మత్స్యకార వృత్తిలో కొనసాగుతూ చేపల వేటలో ఉన్నారు. కన్మాయిలో వార్షిక లీజుకు వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు సురేష్ కన్నన్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పేద కుటుంబంలో పుట్టిన సురేష్ కన్నన్ ఇంజినీరింగ్ చదివి ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన పెద్ద షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం తీసుకుంటున్నాడు. తన తోబుట్టువులకు పెళ్లిళ్లు చేసి సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఇకపై పనికి వెళ్లవద్దని, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పాడు.
కానీ బతికున్నంత కాలం కష్టపడి పని చేసుకోవాలని వారు చెప్పడంతో.. చేపలు పట్టే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కన్మాయిల్‌లో చేపలను పట్టుకుని ఆ ప్రాంతంలోని చేపల దుకాణాలకు వెళ్లి వాటిని విక్రయించేవాడు. ఈ క్రమంలో తన తండ్రికి సహాయం చేయడానికి, సురేష్ కన్నన్ రూ. 13.5 లక్షల విలువైన మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్ 6 కారును కొనుగోలు చేసి తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు.

ఈకారుని సురేష్ తన తండ్రి పేరు మీద కొనుగోలు చేశారు. ఇప్పుడు, సురేష్ కన్నన్ తల్లిదండ్రులు తమకు ఇష్టమైన వృత్తిని నమ్ముకుంటూ చేపలను తీసుకెళ్లి ఈ కారులో విక్రయిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను ఆశ్చర్యంలో పడేసింది. తల్లిదండ్రుల పట్ల ఆ కుమారుడికి ఉన్న ప్రేమ పట్ల వారంతా ఫిదా అయ్యారు.
ఎన్నో తరాలుగా చేపల వ్యాపారం చేస్తున్నామని.. తమ కుమారుడు తమ కోసం కారు కొనుగోలు చేయడం గర్వకారణంగా ఉందని శివానందం సంతోషం వ్యక్తం చేశారు. 'మా అబ్బాయిని బాగా చదివించడం కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పుడు మా కోసం కారు కొనివ్వడం గర్వంగా ఉంది' అని హర్షం వ్యక్తం చేశారు. తండ్రి వృత్తిని గౌరవిస్తూ తన వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు కారును బహుమతిగా ఇచ్చిన సురేష్ కన్నన్ ప్రశంసలకు అర్హుడు.

మారుతి సుజుకి XL6 విషయానికొస్తే ఇందులో మొత్తం మూడు వేరియంట్‌లు ఉన్నాయి. శివానందం కొనుగోలు చేసింది టాప్-ఆఫ్-ది-లైన్ ఆల్ఫా+. ఈ కారులో 1462 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 101.65 bhp శక్తి వద్ద 136.8 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో ఒకేసారి 6 మంది వరకు ప్రయాణించవచ్చు.
ఈ కారులో 209 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. మారుతి సుజుకి XL6 20.27 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ కారులో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని అమర్చారు. మార్కెట్లో మహీంద్రా XUV 700 ఇంకా హ్యుందాయ్ క్రెటా ఇలా పెద్ద కంపెనీల కార్లతో పోటీపడుతోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








