తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

చాలా మందికి సొంతకారు కలిగి ఉండాలన్నది ఒక కల. కొందరు వీటిని నిజం చేసుకుంటారు. మరికొందరు బహుమతుల ద్వారా పొందుతారు. అయితే కొంతమందికి కల కలగానే మిగిలిపోతుంది. కానీ ఈ కల నిజమైతే మాత్రం ఆ ఆనందం మాటల్లో చెప్పడానికి వీలు కాదు.

తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

కొంతమంది కలలను తమ పిల్లలు తీరుస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చూసి ఉంటాం.. అయితే ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఒక కుమారుడు తన తండ్రికి హ్యుందాయ్ క్రెటా కారును గిఫ్ట్ గా ఇచ్చి తన కలను నిజం చేశాడు. తండ్రికి బహుమతిగా కారును ఇచ్చిన కొడుకు ఈ సంఘటనలన్నింటినీ వీడియో తీసి, ఈ వీడియోను ధర్మన్ పురోహిత్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

ఈ వీడియోలో కొడుకు తన తండ్రికి నచ్చిన కారును ఎంచుకోవడంతో మొదలుకొని అన్ని సంఘటనలు చూడవచ్చు. కార్లను ఇష్టపడే తన తండ్రికి కారు ఇవ్వాలన్న తన కలను ఒక కొడుకు వివరించడంతో వీడియో ప్రారంభమవుతుంది.

MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

ఈ వీడియోలోని సమాచారం ప్రకారం, ఆ తండ్రి కొత్త కార్లంటే చాలా ఇష్టం. కొత్త కార్లను చూసిన వెంటనే వారికి ఆ కార్ల గురించి సమాచారం వస్తుంది. కొత్త కారు కొనాలన్నది అతని కల. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతని కల నెరవేరలేదు. ఈ కారణంగా వారి కొడుకు వారికి కొత్త కారు గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

తండ్రి మరియు కొడుకు ఇద్దరూ తమ బడ్జెట్‌కు సరిపోయే కారు కోసం వెతకడం ప్రారంభించారు. చివరగా హ్యుందాయ్ క్రెటా కారును ఎంచుకుని, హ్యుందాయ్ డీలర్ వద్దకు వెళ్లి క్రెటా కారును బుక్ చేసుకున్నారు. కొద్ది రోజుల తరువాత వారు బుక్ చేసుకున్న క్రెటా కారు డీలర్‌షిప్ వద్దకు వచ్చింది.

MOST READ:అలెర్ట్.. యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించాలంటే ఈ యాప్ తప్పనిసరి

తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

తండ్రి, కొడుకు ఇద్దరూ డీలర్‌షిప్‌కు వెళ్లి కారును పూర్తిగా పరిశీలించారు. ఆ సమయంలో ఆ కొత్త కారు తమ సొంతం అవుతుందని తెలిసిన ఆ తండ్రి ముఖంలో కనిపించే ఆనందాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అతను కారు చుట్టూ తనిఖీ చేశాడు, కాసేపు కారులో కూర్చున్నాడు. వచ్చే వారం వారికి కారు అందజేయనున్నట్లు డీలర్ తెలిపారు.

డీలర్‌షిప్ వారు కారును డెలివరీ చేసిన రోజు వర్షం పడుతోంది. అయితే, కుటుంబం ఆటో రిక్షాలో షోరూంకు చేరుకుంది. కారు తీసుకోవడానికి సంబంధిత పత్రాలపై సంతకం పెట్టారు. కారు డెలివరీ అయిన తర్వాత కుటుంబ సభ్యుల ముఖంలో ఉన్న ఆనందాన్ని వీడియోలో చూడవచ్చు.

MOST READ:భర్తకు 16 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చిన తెలుగు యాంకర్ లాస్య

తండ్రికి నచ్చినదానిని సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు.. ఆ గిఫ్ట్ ఏంటో చూసారా..!

కారు డెలివరీ అయిన తరువాత, వారు కారును ఆలయానికి తీసుకెళ్ళి కారుకు పూజ చేశారు. మన దేశంలో పిల్లలు ఈ కార్లను వారి తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఏది ఏమైనా తండ్రి కోరిక తీర్చడంలో ఉన్న ఆనందం కోరిక తీర్చిన కొడుకులకు మాత్రమే తెలుసు.

Most Read Articles

English summary
Son Gifts Hyundai Creta Car To His Dad. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X