Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తండ్రి కోసం 13 సంవత్సరాల క్రితం అమ్మిన కారుని తిరిగి తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చిన కొడుకు
చాలా మందికి వారి వాహనాలతో ఎనలేని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వారు తమ జీవితంలో కొనుగోలు చేసిన మొదటి వాహనం కావడమే. చాలా సంవత్సరాల క్రితం జీవితంలో మొదటి కారు కోండం అనేది నిజంగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. ఇలాంటి సంఘటనే మనం ఇప్పుడు చూడబోతున్నాం..

13 సంవత్సరాల క్రితం తన జీవితంలో మొదటి కారును కొన్న వ్యక్తి కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ నజీర్. అబ్దుల్ నజీర్ 1992 లో మారుతి 800 ను వారి మొదటి కారుగా కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఈ కారు 15 సంవత్సరాలుగా కుటుంబంలో భాగంగా ఉంది. అబ్దుల్ నజీర్‌తో పాటు అతని కుమారుడు నియాజ్ అహ్మద్ ఈ కారును చాలా ఇష్టపడేవాడు.

ఈ కారుతో, అబ్దుల్ నజీర్ తన కొడుకు నియాజ్ కు కారు నడపడం నేర్పించాడు. అబ్దుల్ నజీర్ ఈ కారును 2007 లో కోజికోడ్‌కు చెందిన వ్యక్తికి రూ. 42 వేలకు అమ్మారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో పొడవైన సింగిల్ లేన్ ఫ్లైఓవర్, ఇదే

కారు అమ్మిన కొన్ని నెలల తర్వాత గుర్తుకు రావడం ప్రారంభమైంది. కారు విక్రయించిన సుమారు మూడు సంవత్సరాల తరువాత, కారును తిరిగి పొందాలనే కోరికను వ్యక్తం చేశాడు. వారి తండ్రి కోరికను నెరవేర్చిన నియాజ్, అప్పటికే అమ్మేసిన ఈ మారుతి 800 కారు కోసం అన్వేషణ ప్రారంభించాడు. నియాస్ కారు కొన్న వ్యక్తిని కలిశాడు. కానీ ఆ వ్యక్తి కారును వేరొకరికి అమ్మేశాడు.

కారు కొన్న వ్యక్తి కొట్టాయం కి చెందిన వాడిగా తెలుసుకున్నాడు. కానీ కారు కొనుగోలుదారుడి చిరునామా లేదా ఇతర సమాచారం అందుబాటులో లేదు. కానీ నియస్ పటు వదలకుండా కారు కొన్నవారి కోసం వెతుకుతూనే ఉన్నాడు.
MOST READ:వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?

2019 చివరలో ఈ కారును త్రివేండ్రంకు చెందిన ఉమేష్ ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్నాడు. నియాజ్ ఉమేష్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని, మారుతి 800 తనకు కావాలని అమ్మమని చెప్పాడు. అయితే ఉమేష్ కారు అమ్మడానికి నిరాకరించారు. అయితే నియాస్ ఉమేష్‌తో సన్నిహితంగా ఉండటమే కాకుండా తనకు మరియు అతని కుటుంబానికి కారుతో ఉన్న సంబంధాన్ని గురించి చెప్పి ఒప్పించాడు.

చివరకు ఉమేష్ తమ వద్ద ఉన్న కారును అమ్మడానికి అంగీకరించాడు. గత నెలలో నియాజ్, ఉమేష్ కారును ఒక లక్ష రూపాయలు చెల్లించి కొనుక్కున్నాడు. తన తండ్రి 54 వ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి అబ్దుల్ నజీర్‌కు నియాజ్ ఈ మారుతి 800 కారును బహుమతిగా ఇచ్చాడు. దీనిపై కథనాన్ని మాతృభూమి నివేదించింది.
Source: Mathrubhumi
MOST READ:జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా