తల్లిదండ్రులను సర్‌ప్రైజ్‌ చేసిన కొడుకు.. వీడియో చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వలసిందే!

సాధారణంగా చాలామంది తల్లిదండ్రులే పిల్లలకు వారికి నచ్చినవి గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్‌ ఇస్తుంటారు. కానీ ఆధునిక కాలంలో కొందరు పిల్లలే తమ తల్లిందండ్రులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్న. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో ఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. గిఫ్ట్స్ తీసుకున్న తల్లిదండ్రల ఫీలింగ్స్ ఆ సమయంలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..

బాబు భయ్యాగా ప్రసిద్ధి చెందిన ది యూకే07 రైడర్ అనే యూట్యూబర్ దీనికి సంబంధించిన వీడియోను అప్‌లోడ్ చేశారు. ఇందులో హోస్ట్ లేదా యువకుడు తన తల్లిదండ్రులకు ఇష్టమైన టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ లెజెండర్ గిఫ్ట్ ఇవ్వడం చూడవచ్చు. అంతకంటే ముందు అతడు డీలర్షిప్ సందర్శించడం.. కారు కొనుగోలు చేయడానికి కావాల్సిన అన్ని పార్మాలిటీస్ పూర్తి చేసి డెలివరీ తీసుకుంటాడు.

Son Gifts Parents Toyota Fortuner Legender

ఫార్చ్యూనర్ లెజెండర్ కారును డెలివరీ తీసుకున్న తరువాత దాన్ని ఇంటికి తీసుకు వస్తాడు. అయితే అతిని తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో ఉండరు. ఆ సమయంలో అతడు తండ్రికి ఫోన్ చేస్తే పది నిమిషాల్లో చేరుకుంటామని చెప్పారు. తొందరగా ఇంటికి రావాలని.. మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని ఆ యువకుడు తన తండ్రికి చెప్పాడు. మొత్తం మీద అక్కడి సన్నివేశాలన్నీ హాస్యాస్పదంగా జరిగిపోతాయి.

హోస్ట్ తన తల్లిదండ్రుల కోసం కొనుగోలు చేసిన కారు సరికొత్త మోడల్ అని తెలుస్తోంది. అయితే హోస్ట్ తండ్రి 2018 అవెంజర్ బైక్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా వారు 2010 హ్యుందాయ్ శాంత్రో కారును కలిగి ఉన్నట్లు సమాచారం. హోస్ట్ తన తండ్రిని రూ. 40 లక్షల కారును ఎందుకు కొనలేదని అడుగుతాడు. అప్పుడు ఆయన డబ్బు మొత్తం నీ(హోస్ట్) మీదే ఇన్వెస్ట్ చేసాను అని కామెడీగా బదులిచ్చారు.

Son Gifts Parents Toyota Fortuner Legender

మొత్తం సంభాషణ జరిగిన తరువాత హోస్ట్ కారును తన తండ్రి ముంచుకు తీసుకు వస్తాడు. కొత్త కారును చూసిన ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. ఆ తరువాత అతడు తన తండ్రికి కారు కీ (తాళం) అందిస్తాడు. ఆ తరువాత వారు కారుకు పూజ చేసి, స్వీట్స్ కూడా పంచుకుంటారు. వారి కుక్కలను కూడా ఈ సెలబ్రేషన్లలో భాగస్వాములను చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇక భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 7 సీటర్ విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో ఈ SUV ధర రూ. 43.66 లక్షల నుంచి రూ. 47.64 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ఇది 204 పీఎస్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది.

టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 4x2 లేదా 4x4 ఆప్షన్లలో లభిస్తుంది. పనితీరు కూడానా అద్భుతంగా ఉంటుంది. ఇది డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 18, 2024, 10:22 [IST]
English summary
Son gifts parents a brand new toyota fortuner legender
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+