కొడుకు చేసిన పనికి సంబరపడిపోయిన తండ్రి.. మీరెప్పుడైనా ఇలా చేశారా?
చాలామందికి తాము మొదటిసారిగా ఉపయోగించిన వాహనాలతో ఓ అనుబంధం ఉంటుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల అలాంటి వాహనాలు నిరుపయోగంగా ఉంటాయి. మళ్ళీ అవి పునరుద్దరించబడి కంటికి కనిపిస్తే.. ఆ అనుభూతే వేరు. ఇలాంటి ఘటనే ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైంది.
దాదాపు పనికిరాని స్థితిలో ఉన్న బైకును.. మళ్ళీ కొత్త బైకుగా మార్చి తమ తండ్రికి గిఫ్ట్ ఇచ్చిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. తనకు ఇష్టమైన బైకు మళ్ళీ కొత్తగా మారి తనవద్దకు రావడంతో ఆ ఆ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. ఇందులో బైక్ కొత్తగా మారటానికి ముందు.. ఆ తరువాత ఎలా ఉందో చూడవచ్చు.

ఫోటోలలో గమనించినట్లయితే.. కవాసకి బజాజ్ 4ఎస్ ఛాంపియన్ చూడవచ్చు. ఇందులో బైక్ తుప్పు పట్టి, శిధిలావస్థలో ఉండటం చూడవచ్చు. తమ తండ్రి మొదటి బైకును కొత్తదానిలా మార్చి ఇవ్వాలని కొడుకు అనుకున్నాడు. పాఠశాలకు వెళ్ళేటప్పుడు తనని ఆ బైకు మీదే తమ తండ్రి తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. ఈ బైకును మళ్ళీ కొత్తదానిలాగా చూసి తండ్రి చాలా సంబరపడిపోయారు.
కవాసకి 4ఎస్ (Kawasaki 4S) బాగా తుప్పు పట్టిన స్థితిలో ఉండటం చూడవచ్చు. హెడ్‌లైట్ దాదాపు విరిగిపోయింది. ఎగ్జాస్ట్ కూడా బాగా తుప్పు పట్టి ఉండటం గమనించవచ్చు. తుప్పు పట్టిన స్పోక్ వీల్, పెయింట్ కూడా దాదాపు పోయినట్లు ఉంది. నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా కనిపించడం లేదు. సీటు కూడా దాదాపు చివర దశలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి బైకు మళ్ళీ కొత్తగా పురుడు పోసుకుంది.

ఇక కొత్తగా మారిన బైక్ విషయానికి వస్తే.. ఇందులో దాదాపు అన్నీ పునరుద్దరించబడి ఉండటం గమనించవచ్చు. హెడ్‌లైట్, టెయిల్ లైట్, ఎగ్జాస్ట్, సీటు మరియు ఇంజిన్ వంటివన్నీ కొత్తగా ఉండటం చూడవచ్చు. కొత్త పెయింట్ స్కీమ్, కొత్త వీల్స్ అండ్ స్పోక్స్ మరియు ఇండికేటర్స్ అన్నీ కూడా కొత్తవే. మొత్తం మీదే ఇప్పుడే షోరూమ్ నుంచి బయటకు తెచ్చిన బండిలా కవాసకి 4ఎస్ మెరిసిపోతోంది.
నిజానికి 1990 లలో భారతీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన బైకులలో కవాసకి 4ఎస్ ఒకటి. బజాజ్ ఆటో సహకారముతో కవాసకి ఈ బైకును తయారు చేసింది. అందుకే ఫ్యూయల్ ట్యాంక్ మీద బజాజ్ అని ఉండటం చూడవచ్చు. కొనుగోలుదారుల నమ్మకానికి ప్రసిద్ద చెందిన ఈ బైక్ మంచి పనితీరుని అందించింది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది ఉత్తమంగా ఉండేది. మైలేజ్ కూడా అద్భుతంగా ఉంది.
మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ బైకును తయారు చేసింది. ఈ బైక్ సింగిల్ సిలిండర్ 100సీసీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కలిగి 7.7 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ విషయానికి వస్తే.. 70 నుంచి 80 కిమీ/లీ అని తెలుస్తోంది. ఇది రోజు వారీ ప్రయాణాలకు చాలా అనుకూలమైన బైకుగా అప్పట్లోనే ప్రసిద్ధి చెందింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








