తండ్రి ఆఖరి కోరిక తీర్చిన కొడుకు.. ఆ కారు రీమోడలింగ్‌..!

చాలా మందికి సెంటిమెంట్లు ఉంటాయి. అందులో వస్తువులంటే కొందరికి సెంటిమెంట్‌ లేదా వాహనాలు, ప్రదేశాలు ఇంకా చాలానే ఉంటాయ్.. చాలామంది సెంటిమెంట్‌గా భావించే వస్తువుల్లో కార్లు, ఇతర వాహనాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్ననాటి నుంచి మనవద్దే ఉంటూ వచ్చిన వస్తువులను, మనవాళ్లు వినియోగించిన వస్తువులను విడిచిపెట్టలేం. అలాంటి వస్తువులను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా మార్చుకుంటాం. తండ్రి కోరిక నెరవేర్చేందుకు కుమారుడి పడిన యాతనే ఈ కథనం.

చేవ్రొలెట్‌ టవేరా.. అమెరికా ఆటోమోటివ్‌ దిగ్గజం చేవికి చెందిన మోడల్‌. ఈ మల్టీ పర్పస్‌ వెహికల్‌ (MVP)కు భారత్‌లో భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. భారత్‌లో టవేరా భారీగానే కార్లను విక్రయించింది. అయితే అదే స్థాయి వాహనాలను వినియోగదారులకు అందించలేదని కారణంగా భారత్‌ మార్కెట్లో కొత్త వాహనాలను లాంచ్‌ చేయలేకపోయింది. అయినా ఇప్పటికీ చాలా టవేరా కార్లు మన రో‌డ్లపై కనిపిస్తుంటాయి. అలాంటి టవేరా కారునే తన తండ్రి ఆఖరి కోరిక మేరకు ఓ వ్యక్తి రీమోడలింగ్‌కు తీసుకొచ్చాడు.

Chevrolet Tavera

కారు తయారీకి సంబంధించిన వీడియోను Autorounders అనే యూట్యూబ్‌ ఛానల్ తాజాగా షేర్‌ చేసింది. సాధారణంగా ఇలాంటి కార్లను రీమోడల్‌ చేసేందుకు తాను అంగీకరించమని.. అయితే ఇది తన తండ్రి ఆఖరి కోరికని కస్టమర్‌ చెప్పడంతోనే రీమోడలింగ్‌కు అంగీకరించినట్లు పూణే వర్క్‌షాప్‌ యాజమాని తెలిపారు. ఈ కారులో అనేక మార్పులు చేసినట్లు తెలిపారు.

తొలుత టవేరా కారు... పూణే వర్క్‌షాప్‌నకు రాగానే.. అక్కడున్న టెక్నీషియన్లు కారు మొత్తాన్ని విడగొట్టినట్లు చెప్పారు. ఫ్రంట్‌ సేఫ్టీగార్డు, బంపర్‌, హెడ్‌లైట్లు, రూఫ్‌రేక్‌, వెనుక బంపర్‌, లైట్లను విడదీసినట్లు తెలిపారు. కారులోని దెబ్బతిన్న భాగాలను తొలగించిన తర్వాత కొంతమంది నిపుణులైన టెక్నీషియన్లు డెంట్లు, డిగ్‌ల తొలగింపుపై పనిచేసినట్లు చెప్పారు. అనంతరం కారుకు ఒరిజినల్‌ పెయింట్‌ ప్రైమర్‌ వేసినట్లు తెలిపారు. అనంతరం ఫ్యాక్టరీ వైట్‌ కలర్‌ వేసినట్లు చెప్పారు.

పెయింటింగ్‌ పని పూర్తయిన తర్వాత కారు భాగాలను అమర్చినట్లు చెప్పారు. సాధారణంగా ఇలాంటి రీమోడల్‌ పనులు తాము అంగీకరించబోమన్నారు. ఎందుకంటే ఇలాంటి పనులు చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయని చెప్పారు. కానీ ఈ కారును తన తండ్రి ఆఖరికోరిక మేరకు రీమోడలింగ్‌ చేయాలనే కస్టమర్‌ విజ్ఞప్తి మేరకే అంగీకరించినట్లు చెప్పారు. అయితే టవేరా కారు రీమోడలింగ్‌కు తాము అధిక ఛార్జీలను వసూలు చేయబోమన్నారు.

కారు బయట కూడా పెయింటింగ్‌ వర్క్‌ పూర్తయిన తర్వాత మరిన్ని ఫీచర్లు అంటే కారుకు పవర్‌ స్టీరింగ్‌, డబుల్‌ AC అమర్చేందుకు కారును ముంబయికి తరలించినట్లు చెప్పారు.

ఈ కారు రీమోడలింగ్‌ పని అంతా పూర్తయ్యాక కస్టమర్‌కు డెలివరీ చేస్తున్న సమయంలో అతను కొంత భావోద్వేగానికి గురైనట్లు పూణే వర్క్‌షాప్‌ యాజమాని తెలిపారు. తాను మూడో తరగతిలో ఉన్నప్పుడే తన తండ్రి ఈ టవేరా కారును కొనుగోలుచేసినట్లు కస్టమర్‌ చెప్పారన్నారు. తనకు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయన్నారని తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 8, 2023, 16:13 [IST]
English summary
Son restores chevrolet tavera car on his father s last wish
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+