తండ్రి జ్ఞాపకం.. 26 ఏళ్ల తరువాత రోడ్డుపైకి - వీడియో చూస్తే అవాక్కవుతారు!
'రాయల్ ఎన్‌ఫీల్డ్'.. ఇది కేవలం పేరు కాదు, రైడర్ల మనసు దోచిన బ్రాండ్. దీనికి నిదర్శనమే 1979 నాటి 'బుల్లెట్' మళ్ళీ కొత్తగా (రెస్టోరేషన్) మార్చుకోవడం. ఇంతకీ ఈ బైకు ఎవరిది? ఎందుకు మళ్ళీ కొత్తగా మార్చుకున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నిజానికి ఇక్కడ కనిపిస్తున్న బైక్ 1979వ సంవత్సరం నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్. దీని యజమాని ఎన్ఎస్ జోషి. అప్పట్లో ఎర్నాకులంలోని నార్త్ పరవూర్‌లో ఈయనే మొదటి బుల్లెట్ బైక్ ఓనర్. జోషిని అప్పట్లో అందరూ ఎన్‌ఫీల్డ్ జోషి అని పిలిచేవారు. ఈ బైక్ కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్ ఇప్పటికీ ఆయన కొడుకుల దగ్గర ఉన్నట్లు సమాచారం. అప్పట్లో ఈ బైక్ ధర రూ.11399 మాత్రమే.

ఈ బైకుకి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో జోషి కుమారులు కెల్విన్ జోషి, కెవిన్ జోషి ఆ బైకు మీద కూర్చుని ఉండటం చూడవచ్చు. జోషి ఈ బైకుని కొనుగోలు చేసిన తరువాత 1990లో ఓ సారి దీనిని పునరుద్దరించినట్లు సమాచారం. ఆ తరువాత జోషి 2006లో కన్ను మూసారు. దీంతో బైక్ మూలానపడింది. కొన్నాళ్లపాటు ఎవరూ ఈ బైకును ఉపయోగించకపోవడం వల్ల తుప్పు పట్టిపోయింది.
తండ్రి ఉపయోగించిన బైకు తుప్పు పడ్డటం నచ్చక జోషి చిన్న కొడుకు కెవిన్ ఓ మంచి మెకానిక్ ద్వారా బైకుని మళ్ళీ కొత్తగా మార్చాలనుకున్నాడు. అనుకున్న విధంగానే అతడు కొత్తగా మార్చుకున్నాడు. ఈ బైకులో ఇప్పుడు కొత్త స్పోక్ వీల్స్, గోల్డెన్ పిన్‌స్ట్రిపింగ్‌తో కూడిన బ్లాక్ పెయింట్ జాబ్, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లను చూడవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ బైక్ ఫ్రంట్ మడ్‌గార్డ్ మీద ఉండటం చూడవచ్చు.

1998 వరకు ఈ బైకుని జోషి ఉపయోగించారు, ఆ తరువాత దీనిని ఎవరూ ఉపయోగించలేదు. దాదాపు 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బైక్ కొత్త బైకుగా మారి రోడ్డు మీదకు వచ్చింది. ఈ బైక్ ఇప్పుడు చూడటానికి ఇప్పుడే కోన్ బైకు మాదిరిగానే అనిపిస్తుంది. తండ్రి జ్ఞాపకార్థం ఈ బైకుని జోషి కుమారులు ఉపయోగిస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఈ బైక్ మళ్ళీ వాళ్ళ బాల్యాన్ని గుర్తు చేసిందని చెబుతున్నారు.
తల్లిదండ్రులు ఉపయోగించిన వస్తువులు పిల్లలకు ఎప్పుడు జ్ఞాపకంగానే ఉంటాయి. ఎందుకంటే అందులో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడం మాత్రమే కాకుండా.. వాటిని చూసిన ప్రతి సారి వారి బాల్యం కూడా గుర్తొస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే జోషి కొడుకులు తండ్రి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుని మళ్ళీ కొత్తగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ బైకుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలు మార్కెట్లో బైకులను లాంచ్ చేస్తూ మంచి ఆదరణ పొందుతూనే ఉంది. ఇప్పుడు కూడా కంపెనీ తమ కస్టమర్లను ఆకర్శించడానికి ఆధునిక ఉత్పత్తులను లాంచ్ చేస్తూ తన ఉనికిని చాటుకుంటూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ అందిస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు దేశం మొత్తం మీద విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ఈ బ్రాండ్ అమ్మకాలు నెల నెలా పెరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








