తల్లితో కలిసి లాంగ్ రైడ్.. కొడుకును మెచ్చుకుంటున్న నెటిజన్లు (వీడియో)

చాలామంది బైక్ రైడర్లకు లాంగ్ రైడ్ చేయడం ఓ కల. సాధారణంగా కొంతమంది ఒంటరిగా రాష్ట్రాలు, దేశాలను సైతం తమ బైకులతోనే దాటేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ దాదాపు ఒంటరిగా లేదా కొంతమంది బైకర్ల సమూహంతో కలిసి ప్రయాణం సాగిస్తారు. కానీ ఇటీవల ఒక వ్యక్తి తన తల్లితో కలిసి సుమారు 380 కిమీ రోడ్ ట్రిప్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైన నెటిజన్లు మిశ్రమంగా స్పదింస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ముంబైకి చెందిన ఒక వ్యక్తి తన తల్లిని హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 మోటార్‌సైకిల్‌పై తీసుకుని లాంగ్ రైడ్ చేయడం వెలుగులోకి వచ్చింది. వీడియోలో గమనిస్తే.. తల్లి, కొడుకు ఇద్దరూ.. రైడ్ చేయడానికి సిద్ధమయ్యే ముందు షూలు, రైడింగ్ జాకెట్ మొదలైనవి ధరించి, పూజ చేసి రైడ్ మొదలెట్టడం చూడవచ్చు. వీరిరువురు రైడింగ్ సమయంలో సురక్షితంగా ఉండటం కోసం హెల్మెట్స్ కూడా ధరించారు.

Son With Mom on His Harley Davidson X440

తల్లి, కొడుకు వారి రైడ్‌ని ఉదయం 5:30 గంటలకు ప్రారంభించి ముంబై నుంచి బయలుదేరినట్లు తెలిసింది. వీరి ప్రయాణాన్ని మొత్తం బైక్ రైడ్ చేసే వ్యక్త్తో గోప్రో ద్వారా రికార్డ్ చేయబడింది. దీనిని అతని హెల్మెట్‌పై అమర్చినట్లు వీడియోలో చూడవచ్చు. వీరు ఇద్దరూ ఉదయం 10.30 గంటలకు ప్లోడ్‌పూర్ చేరుకుని, అక్కడ వడపాప్ తిన్నారు. తిన్న తరువాత మళ్ళీ వారి ప్రయాణాన్ని కొనసాగించారు.

హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 బైకు మీద తల్లి, కొడుకు సొరంగాలు, పర్వత రహదారుల గిందా వెళ్లడం చూడవచ్చు. అక్కడక్కగా వర్షం కురుస్తున్న సంఘటనలు కనిపించాయి. అయితే వీరు ముందుగానే సేఫ్టీ కోసం రెయిన్ కోట్ వంటివి ధరించి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఆ తరువాత ఒక దగ్గర విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగారు. అక్కడ తల్లి గడ్డి తీయడం కూడా కనిపిస్తుంది.

Son With Mom on His Harley Davidson X440

మొత్తం మీద వారు 380 కిమీ ప్రయాణించి అనుకున్న గమ్యాన్ని సాయంత్రం 4.15 గంటలకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ఎలాంటి ఆటంకాలు ఎదుర్కోకుండా వారు విజయవంతంగా కొంకణ్‌లోని వారి ఇంటికి చేరుకున్నారు. రైడింగ్ పూర్తయిన తరువాత తల్లి, కొడుకు ప్రత్యేకమైన రైడింగ్ అనుభవానికి థంబ్స్ అప్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మొత్తం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీద నెటిజన్లు మిశ్రమ స్పందన ఇస్తున్నారు. కొందరు తల్లిని లాంగ్ రైడ్ తీసుకెళ్లడం గొప్ప అనుభూతి అని చెబుతుంటే.. మరికొందరు వీడియో కోసం తల్లిని ఇబ్బంది పెట్టినట్లు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తల్లిదండ్రులతో కాలం గడపడం అనేది ఓ గొప్ప అనుభూతి అనే చెప్పాలి. వీరు రైడింగ్ సమయంలో తీసుకోవాల్సిన దాదాపు అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు.

ఇక హార్లే డేవిడ్సన్ ఎక్స్400 బైక్ విషయానికి వస్తే.. ఇది బ్రాండ్ యొక్క అత్యంత సరసమైన బైక్. దీని ధర రూ.2.4 లక్షల వరకు ఉంటుంది. మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 440సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 27 Bhp పవర్ మరియు 38 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Sunday, June 23, 2024, 9:00 [IST]
English summary
Son went for a long ride with mom on his harley davidson x440 bike
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+