సినిమాలకు ఫుల్ స్టాప్.. భర్తతో కలిసి సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన అందంతో, నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు సోనమ్. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి నాలుగు ఫిలింఫేర్ అవార్డులకు నామినేట్ కూడా అయింది. సోనమ్ కపూర్ మరెవరో కాదు బాలీవుడ్ యాక్టర్ అనిల్ కుమార్ కుమార్తె. సోనమ్ కపూర్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియాలో థియేటర్ ఆర్ట్స్ చదువుకుంది. 2005లో బ్లాక్ సినిమాకు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి డైరెక్షన్లో మెలకువలను నేర్చుకున్నారు.

సినిమాలకు దూరం: ఆమె సంజయ్ దర్శకత్వంలోనే 2007లో సావరియా చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సోనమ్ కపూర్ 2013లో తమిళ స్టార్ హీరో ధనుష్ తో కలిసి నటించిన 'రాంఝనా' చిత్రంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. 2018లో ఆనంద్ అహుజాను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

Sonam Kapoor Business

డీటైలింగ్ బిజినెస్: తాజాగా ఆమె భర్త ఆనంద్ అహుజాతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. భారతదేశంలో కార్ల అమ్మకాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజు వందల సంఖ్యలో కొత్త కార్లు రోడ్ల మీదకు వస్తున్నాయి. దేశంలో కాస్ట్లీ కార్ల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. అంత ఖరీదు పెట్టి కొన్న కార్లను తమ ఇష్టానుసారం అలంకరించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో కార్ డిటైలింగ్ బిజినెస్ పెరుగుతుంది.

సోనమ్ కొత్త వ్యాపారం: ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ఖరీదైన కార్లను వాటి యజమానుల ఇష్టానుసారం డీటైలింగ్ చేస్తున్నాయి. మన దేశంలో అలాంటి సంస్థలు చాలా తక్కువ. ఈ రకమైన వ్యాపారం ద్వారా యూరప్ లోని కంపెనీలు లక్షలు సంపాదిస్తున్నాయి. సోనమ్ కపూర్ కూడా ప్రస్తుతం తన భర్తతో కలిసి ఇండియాలో అలాంటి ఒక కంపెనీని ప్రారంభించారు. టోపాజ్ డీటెయిలింగ్ యూకేలో కారు డీటైలింగ్ రంగంలో పాపులర్ కంపెనీ.

Sonam Kapoor Anand Ahuja

భారత్‎కు రాక: ఈ యూకే కంపెనీ ఇప్పుడు అధికారికంగా భారత్‎లోకి ఎంట్రీ ఇచ్చింది. సోనమ్, ఆమె భర్త ఈ కంపెనీని మన దేశానికి తీసుకొచ్చారు. టోపాజ్ డీటైలింగ్ కంపెనీతో పార్టనర్ షిప్ కుదుర్చుకున్నట్లు ఆనంద్ ఇన్‌స్టాగ్రామ్‎లో ధృవీకరించారు. ఈ ఫోటోల్లో సోనమ్ తో పాటు తన భర్త, టోపాజ్ డీటైలింగ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‎లను చూడవచ్చు. ఇప్పటికే ఆనంద్ 'భానే' అనే వస్త్రాల డిజైన్ & మార్కెటింగ్ కంపెనీని నడుపుతున్నారు.

కంపెనీ నెట్‎వర్క్: ఏడాదికి రూ.500 కోట్ల టర్నోవర్ కల 'భానే' కంపెనీకి యూకేలో కూడా నెట్‌వర్క్ ఉంది. అలా ఆనంద్ అహుజాకు టోపాజ్ డీటెయిలింగ్ పరిచయం ఏర్పడింది. చాలా ఏళ్లుగా టోపాజ్ డీటెయిలింగ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆనంద్ అహుజా ఎప్పుడూ టోపాజ్ డీటెయిలింగ్ కస్టమర్ కాదు. ఇటీవల తన ఖరీదైన కారును టోపాజ్ డిటైలింగ్ కంపెనీకి ఇచ్చి, దానిని అలంకరించాలని సూచించాడు.

sonam anand

ఆలోచనకు కార్యరూపం: అలా టోపాజ్ డీటెయిలింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకున్నారు. వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. అదే వారిని మన దేశానికి తీసుకొచ్చింది. గత కొన్నాళ్లుగా తన భార్య సోనమ్ కపూర్‌తో కలిసి తరచుగా ఆనంద్ అహుజా యూకేను సందర్శిస్తున్నాడు. ఈ పార్టనర్ షిప్ కు సంబంధించిన చర్చలు ఇప్పుడు పూర్తయ్యాయి.

ఆనంద్ అహుజా సహాయంతో టోపాజ్ డీటెయిలింగ్ భారత్ లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. యూకేలో చాలా పెద్ద కంపెనీ అయినప్పటికీ టోపాజ్ డీటెయిలింగ్ నెట్‌వర్క్ యూకే వెలుపల మరెక్కడా లేదు. టోపాజ్ కార్ డీటెయిలింగ్ కంపెనీకి భారత్ రెండవ స్థానం అవుతుంది. భారతదేశంలో కంపెనీ మొదటి షోరూమ్ ఎక్కడ స్థాపించనుందో ఇంకా ఖచ్చితంగా తెలియదు. బహుశా ముంబై లేదా ఢిల్లీలలో ఓపెన్ చేయవచ్చు.

Article Published On: Friday, March 7, 2025, 17:45 [IST]
English summary
Sonam kapoor takes a break from films to start new business with husband anand ahuja
Read more on: #offbeat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+