Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రియల్ లైఫ్ హీరో సోను సూద్ : అతడు నడిపే కార్లు చూసారా !
కరోనా వైరస్ ప్రభావం వల్ల బాధపడుతున్న చాలామందికి సహాయం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. బాలీవుడ్ నటుడు మాత్రమే కాకుండా విలన్ పాత్రలు చేయడం వల్ల కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల కాలంలో అతను బస్సులను అద్దెకు తీసుకొని మహారాష్ట్ర నుండి వలస వచ్చిన కార్మికులను వారి ఇళ్లకు పంపించడానికి చేసిన ప్రయత్నాల వల్ల చాలా మందికి నిజ జీవిత హీరోగా మారిపోయాడు.

వేలాది మంది వలసదారులను ఇంటికి పంపించడానికి సోను లక్షల రూపాయలు ఖర్చు చేశారు మరియు చాలా మంది ప్రశంసలు అందుకున్నారు. సోను సూద్ చాలా మందికి రియల్ హీరో అయ్యాడు. ఇంత ప్రాచుర్యం పొందిన సోనూ సూద్ నడిపే కార్ల గురించి పూర్తిగా ఇక్కడ చూద్దాం..

పోర్స్చే పనామెరా :
జర్మన్ బ్రాండ్ అయిన పోర్స్చే పనామెరా మొదటి ఫోర్-డోర్స్ కూపే మరియు ఇది భారతదేశంలో అత్యంత ప్రాక్టికల్ పోర్ష్లలో ఒకటిగా చెప్పబడింది. సోను సూద్ కొన్నేళ్ల క్రితం పనామెరాను కొన్నాడు. సోనూ సూద్ ఈ కారుని క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా నగర రహదారులపై తిరగడానికి కూడా ఉపయోగిస్తాడు.
MOST READ:విమానాశ్రయాల్లో తిరిగి సర్వీస్ ప్రారంభించిన ఓలా, ఎక్కడెక్కడో తెలుసా ?

సోను నడుపుతున్న పనామెరా 3.0 లీటర్ వి 6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 250 బిహెచ్పి శక్తిని మరియు 550 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు చూడటానికి చాలా ఆకర్షనీయమైన రూపాన్ని కలిగి ఉంటుంది.

ఆడి క్యూ 7 :
సోనూ సూద్ దగ్గర చాల కాలంగా ఉన్న కారు ఆడిక్యూ 7. అతడు ఆడి క్యూ 7 లో తిరుగుతూ ఉండేవాడు. ఇది ఒక సంఘటన ద్వారా మంటల్లోకి చిక్కుకుంది. ఆ సంఘటన జరిగిన కొద్ది వారాలకే సోను మరో క్యూ 7 ను కొనుగోలు చేసి తన రెగ్యులర్ డైలీ డ్రైవ్ కారుగా ఉపయోగించాడు. సోను సూద్ తన సినిమాలలలో ఆడి క్యూ 7 ను కూడా ఉపయోగిస్తున్నారు.
MOST READ:వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జూమ్‌కార్ సంస్థ

మెర్సిడెస్ బెంజ్ ML-క్లాస్ :
ఇది మిడ్-సైజ్ ఎస్యూవీ. సోనూ సూద్ మెర్సిడెస్ బెంజ్-ఎంఎల్ క్లాస్ కూడా కలిగి ఉన్నాడు. ఎంఎల్- క్లాస్ నిలిపివేయబడనప్పటికీ, పేరు GLE తో భర్తీ చేయబడింది.

తెలుపు రంగు ఎంఎల్- క్లాస్ అతని రెగ్యులర్ కార్లలో ఒకటి మరియు అతను తన SUV యొక్క కో-డ్రైవర్ సీటులో చాలా తరచుగా కనిపించాడు. సోను సూద్ యొక్క ఎంఎల్-క్లాస్ ఇప్పుడు చాలా పాతది, కానీ ఇది ఇప్పటికీ అగ్రస్థానంలో ఉంది. అతను ఇప్పటికీ ప్రతిసారీ ఈ వాహనాన్ని ఉపయోగిస్తాడు.
MOST READ:2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

బజాజ్ చేతక్ :
మనలో చాలా మంది తమ తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంలో ప్రయాణించినది ఎప్పటికి గుర్తుంచుకుంటారు. సోను సూద్ తన తండ్రి జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలని అనుకున్నాడు, అందువల్ల అతను ఇప్పటికీ పాత బజాజ్ చేతక్ స్కూటర్‌ను కలిగి ఉన్నాడు.
View this post on InstagramA post shared by Sonu Sood (@sonu_sood) on
ఈ బజాజ్ చేతక్ స్కూటర్ ని కూడా నడుపుతాడు. తన ముంబైలోని ఇంటి నుండి స్కూటర్ నడుపుతున్న వీడియోను సోను సోషల్ మీడియాలో ఉంచాడు. అంతే కాకుండా ఈ వాహనాన్ని నడుపుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.
MOST READ:భారతదేశంలో మొట్టమొదటి కరోనా టెస్టింగ్ బస్, ఇదే

మారుతి సుజుకి జెన్ :
ఇది సోనూ సూద్ యొక్క మొదటి కార్. ఇప్పటికి తన మొదటి కారు తన వద్ద ఉందని సోను సూద్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇది మారుతి సుజుకి జెన్.

ఈ కారు పంజాబ్‌లోని తన ఇంటి వద్ద ఆపి ఉంచబడి ఉంటుంది. అందుకే ఇది అతనితో ఇంకా గుర్తించబడలేదు కాని అతను పంజాబ్‌కు తిరిగి వచ్చినప్పుడల్లా అతను హ్యాచ్‌బ్యాక్‌లో తిరుగుతాడని తెలిపారు. జెన్ దాని సమయంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మరియు డ్రైవ్ చేయడం చాలా సరదాగా ఉంటుంది.