లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

గత సంవత్సరం దేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలు జీవితాలను తలకిందులు చేసింది. ఈ మహమ్మారి కారణంగా దినసరి కూలీలు, వలస కార్మికులు మొదలైన వారు ఎంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ సమయంలో వారి నుంచి ఎటువంటి ఫలితం ఆశించకుండా ఉదారంగా సేవలందించడానికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ సోను సూద్ ముందుకు వచ్చాడు.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

కరోనా వేళ కలియుగ దానకర్ణునిగా పేరుపొందిన సోనూసూద్ ఎంతోమంది అభాగ్యుల పాలిట దేవుడుగా నిలిచాడు. అది మాత్రమే కాదు ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాపించిన కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా సోనూ సూద్ ప్రజలకు ఎంతో సేవ చేశారు.దీనికి సంబంధించిన కథనాలు ఇదివరకు చాలా వెలుగులోకి వచ్చాయి.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

అయితే ఇటీవల కాలంలో సోనూసూద్ కి సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఇటీవల విడుదల చేసిన మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీతో సోను సూద్‌ను చూడవచ్చు. ఈ ఖరీదైన లగ్జరీ కారును సోను సూద్ తన కొడుకుకు బహుమతిగా ఇచ్చినట్లు వీడియోలో తెలుస్తుంది.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

ఈ వీడియోపై సోనూసూద్ స్పందిస్తూ, ఈ లగ్జరీ కారు కొనలేదని, దీనిపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అతడు తెలిపాడు. ఈ కారుని కేవలం టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకువచ్చినట్లు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న ఈ బ్లాక్ మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీని సోను సూద్ ఇంటి ముందు ఆపి ఉంచబడింది.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

ఈ వీడియోలో, షోరూమ్ ఉద్యోగి సోను సూద్ ఉన్న కారులోని ఫీచర్స్ గురించి వివరించారు. ఇది చూసిన వారు సోను సూద్ కొత్త కారు కొన్నారని పుకార్లు వచ్చాయి. అయినప్పటికీ ఫాదర్స్ డే సందర్భంగా, పిల్లలు తనకేదైనా ఇవ్వాలి కానీ తానెందుకు తన కొడుక్కి కారు కొనిస్తానని ప్రశ్నించాడు.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

మెర్సిడెస్ బెంజ్ మేబాక్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీ యొక్క విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ ఇటీవల కాలంలోనే దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి సిబియు రూపంలో దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కంపెనీ ఈ ఎస్‌యూవీని ఒక మోడల్‌లో మాత్రమే విక్రయిస్తున్నారు.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ ధర రూ. 2.43 కోట్లు. మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుంది.

లగ్జరీ కార్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన సోనూసూద్

ఈ కారులోని ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే పవర్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
Sonu Sood Denies News About Gifting Luxury Car To His Son. Read in Telugu.
Story first published: Tuesday, June 22, 2021, 14:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X