కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్

గత సంవత్సరం దేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రజలు జీవితాలను తలకిందులు చేసింది. ఈ మహమ్మారి కారణంగా దినసరి కూలీలు, వలస కార్మికులు మొదలైన వారు ఎంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ సమాయంలో వారి నుంచి ఎటువంటి ఫలితం ఆశించకుండా ఉదారంగా సేవలందించడానికి ప్రముఖ బాలీవుడ్ స్టార్ సోను సూద్ ముందుకు వచ్చాడు.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

కరోనా వేళ కలియుగ దానకర్ణునిగా పేరుపొందిన సోనూసూద్ ఎంతోమంది అభాగ్యుల పాలిట దేవుడుగా నిలిచాడు. అది మాత్రమే కాదు ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాపించిన కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా సోనూ సూద్ ప్రజలకు ఎంతో సేవ చేశారు.దీనికి సంబంధించిన కథనాలు ఇదివరకు చాలా వెలుగులోకి వచ్చాయి.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

ఇదిలా ఉండగా ఇటీవల సోనూ సూద్ కి సంబంధించిన ఒక వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలో సోనూ సూద్ ఇటీవల విడుదల చేసిన కొత్త మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీతో తన కుటుంబంతో కలిసి కనిపిస్తాడు. ఈ ఎస్‌యూవీని తన కుమారుడు ఆర్యన్ కి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిసింది.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో మీరు బ్లాక్ మెర్సిడెస్ మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీని చూడవచ్చు. ఈ ఎస్‌యూవీఐ పరిశీలించిన తరువాత సోను సూద్ తన పిల్లలతో కలిసి ఇంటికి బయలుదేరాడు. సోను సూద్ డ్రైవర్ సీట్లో కూర్చొని ఉండటం చూడవచ్చు.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఆడి క్యూ 7 తో సహా అనేక టాప్ ఎండ్ కార్లు మరియు ఎస్‌యూవీలను కలిగి ఉన్నాడు. ఇప్పడు అతని గ్యారేజ్ లో ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీ కూడా చేరింది.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూ కేవలం 50 యూనిట్లీ మాత్రమే భారత మార్కెట్ కి పరిమితం చేయబడ్డాయి. అయితే కంపేనీ అందించిన సమాచారం ప్రకారం ఈ 50 యూనిట్లు ఇప్పటికే అమ్ముడయినట్లు తెలిసింది. ఇది లాంచ్ అయినా రెండవ రోజుకే మొత్తం బుకింగ్స్ పూర్తయ్యాయి.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ యొక్క బేస్ మోడల్ ధర భారతదేశంలో రూ. 2.43 కోట్లు. మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు అధునాతన టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల అతి త్వరలోనే మొత్తం అమ్ముడయ్యాయి.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 12.3 ఇంచెస్ MBX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్ మరియు డాష్‌బోర్డ్‌లోని నాప్ప లెదర్ వంటివి ఉన్నాయి.

ఈ లగ్జరీ ఎస్‌యూవీకి 4.0 లీటర్ వి 8 ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

కొడుకు కోసం 2 కోట్ల కంటే ఖరీదైన కారు కొన్న సోనూసూద్; వివరాలు

ఈ ఇంజిన్ 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. కావున ఇది ఇంజన్ నుండి వచ్చే పవర్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Image Courtesy: Bol Bollywood

More from DriveSpark

Article Published On: Tuesday, June 15, 2021, 9:17 [IST]
English summary
Sonu Sood Gifts Son A Mercedes-Maybach GLS600 Super Luxury SUV. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+