వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారు. అంతే కాకుండా వలస కార్మికులు కూడా ఎక్కడికక్కడ నిర్బంధంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో వలస కార్మికులను వారి ఇళ్లకు పంపడానికి సోను సూద్ చాలా సహాయం చేశారు.

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

కరోనా లాక్ డౌన్ లో పేద ప్రజలకు అండగా నిలబడిన సోనూ సూద్ ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చాడు . ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ఒక పేద కుటుంబానికి ట్రాక్టర్ గిఫ్ట్ గా ఇచ్చారు.

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

పొలం దున్నుటానికి ఎద్దులు లేకపోవడం వల్ల తండ్రి వ్యవసాయ పనుల్లో సాయం చేసేందుకు కాడెద్దులుగా మారిన కూతుళ్లను వీడియోలో చూసిన సోనూ సూద్ చలించిపోయారు. తండ్రి వ్యవసాయపనుల్లో కాడెద్దులుగా మారిన కూతుళ్ళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను సోను సూద్ ట్విట్టర్‌లో చూశాడు. తర్వాత ఆ సాయంత్రం ట్రాక్టర్ కుటుంబానికి చేరుకుంటుందని సమాచారం ఇచ్చాడు.

MOST READ:కొత్త వాహనాలు కొనాలనుకుంటే ఆగస్ట్ 1 నుంచి కొనండి, ఎందుకంటే

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు మదనపల్లికి చెందిన నాగేశ్వర రావు కుటుంబం పేద కుటుంబం అంతే కాకుండా తన పొలంలో వ్యవసాయం చేస్తూ గడిపేవాడు. ఆ రైతు ఇంట్లో ఉన్న ఇద్దరు బాలికలు కూడా వ్యవసాయంలో కూడా సహాయం చేస్తారు, ఆ ఇద్దరు బాలికలు తమ పొలంలో కాడెద్దులుగా మారారు. ఈ సంఘటన ఒక జర్నలిస్ట్ కంట్లో పడింది. ఈ సంఘటన వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టాడు.

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

ఈ వీడియోను చూసిన సోనూ చలించిపోయాడు. ఆ కుటుంబానికి ట్రాక్టర్ డెలివరీ చేస్తానని సోను సూద్ ఇచ్చిన వాగ్దానం ఇచ్చారు. సోనూ సూద్ వాగ్దానం ప్రకారం అదే రోజు సాయంత్రం నాగేశ్వర్ రావు కుటుంబానికి సోనాలిక ట్రాక్టర్ చేరుకుంది. ఈ ట్రాక్టర్ ద్వారా అతడు సులభంగా వ్యవసాయం చేసుకోవచ్చు.

MOST READ:భారత్ నుంచి బంగ్లాదేశ్‌కి చేరనున్న 51 టాటా ఏస్ ట్రక్కులు

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమయంలో సూనూ సూద్ చాలామందికి సహాయం చేశారు.

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

ఈ పేద కుటుంబానికి ట్రాక్టర్ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ టిడిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ కుటుంబ కుమార్తెలు మరియు వారి కలలను నెరవేర్చడంలో సహకరించి వారి చదువుకోసం కావలిసిన ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

MOST READ:బస్ చార్జీలను నిర్ణయించే కొత్త సాఫ్ట్‌వేర్, ఎక్కడో తెలుసా..!

టిడిపి అధినేత చంద్రబాబు సోను సూద్‌తో కూడా మాట్లాడి అభినందించాడు. చాలా మంది సోషల్ మీడియా అభిమానులు సోను సూద్ సహాయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇటీవల విదేశాలలో చిక్కుకున్న చాలా మంది విద్యార్థులను తిరిగి తీసుకురావడంలో కూడా సోనూ సూద్ పాత్ర ఎంతో ఉంది.

వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్

ప్రపంచంలోని అనేక దేశాలలో భారతీయులు ఇప్పటికీ చిక్కుకున్నారు మరియు భారత ప్రభుత్వం కూడా చాలా మందిని తిరిగి తీసుకువచ్చింది. ఇందులో సోనూ సూద్ కూడా చాలా హెల్ప్ చేసాడు. కరోనా వల్ల కష్టాల్లో ఉన్న ఎంతోమంది ప్రజలకు సేవ చేసి పేదల పాలిట అండగా నిలబడిన సోనూ నిజంగా అభినందనీయుడు.

MOST READ:కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Most Read Articles

English summary
Sonu Sood Gifts Tractor to AP Family. Read in Telugu.
Story first published: Tuesday, July 28, 2020, 13:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X