ప్రియమైన 'సోనూ సూద్' ఇలా చేయడం తప్పు: Northern Railway స్వీట్ వార్ణింగ్

"సోనూ సూద్" ఈ పేరుకి భారతదేశంలో పెద్దగా పరిచయం అవసరం లేదు, కరోనా రాకముందు ఈ పేరు కొంతమందికి తెలియకపోయినప్పటికీ, కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో అపర దానకర్ణుడైపోయి అందరి మనసుల్లో నిలిచిపోయాడు. అయితే ఇటీవల సోనూ సూద్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో వైరల్ అయినా వీడియోలో సోనూ సూద్ ఒక ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు, అయితే అతను ట్రైన్ యొక్క డోర్ వద్ద కూర్చుని ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీని పైన పోలీసులు మాత్రమే కాకుండా నార్త్‌ రైల్వే అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలబ్రిటీ అయిన సోనూ సూద్ ఇలా చేస్తే తప్పకుండా అభిమానూలు కూడా ఇలా చేసే అవకాశం ఉందని తెలిపారు.

ప్రియమైన సోనూసూద్ ఇలా చేయడం తప్పు

ఈ వీడియో 2022 డిసెంబర్ 13 న సోనూసూద్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్‌లోడ్ చేశారు. 22 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో సోనూసూద్ కదులుతున్న ట్రైన్ డోర్ వద్ద కాలి వేళ్ళ మీద కూర్చుని డోర్ యొక్క హ్యాండిల్ పట్టుకుని గాలిని ఆస్వాదిస్తున్నాడు. ఇది అప్పటికి సరదాగానే ఉన్నప్పటికీ ఆదమరిస్తే అనుకోని ప్రమాదం జరుగుతుంది. కావున ఇలాంటి పనులకు వీలైనంత దూరంగా ఉండాలి.

ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు సోనూ సూద్ చేసిన పనిని తప్పు పట్టారు. ఇలాంటి వీడియోలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసేముందు తప్పకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలని కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా చాలామందికి రోల్ మోడల్‌గా నిలిచిన మీరు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని ఒక నెటిజన్ కోరారు. మరో కొంతమంది సోనూ సూద్ మీద చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ వీడియో పైన ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ అధికారిక హ్యాండిల్ అయిన GRP ముంబై కూడా @సోనూసూద్ ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించడం సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కి బాగుంటుంది, కానీ నిజ జీవితంలో ఇలాంటివి చేయకూడదు, తప్పకుండా అన్ని భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు. సోనూ సూద్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది. దీని పైనా వివిధ రకాల స్పందనలు వస్తున్నాయి.

దీని పైన నార్త్‌ రైల్వే అధికారులు స్పందిస్తూ.. డియర్‌ సోనూ సూద్‌, మీరు ప్రపంచంలో చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచారు. అయితే రైలు ప్రయాణంలో ఫుట్‌ బోర్డు మీద ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఇలాంటి ప్రమాదకరమైన వీడియోలను మీ ఫ్యాన్స్ తప్పకుండా అనుసరించవచ్చు. దయచేసి ఇలా చేయకండి. జాగ్రతగా ప్రయాణించండి ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.

కరోనా సమయంలో కష్టం అన్న వారికి కాదనకుండా సాయం చేసి కలియుగ దానకర్ణునిగా పేరు తెచ్చుకున్న సోనూ సూద్ పై ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ప్రజలు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు సైతం సోనూసూద్ ని కొనియాడాయి. సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ నిజ జీవితంలో చాలామంది జీవితాల్లో వెలుగు నింపి హీరోగా నిలిచాడు. రవాణా లేని సమయంలో ఎంతో మంది ప్రజలను తమ సొంత గూటికి చేర్పించాడు.

సొంత ఆస్తులను కూడా అమ్ముకుని ప్రజలకు సేవ చేసిన సోనూ సూద్ పైన ఇప్పుడు చాలామంది కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ట్రైన్ ఫుట్ బోర్డు మీద ప్రయాణం చేసే వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం. నిజానికి ఇది చాలా ప్రమాదమే, అందులోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినా సోనూ సూద్ ఇలా చేయడం వల్ల అభిమానులు కూడా ఇలా చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 5, 2023, 16:50 [IST]
English summary
Sonu sood travels on moving train footboard video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+