రూ.50 లక్షల బైక్ డెలివెరీ!.. చూడగానే ఫిదా అవుతున్న నెటిజన్స్
కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించి అల్లకల్లోలం సృష్టించిన తరువాత చాలా మంది ప్రజలు సొంత వాహనాలను ఉపయోగించడానికి సుముఖత చూపారు. ఈ తరుణంలో కొంతమంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే.. మరికొందరు సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. సరసమైన వాహనాలకు మాత్రమే కాకుండా ఖరీదైన వాహనాలకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో వాహన తయారీ సంస్థలన్నీ ఖరీదైన వెహికల్స్ లాంచ్ చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఇటీవల ట్రయంఫ్ మరియు హార్లే డేవిడ్సన్ కంపెనీలు లక్షల ఖరీదైన బైకులు మార్కెట్లో లాంచ్ చేశాయి.
కవాసకి మరియు డుకాటీ వంటి కంపెనీలు కూడా ఖరీదైన బైకులు లాంచ్ చేస్తున్నాయి. ఈ సమయంలో హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో 'గోల్డ్ వింగ్ టూర్' ప్రారంభించింది. కాగా ఇప్పుడు డెలివరీలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ ధర మార్కెట్లో రూ. 40.36 లక్షలు (ఎక్స్ షోరూమ్).

భారతదేశంలో హోండా గోల్డ్ వింగ్ టూర్ ఆన్ రోడ్ ధర రూ. 50.17 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ బైక్ భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU)గా అందుబాటులో ఉంటుంది. అంటే ఇది పూర్తిగా విదేశాల్లో తయారై.. భారతదేశానికి దిగుమతి అవుతుంది. ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూరింగ్ బైకులలో ఒకటైన గోల్డ్ వింగ్ టూర్ బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా దిగుమతి అవుతుంది.
సుమారు 390 కేజీల బరువున్న హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్.. మంచి డిజైన్ కాకుండా, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ పరిమాణం పరంగా పెద్దదిగా ఉండటం వల్ల బైక్ రైడర్ మంచి రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ప్రత్యేకించి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే దీనిని పార్కింగ్ చేయాలంటే కొంత స్పేస్ ఎక్కువ అవసరమనే చెప్పాలి.
హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ 1833 సీసీ లిక్విడ్ కూల్డ్ 24 వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 125 Bhp పవర్ మరియు 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ త్రాటెల్ బై వైర్ సిస్టమ్, టూర్, స్పోర్ట్, ఎకాన్ మరియు రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ పొందుతుంది.
భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో హోండా గోల్డ్ వింగ్ టూర్ ఒకటి. ఈ బైక్ చాలా ఖరీదైనది కావడం వల్ల ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేయలేరు. బైక్ ప్రేమికులు లేదా సెలబ్రెటీలు మాత్రమే ఇలాంటి ఖరీదైన బైకులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే సెలబ్రిటీల గ్యారేజిలో ఈ గోల్డ్ వింగ్ టూర్ బైకులు దర్శనమిస్తాయి. ఇవి ఉత్తమ పనితీరును అందిస్తాయి.
2024 హోండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ డెలివరీ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కస్టమర్ డీలర్షిప్ వెళ్లి, బైక్ కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఫిల్ చేసి బైక్ డెలివరీ తీసుకుంటారు. తెలుపు రంగులో చూడచక్కగా ఉన్న ఈ బైక్ రోడ్డు మీద వెళ్లడం చూడవచ్చు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఫిదా చేస్తోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








