పార్టీ లేదా పుష్పా.. అంటూనే కొత్త కారు కొనేసిన 'భన్వర్ సింగ్ షెకావత్' (ఫహద్ ఫాసిల్): ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను, అందులోనూ ఆధునిక లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉండటం ఇది వరకు చాలా కథనాల్లో తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు పార్టీ లేదా పుష్పా.. అంటూ ఎంతోమంది తెలుగు ప్రేక్షలకులకు దగ్గరైన ప్రముఖ మలయాళీ చిత్ర నిర్మాత మరియు నటుడు 'ఫహద్ ఫాసిల్' ఇటీవల తన గ్యారేజిలో ఒక ఇటలీ సూపర్ కారుని చేర్చారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.
Recommended Video
ఫహద్ ఫాసిల్ ఇప్పటికే దాదాపు 40 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతనికి భారత జాతీయ చలనచిత్ర అవార్డు, నాలుగు కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, మూడు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా పలు అవార్డులను అందుకున్నాడు. ఇతడు ఎక్స్ప్రెషన్ బ్యూటీ 'నజ్రియా నజీమ్' భర్త.

నివేదికల ప్రకారం 'ఫహద్ ఫాసిల్' కొనుగోలు చేసిన కొత్త కారు 'లంబోర్ఘిని' (Lamborghini) కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ అయిన 'ఉరుస్' (Urus). ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 3.15 కోట్లు. 'లంబోర్ఘిని ఉరుస్' అనేది కంపెనీ యొక్క అత్యధిక అమ్మకాలు పొందుతున్న ఎస్‌యూవీ.

ఫహద్ ఫాసిల్ తన కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీలో ఇటీవల రోడ్లపైన కనిపించారు. ఇతడు కొనుగోలు చేసిన ఉరుస్ కారు 'గ్రిజియో కెరెస్' కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో ఉంటుంది, కావున ఇది లగ్జరీ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది.

లంబోర్ఘిని ఉరుస్ 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ నుండి శక్తిని పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 650 బిహెచ్‌పి పవర్ మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అదేవిధంగా 12.8 సెకన్లలో 0 నుంచి 200 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీకి స్లిమ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, టెయిల్ లైట్లు లభిస్తాయి. ఈ కారు డిజైన్ లంబోర్ఘిని హురాకాన్ సూపర్ కార్ నుండి ప్రేరణ పొందింది. లంబోర్ఘిని ఉరుస్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 22 మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంది.

లంబోర్ఘిని కంపెనీ తన ఉరస్ ఎస్‌యువిని విడుదల చేసిన నాలుగున్నర సంవత్సరాల్లో 200 యూనిట్లను కేవలం భారతీయ మార్కెట్లో విక్రయించగలిగింది. ఇది నిజంగానే కంపెనీ భారతీయ సాధించిన విజయం అనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ అమ్మకాల సంఖ్య తప్పకుండా పెరుగుతుంది.

2021 మార్చి నాటికి కంపెనీ దేశీయ మార్కెట్ల్ లో 100 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది. మొత్తం మీద భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీ నుంచి ఎక్కువమంది కొనుగోలు చేసిన మరియు చేసే వాహనాల్లో 80 శాతం 'ఉరుస్' ఎస్‌యువిలే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే లంబోర్గిని ఉరుస్ కి భారతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది అని అర్థమవుతోంది. లంబోర్గిని ఉరుస్ కారుని భారతదేశంలో చాలామంది పారిశ్రామికవేత్తలు మరియు సినీ ప్రముఖులు కూడా కలిగి ఉన్నారు.

నటుడు ఫహద్ ఫాసిల్ తన గ్యారేజీలో పైథాన్ గ్రీన్ పోర్స్చే 911 కారెరా ఎస్ కూడా కలిగి ఉన్నాడు. ఈ కారుని రామ్ కపూర్, మమతా మోహన్‌దాస్, సచిన్ టెండూల్కర్ మరియు సురేష్ రైనా వంటి వారు కూడా కలిగి ఉన్నారు.

ఈ పోర్స్చే 911 కారెరా ఎస్ కారు 3.0-లీటర్ ఫ్లాట్-సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 450 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అత్యంత వేగవంతమైన కార్లలో ఇది ఒకటి. కావున ఎక్కువమంది సెలబ్రెటీలు ఈ కారుని కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
లంబోర్హిని కంపెనీ యొక్క కార్లను కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా, ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ ఉంది. కావున మార్కెట్లో ఈ SUV విపరీతమైన డిమాండ్ ఉంది. తెలుసు సినీ పరిశ్రమలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మొదలైన వారు కూడా ఈ బ్రాండ్ కారుని కలిగి ఉన్నారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








