భారతీయ సాంప్రదాయంలో ఖరీదైన Genesis GV80 కారుకి సౌత్ కొరియా రాయబారి పూజలు
భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జే-బోక్(Chang Jae Bok) కొత్త లగ్జరీ జెనెసిస్ జీవీ 80 కారు కొనుగోలు చేశారు. అయితే ఈ కారు దేశీయ మార్కెట్లో అందుబాటులో లేదు. అంతేకాకుండా భారతీయ సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఆయన కారును నడిపారు. ఇది మన దేశ సంప్రదాయం పట్ల ఆయనకున్న గౌరవాన్ని అద్దం పడుతుంది.
చాంగ్ జే-బోక్ భారతదేశంలోని దక్షిణ కొరియా రాయబారి(South Korea Ambassador). ఆయన కొనుగోలు చేసిన (Genesis GV 80 Luxury SUV) ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయవచ్చు. GV80 అనేది హ్యుందాయ్ మోటార్ గ్రూప్ లగ్జరీ కార్ల విభాగం అయిన జెనెసిస్ ద్వారా తయారు చేయబడిన మొదటి SUV. ఇది BMW X5, మెర్సిడెస్ Benz GLE, Audi Q7 వంటి లగ్జరీ కార్లతో మార్కెట్లో పోటీపడుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో జెనెసిస్ GV80 లగ్జరీ ఎస్‌యూవీకి భారీ డిమాండ్ ఉంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 65 లక్షలకు పైనే ఉంది. మరి మన దేశంలో సౌత్ కొరియా అంబాసిడర్ చాంగ్ జే బోక్ కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారు ఫీచర్లు, డిజైన్, ఇంటీరియర్ విశేషాలను చూద్దాం.
Genesis GV80 లగ్జరీ SUV ఇంటీరియర్‌ను అనేక ఆధునిక సౌకర్యాలతో విశాలవంతంగా ఏర్పాటు చేశారు. ఇంకా హై క్వాలిటీతో రూపొందించారు. ఇందులో లెథెరెట్ డ్యాష్‌బోర్డ్, 14.5-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి కూడా సపోర్ట్ ఇస్తుంది. మౌంటెడ్ కంట్రోల్‌తో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వెనుక పెద్ద డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉండటం అదనపు ఆకర్షణ.

ఇంకా కొత్త జెనెసిస్ GV80 లగ్జరీ ఎస్‌యూవీలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ప్రీమియం నాప్పా లెదర్ ఫినిషింగ్‌కు అప్‌గ్రేడ్ చేసే ఆప్షన్‌తో లెథెరెట్ సీట్లు, మ్యాట్ ఫినిష్ ఉడ్ ట్రిమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెక్సికాన్ 21-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్, మసాజ్ ఫంక్షనాలిటీ, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
Genesis GV80 ఎస్‌యూవీలో డిజైన్ విషయానికొస్తే ఇది హ్యుందాయ్ మోటార్ యొక్క M3 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. SUV డిజైన్‌లో క్రోమ్‌లో G-మ్యాట్రిక్స్ క్రెస్ట్ గ్రిల్, క్వాడ్ LED హెడ్‌లైట్లు, టైల్‌లైట్లు ఇంకా మిచెలిన్ టైర్‌లతో కూడిన భారీ 22-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. GV80 SUV యొక్క మొత్తం లుక్ బెంట్లీ బెంటెగా SUVని గుర్తు చేస్తుందనడంలో సందేహం లేదు.

హ్యుందాయ్ జెనెసిస్ GV80 ఎస్‌యూవీలో మొత్తం 2 ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఒకటి 2.5 లీటర్ 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (Turbo Petrol Engine) ఒకటి. ఇది గరిష్ఠంగా 300 హెచ్‌పీ పవర్ మరియు 421 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
జెనెసిస్ GV80 లగ్జరీ కారులో 3.5 లీటర్ ట్విన్ టర్బో V6 డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందించారు. ఇది 375 HP పవర్ వద్ద 530 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీతో పాటు గరిష్ఠ శక్తిని కూడా అందించడం విశేషం. V6 ఇంజన్ 6 సెకన్ల కంటే తక్కువ సమయంలో 100 km/h వేగాన్ని అందుకుంటుంది.

ఇక భద్రతా పరంగా, GV80 అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది లేన్ కీపింగ్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్-అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఫార్వర్డ్ డిపార్చర్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ కొలిషన్ అవాయిడెన్స్-అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, రియర్‌వ్యూ కెమెరా విత్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్‌లైన్ డి వంటి అధునాతన ఫీచర్‌లతో వస్తుంది.
ఇలాంటి లగ్జరీ కారును భారత్‌లో సౌత్ కొరియా రాయబారి చాంగ్ జో బోక్ కొనుగోలు చేయడమే కాక భారతీయ సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ పూజలు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి లగ్జరీ కారు త్వరలోనే దేశీయ మార్కెట్లో అందుబాటులో వస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








