వేగం చంపేస్తుంది.. న్యూజిలాండ్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ విశిష్ట ప్రకటన
స్పీడ్ కిల్స్ (వేగం చంపేస్తుంది) ఈ మాటను తరచూ వింటుంటాం. రోడ్లపై నిత్యంత సైనేజ్/వార్నింగ్ బోర్డులపై కూడా చూస్తుంటాం. ప్రతినిత్యం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక రోడ్డు ప్రమాదాలకు మితిమీరిన వేగమే ప్రధానం కారణం అవుతోంది.
రోడ్డుపై ఒకరు నెమ్మదిగా వెళ్తున్నప్పటికీ, అవతలి వారి మితిమీరిన వేగం వలన ఒక్కోసారి ఇద్దరూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. చాలా మంది రోడ్లపై నిర్ధిష్ట వేగ పరిమితులను పాటించరు, ఫలితంగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఎవరో చేసే తప్పిదాలకు మరెవరో బలవుతుంటారని చెబుతూ, రోడ్ సేఫ్టీ గురించి న్యూజిలాండ్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ఓ డ్రమాటిక్ వీడియో ప్రకటనను విడుదల చేసింది. ఇందులో ఓ వ్యక్తి తన కారుతో ఓ మలుపు వద్ద U టర్న్ తీసుకుంటుండగా, మరో వ్యక్తి మితిమీరిన వేగంతో రోడ్డుకు అవతలివైపు నుంచి వస్తుంటాడు.
యాక్సిడెంట్ జరగటానికి ముందు వీరిద్దరూ కారు లోనుంచి దిగి ఒక్కసారి మాట్లాడుకుంటే, వారి సంభాషణ, హావభావాలు ఎలా ఉంటాయనేదే ఈ ప్రకటన సారాంశం. U టర్న్ తీసుకునే కారులో తండ్రి, కుమారుడు ఉంటారు. అవతలి వ్యక్తి ఓవర్‌స్పీడ్ కారణంగా వీరిద్దరూ ప్రాణాలు కోల్పోతారు. ఇదంతా నిజం కాకపోయినప్పటికీ, ఈ ప్రకటన సారాంశం మాత్రం ఒక్కటే. అదే 'వేగం చంపేస్తుంది.' మరి ఆ ప్రకటనను మనం కూడా వీక్షిద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/bvLaTupw-hk?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








