వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టిన బస్సు.. కారు డ్రైవర్ చేసిన పనికి ఫిదా అయిపోతారు..!
మనం ప్రతి నిత్యం రోడ్డు ప్రమాదాల గురించి తరచూ చూస్తుంటాం. రెండు వాహనాలు ఢీకొన్నప్పుడు, లేదా ఒక వాహనం మరో వాహనాన్ని ఢీకొన్నప్పుడు నియంత్రణ కోల్పోయి ప్రమాదంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లిన సందర్భాలు అనేకం. కానీ ఇక్కడ జరిగిన ఓ ప్రమాదం మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.
రోడ్డు ప్రమాదంలో మనం తప్పేం లేకపోయినా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కేరళలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదం భయాందోళనతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారు డ్రైవర్ యొక్క డ్రైవింగ్ పరిణతి, సమయస్ఫూర్తి, చాకచక్యం చప్పట్లు కొట్టించేలా చేస్తాయి. ప్రస్తుతం ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేరళలో ఇటీవలి ఓ జంక్షన్ సిగ్నల్ వద్ద మహీంద్రా XUV 300 ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో గ్రీన్ సిగ్నల్ కోసం వేచి ఉంది. అదే సమయంలో SUV వెనుక భాగంలో వేగంగా వస్తున్న బస్సు కారును ఢీకొట్టింది. దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ 300 రోడ్డు మీదకు దూసుకెళ్లింది. కానీ ఆశ్చర్యమేమంటే మహీంద్రా ఒక్క వాహనాన్ని కూడా ఢీకొట్టకుండా సురక్షితంగా ముందుకు వెళ్లి ఆగిపోయింది.
జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో మహీంద్రా XUV 300 సిగ్నల్ వద్ద వేచి ఉండటం చూపిస్తుంది. బస్సు అధిక వేగంతో వచ్చి కారును ఢీకొట్టింది. ఆ వేగానికి XUV 300 ఎదురుగా ఉన్న లేన్ వైపు ముందుకు దూసుకెళ్లింది. అక్కడ వాహనాలు ఎక్కువగా ట్రాఫిక్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి ఉన్నాయి.

ఈ సమయంలో XUV300 డ్రైవర్ తన సమయస్ఫూర్తితో ఇతర కార్లను ఢీకొనకుండా చాకచక్యంగా SUVని నావిగేట్ చేసినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. కొంచెం ముందుకు వెళ్లాక మలుపు తీసుకొని ఎవరినీ కొట్టకుండా పూర్తిగా ఆగిపోయాడు. అదుపు తప్పిన బస్సు కూడా వేగం తగ్గించి కారును ఢీకొట్టడంతో పూర్తిగా ఆగిపోయింది.
బస్సు రన్నింగ్‌లో ఉన్నందున నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. బస్సు బ్రేకులు ఫేడ్ అవుట్ అయిపోవడం లేదా డ్రైవింగ్‌పై డ్రైవర్ శ్రద్ధ చూపకపోవడం ఈ ప్రమాదానికి కారణం కావచ్చు. కాగా ఈ ప్రమాదంలో కారు మరియు బస్సు దెబ్బ తిన్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

కారు యజమాని రియర్ వ్యూ అద్దాల్లో నుంచి బస్సును ముందే గుర్తించినట్లు వెల్లడించారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా కుదరలేదని.. బస్సు కారును ఢీకొన్నప్పుడు వెంటనే కారు డివైడర్‌ను ఢీకొట్టబోతుందని గమనించినట్లు తెలిపారు. తద్వారా అతను కారుపై నియంత్రణ సాధించి సురక్షితంగా నడిపినట్లు చెప్పారు. సీటు బెల్టులు ధరించడం కూడా మంచిదైందని పేర్కొన్నారు.
ఇటువంటి ప్రమాదాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, మీ అప్రమత్తతను పెంచడానికి మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా టోల్ గేట్ల వద్ద వేచి ఉన్నప్పుడు, ఎడమ వైపున ఉన్న లేన్‌లను ఎంచుకోవాలి. ఎందుకంటే భారీ వాహనాలు తరచుగా కుడి వైపున ఉన్న మార్గాల్లో వెళ్తుంటాయి.
సీటు బెల్టులు ధరించడం మరియు సురక్షితమైన వాహనాన్ని ఎంచుకోవడం మాత్రమే కాకుండా, అటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకోగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా టోల్‌ల వద్ద వాహనం ఆపినప్పుడు కఠినంగా బ్రేక్ వేయకుండా చూసుకోవాలి. బ్రేక్‌లపై తేలికపాటి ఒత్తిడిని వర్తింపజేయాలి. లేదంటే మీ వాహనం ముందుకు దూసుకెళ్లి ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








