రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వేగంగా దూసుకొచ్చిన బస్సు.. ఈ వీడియో చూస్తే జన్మలో సిగ్నల్ జంప్ చేయరు!!
రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా కీలకం. రెడ్, ఆరెంజ్ సిగ్నల్స్ పడినప్పుడు జంప్ చేశారంటే ఇక అంతే సంగతులు. అప్పుడప్పుడూ సిగ్నల్ జంప్ చేసి యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాలో ఇటీవల జరిగిన ఇదే తరహా ప్రమాదం(Bus Jumps Signal) వైరల్‌గా మారింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కువగా ప్రమాదాలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారానే జరుగుతున్నట్లు నివేదికల్లో తేలింది. దీంతో ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారికి జరిమానాలు, శిక్షలు విధిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అతి ఘోరంగా జరుగుతున్న ప్రమాదాల్లో అమాయకులు బలవుతున్నారు.

కోల్‌కతా(Accident in Kolkata)లో ఇటీవల రోడ్డు(Traffic Signal)కు మరో వైపు నుంచి వస్తున్న కారు(College Junction) ను ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టి బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ యాక్సిడెంట్ ఈ నెల 2 న జరిగింది.
కోల్‌కతాలో సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని అత్యంత బిజీగా ఉండే కేంద్రాల్లో కాలేజ్ జంక్షన్ఒకటి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వైపు గ్రీన్ సిగ్నల్ పడటంతో వాహనాలు వెళ్తుండగా.. రెడ్ సిగ్నల్ పడిన మరోవైపు నుంచి ప్రైవేట్ బస్సు ఒకటి సిగ్నల్‌ను జంప్ చేసి కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దృశ్యాలు ట్రాఫిక్ జంక్షన్ వద్ద అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ప్రమాదంలో ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టడంతో రెండు అవతలివైపు నిలబడి ఉన్న రెండు బైక్‌లపై దూసుకెళ్తుండగా ఇద్దరూ తృటిలో తప్పించుకున్నారు. యాక్సిడెంట్ ప్లేస్‌లో రోడ్డుపై ఉన్న వారిని రక్షించేందుకు కొంతమంది బస్సు, కారు వైపు వెళ్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఘటన జరిగిన సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ఉండటంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కారులో ఎయిర్‌బ్యాగ్‌లు ఆన్ అవడంతో అందులోని వారికి ఎలాంటి నష్టం జరగలేదు.
కాగా ఈ యాక్సిడెంట్‌లో బస్సు డ్రైవర్‌తో పాటు మరో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు క్రేన్‌ల సాయంతో బస్సును బయటకు పైకి లేపారు. ఈ కారణంగా దాదాపు 40 నిమిషాల పాటు ట్రాఫిక్(Viral Video) నిలిచిపోయింది.

ఇదే కాకుండా ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తొందరపడకుండా గ్రీన్ లైట్ పడేవరకు వేచి ఉండాలి. రెడ్, ఆరెంజ్ సిగ్నల్స్ పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వాహనాన్ని లైన్ దాటనివ్వకూడదు.
అంతే కాకుండా పబ్లిక్ రోడ్లపై స్టంట్లు, అసభ్యకరమైన చేష్టలు కూడా తగదు. సీసీ కెమెరాలు లేవు కదా అని రోడ్డుపై ప్రయాణించే ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా వాహనాలు నడపకూడదు. ఇలాంటి చర్యలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి పోలీసుల దృష్టికి సులభంగా చేరుతున్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








