Google Maps గూగుల్ మ్యాప్స్‌లో స్పీడో మీటర్ ఫీచర్.. ఇకపై మీకు ఓవర్ స్పీడ్ చలాన్ సమస్య ఉండదు.!!
రోడ్డుపై పరిమితికి మించిన వేగంతో వెళ్తే చలాన్ తప్పనిసరి. ఇకపై ఈ సమస్యకు గూగుల్ మ్యాప్స్(Google Maps) చెక్ పెట్టనుంది. ఇప్పటివరకు డ్రైవర్లకు నావిగేషన్‌లో సహాయం చేసిన గూగుల్ మ్యాప్స్.. ఇకపై మీకు స్పీడ్ లిమిట్ విషయంలోనూ తగు జాగ్రత్తలు సూచిస్తూ మీరు ట్రాఫిక్ చలాన్ల బారిన పడకుండా చూస్తుంది. పూర్తి సమచారం ఈ కథనంలో చదవండి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటో మొబైల్ రంగంలోనూ విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో హైదరాబాద్ లాంటి రద్దీ నగరాలు, కొత్త రూట్లలో ప్రయాణించాలంటే గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తప్పనిసరి. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ ద్వారా సులభంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. కాగా రోడ్డు భద్రత కోసం గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

గూగుల్ మ్యాప్స్ ద్వారా డ్రైవర్‌ను స్పీడ్ లిమిట్‌కు పరిమితం చేయడంలో సహాయపడుతుంది. మీరు ప్రయాణిస్తున్న రోడ్లపై రియల్ టైమ్‌లో స్పీడ్ లిమిట్ సమాచారాన్ని అందిస్తుంది. వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదంటే.. ట్రాఫిక్ రూల్స్ తెలియని రోడ్లపై ఈ ఫీచర్ డ్రైవర్ ఫ్రెండ్లీగా ఉండనుంది.
గూగుల్ మ్యాప్స్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్‌తో, వాహనదారులు రియల్ టైమ్‌లో వేగ పరిమితి(Speed Limit) సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వేగ నియంత్రణ సూచనలను పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు హైవేలో ప్రయాణిస్తూ.. సాధారణ రోడ్లు లేదంటే, గ్రామీణ రహదారికి మారేటప్పుడు వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అయితే, డ్రైవర్లు దీనిని త్వరగా గుర్తించలేరు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో స్పీడ్ లిమిట్స్ ఉంటాయి.

చాలా సందర్భాల్లో ఈ విషయం గమనించకుండా డ్రైవర్లు అతివేగంతో వెళ్తుంటారు. ఈ కారణంగా పోలీస్ చలాన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో, వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో డ్రైవ్ చేసేటప్పుడు ఇది వారికి సవాలుగా ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు భద్రత, నావిగేషన్ సహాయాన్ని అందించడానికి, గూగుల్ మ్యాప్స్ స్పీడోమీటర్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది.
గూగుల్ మ్యాప్స్ స్పీడో మీటర్(Google Maps Speedometer) ఫీచర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్లకు సంబంధించి రియల్ టైమ్ స్పీడ్ లిమిట్ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. కాగా ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.

ముందుగా మీ Android ఫోన్‌లో Google Maps యాప్‌ని ఓపెన్ చేయాలి. అక్కడ మీ ప్రొఫైల్ పిక్‌పై క్లిక్ చేసి డ్రాప్ డౌన్ మెనూలో 'Settings' ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో "Navigation Setting" సెలెక్ట్ చేసుకోవాలి. మీరు నావిగేషన్ సెట్టింగ్‌లోకి వెళ్లిన తర్వాత, "Driving Options" అనే విభాగాన్ని చూడటానికి క్రిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది.
ఈ విభాగంలో మీ డ్రైవింగ్ అనుభవం కోసం వివిధ ఫీచర్లు మరియు ప్రాధాన్యతలు ఉంటాయి. అక్కడ మీరు స్పీడోమీటర్ టోగుల్ స్విచ్‌ని చూడవచ్చు. ఆ తర్వాత మీరు స్పీడోమీటర్‌ని యాక్టివేట్ చేయడానికి, మీ డ్రైవింగ్ వేగంపై రియల్ టైమ్ స్పీడ్ లిమిట్‌ని పొందడానికి ఆ స్విచ్‌ని "On" చేయండి.
అనంతరం మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడోమీటర్‌ని ప్రారంభించిన తర్వాత, Google మ్యాప్స్‌తో నావిగేట్ చేస్తున్నప్పుడు అది మీ GPS వేగాన్ని చూపుతుంది. ఈ క్రమంలో మీ కారు స్పీడ్ లిమిట్ దాటితే మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అదే విధంగా గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ నమూనాలను కూడా విశ్లేషిస్తుంది. ఇది అధికారికంగా అందుబాటులో ఉన్న డేటాతో క్రాస్ రిఫరెన్స్ చేస్తుంది.
గూగుల్ మ్యాప్స్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో స్పీడోమీటర్ వేగ పరిమితులను గుర్తిస్తుంది. దీని ద్వారా స్పీడోమీటర్ గూగుల్ మ్యాప్స్ వేగాన్ని నియంత్రిస్తుంది. స్పీడోమీటర్ మీరు ప్రయాణిస్తున్న రోడ్డుపై వేగ పరిమితిని నిర్ణయించడానికి GPS సమాచారాన్ని ఉపయోగిస్తుంది. తద్వారా డ్రైవర్‌లో స్పీడ్ లిమిట్‌లో నడపడానికి ఈ ఫీచర్ దోహద పడుతుంది.


Click it and Unblock the Notifications








