బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌లోకి దూసుకుపోయిన లాంబోర్గినీ
లాంబోర్గినీ అనగానే జయ్యమని బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే కార్లే మనకు గుర్తుకు వస్తాయి. అలాంటి అత్యంత వేగంతో పరుగులు పెట్టే కార్లు అదుపు తప్పితే ఏమవుతుంది.. ఇదిగో ఈ ఫోటోలో మాదిరిగానే జరుగుతుంది. ఇటలీలోని కోమోకు సమీపంలో ఉన్న మరియాన్ కోమెన్స్ అనే ప్రాంతంలో అతి భీకరమైన కారు ప్రమాదం జరిగింది.
వేగంగా వస్తున్న ఓ నలుపు రంగు లాంబోర్గినీ ముర్సిలాగో సూపర్ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న వల్లీ మోటారాడ్ అనే బిఎమ్‌డబ్ల్యూ బైక్ షోరూమ్‌లోకి దూసుకుపోయింది. అదృష్టవశాత్తూ కారులోని డ్రైవర్‌కు గానీ, కోప్యాసింజర్‌కు గానీ అలాగే షోరూమ్‌లోని సిబ్బందికి గానీ, ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలు, వ్యక్తులకు గానీ ఎలాంటి ప్రమాదం వాటిళ్లలేదు.
అయితే, షోరూమ్‌లో డిస్‌ప్లేకు ఉంచిన ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు పదికి పైగా బిఎమ్‌డబ్ల్యూ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాద నష్టం కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అంచనా. వేగం వస్తున్న లాంబోర్గినీ మర్సిలాగో మలుపు తీసుకోబోయి అదుపు తప్పి అద్దాలతో చేయబడిన బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్ లోనికి దూసుకుపోయింది.
ఈ ప్రమాదం లాంబోర్గినీ ముర్సిలాగో కారు ముందు భాగం, కుడి వైపు భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలా సూపర్ కార్లు ప్రమాదాలకు గురి కావటం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి ప్రమాదాల జాబితా చాలనే ఉన్నాయి. ఇటీవలే రష్యాలో ఓ లాంబోర్గినీ ముర్సిలాగో ఎల్‌పి640-4 ప్రమాదానికి గురైంది. ఈ సూపర్ కార్లు సెకండ్ల వ్యవధిలోనే వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. అంతటి వేగంలో వీటిని అదుపు చేయటం చాలా కష్టం. కాబట్టి గుర్తుంచుకోండి.. మితిమీరిన వేగం ఎల్లప్పుడూ ప్రమాదకరమే.


Click it and Unblock the Notifications









