భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కునేందుకు భారతదేశవ్యాప్తంగా వాక్సినేషన్ డ్రైవ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. మనదేశంలో ఇప్పటి వరకూ 100 కోట్ల మందికి పైగా ప్రజలకు కోవిడ్ వాక్సినేషన్ అందించడం జరిగింది. దేశం సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకొని, ప్రముఖ విమాయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్త క్యాంపైన్ ప్రారంభించింది.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

ఇందులో భాగంగా, తమ విమానాలపై 100 కోట్ల టీకా సెలబ్రేషన్స్ తో కూడిన స్పెషల్ గ్రాఫిక్స్ ను జోడించింది. కరోనా ఫస్ట్ మరియు సెకండ్ వేవ్ లతో ఉక్కిరిబిక్కిరి అయిన భారతదేశం, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభిస్తోంది. భారతదేశంలో విజయవంతమైన టీకా డ్రైవ్ తర్వాత, కరోనా మహమ్మారి పట్ల ప్రజల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ ఇంతకు ముందు ఉన్న భయాందోళనలు ఇకపై ఉండబోవని అనుకోవచ్చు.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

భారత ప్రభుత్వం దేశంలో 100 కోట్ల డోసులకు పైగా టీకాలు వేయించింది. ఈ సందర్భంగా, అక్టోబర్ 21 న, స్పైస్‌జెట్ తమ బోయింగ్ 737 విమానాల కోసం ప్రత్యేక గ్రాఫిక్స్‌ను విడుదల చేసింది. ఈ గ్రాఫిక్స్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ఓ మహిళకు టీకా వేస్తున్న వైద్య సిబ్బంది కూడా ఉంటారు. మొత్తం మూడు బోయింగ్ 737 విమానాలకు స్పైస్ జెట్ ఈ ప్రత్యేక గ్రాఫిక్స్ ను జోడించింది.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మంజూక్ మాండవియా మరియు స్పైస్ జెట్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అజయ్ సింగ్ మాట్లాడుతూ, "కేవలం 279 రోజుల్లో 100 కోట్ల డోస్ మైలురాయిని చేరుకోవడం ఆరోగ్య కార్యకర్తల నిరంతర కృషికి మరియు పౌరుల సహకారానికి నిదర్శనం" అని అన్నారు.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

"ఈ విషయంలో స్పైస్‌జెట్ మరియు స్పైస్‌హెల్త్‌ తో సహా మా ఫ్రంట్‌లైన్ సిబ్బంది మరియు కరోనా ఫైటర్‌ ల సహకారం చాలా ప్రత్యేకమైనది మరియు ప్రశంసించదగినది. భారతదేశంలో కరోనా టీకా ప్రచారం విజయవంతం కావడానికి సూచనగా, ఇదొక నివాళి" అని ఆయన చెప్పారు.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

కరోనా వైరస్ మహమ్మారి నుండి దేశ ప్రజలను రక్షించేందుకు భారత ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఉచిత టీకా డ్రైవ్ లను నిర్వహించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటుగా ఇంటింటికీ తిరిగి మరీ టీకాలు వేశారు మరియు కోవిడ్ టీకాల పట్ల ప్రజల్లో అవగాహన కూడా కల్పించారు. అక్టోబర్ 21 నాటికి దేశంలో కోవిడ్ టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 100 కోట్లకు చేరుకుంది.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

భారతదేశంలో ఇప్పటి వరకూ సుమారు 75 శాతం మంది ప్రజలకు కరోనా టీకాలు వేయబడ్డాయి. వీరిలో 31 శాతం మందికి రెండు రకాల కరోనా వ్యాక్సిన్ లభించింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రవేశపెట్టిన తరువాత, భారత ప్రభుత్వం జనవరి 16 నుండి మనదేశంలో కరోనా వ్యాక్సిన్ ను అందించం ప్రారంభించింది.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

ముందుగా ఆరోగ్య శాఖ సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయించగా, ఆ ప్రభుత్వ సిబ్బంది మరియు ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు అందించారు. అనంతరం ఇది సాధారణ పౌరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. భారతదేశ ప్రస్తుత జనాభా సుమారు 138 కోట్లకు పైగానే ఉంది. అంటే, ప్రభుత్వం దాదాపు 275 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాల్సి ఉంది.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించడంలో భారత ప్రభుత్వం చాలా చురుకుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, మరికొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా 200 కోట్ల డోసుల టీకాల మైలురాయిని చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా స్పైస్ జెట్ సీఈఓ అజయ్ సింగ్ మాట్లాడుతూ, ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కోసం, మార్కెట్ వాటా కంటే లాభం పొందడమే తమ లక్ష్యమని చెప్పారు.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

అంటే, దీని అర్థం అజయ్ సింగ్ మార్కెట్ వాటా పతనం గురించి ఆందోళన చెందలేదు మరియు ఎయిర్‌లైన్‌ వ్యాపారంతో పాటుగా మార్కెట్ వాటా కూడా పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం స్పైస్ జెట్ సరుకు రవాణా వ్యాపారం జోరుగా సాగుతోందని, రానున్న రోజుల్లో కూడా అది ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

భారతదేశంలో 100 కోట్ల కోవిడ్-19 టీకా సెలబ్రేషన్స్.. కొత్తగా జరుపుకున్న Spicejet

ఇదిలా ఉంటే, భారతదేశపు ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకి చెందిన టాటా గ్రూప్ ఇటీవలే విమానయాన రంగంలోకి ప్రవేశించింది. ప్రభుత్వ అధీనంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా అజయ్ సింగ్ మాట్లాడుతూ టాటా ప్రపంచంలోనే ప్రముఖ విమానయాన సంస్థగా అవతరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

Most Read Articles

English summary
Spicejet celebrates 100 crore covid 19 vaccination in india with new livery
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X