స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు. అవును మార్వెల్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ ఇప్పుడు తన ప్రయాణాన్ని పూర్తి ఎకో-ఫ్రెండ్లీగా మార్చుకున్నాడు. ఇప్పటి వరకూ పెట్రోల్ పవర్డ్ కార్లలో ప్రయాణాలు చేసిన మన స్పైడర్ మ్యాన్ ఇప్పుడు పర్యావరణ సాన్నిహిత్యమైన ఎలక్ట్రిక్ కారులో ప్రయాణం చేయనున్నాడు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

మార్వెల్ స్పైడర్ మ్యాన్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే పేరు బ్రిటీష్ యాక్టర్ టామ్ హాలండ్ (Tom Holland). ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ దక్కించుకున్న సూపర్ హీరో ఫిల్మ్ సిరీస్‌లలో ఒకటైన స్పైడర్ మ్యాన్ చిత్రాలలో టామ్ హాలండ్ నటించాడు. టామ్ హాలండ్ ఓ అద్భుతమైన విలక్షణ నటుడు మరియు ఒక పాత్ర నుండి మరొక పాత్రకు ఎలా మారాలో ఈ స్టార్‌ హీరోకి ఖచ్చితంగా తెలుసు. హాలండ్ అనేక హిట్ సినిమాల్లో నటించాడు, ముఖ్యంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని స్పైడర్ మాన్ ఫ్రాంచైజీ ద్వారా ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

ఇటీవల అన్‌చార్టెడ్ అనే వీడియో గేమ్ ఆధారంగా రూపొందించిన అన్‌చార్టెడ్ మూవీలో కూడా టామ్ హాలండ్ నటించాడు. టామ్ హాలండ్‌కు హాలీవుడ్ చలన చిత్రాల మాదిరిగానే ఖరీదైన కార్లంటే కూడా చాలా ఇష్టం. ఈ స్టార్ హీరో వద్ద ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొన్ని ఖరీదైన కార్ మోడళ్లు ఉన్నాయి. అయితే, ఇతను ఇప్పుడు తాజాగా తన కార్ కలెక్షన్ లో ఓ ఎలక్ట్రిక్ కారును చేర్చుకున్నాడు. జర్మన్ కార్ బ్రాండ్ పోర్ష్ అందిస్తున్న టేకాన్ టర్బో ఎస్ (Porsche Taycan Turbo S) మోడల్‌ను టామ్ కొనుగోలు చేశాడు.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

టామ్ హాలండ్ తన పోర్ష్ ఎలక్ట్రిక్ కారుతో దిగిన ఫొటోను మోనోక్రోమ్ ఇమేజ్‌ (బ్లాక్ అండ్ వైట్) రూపంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ చిత్రంలో, టామ్ హాలండ్ తాను కొనుగోలు చేసిన సరికొత్త పోర్ష్ టేకాన్ టర్బో ఎస్ ఎలక్ట్రిక్ కారు పక్కన నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. అతని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడంలో సహకరించిన పోర్ష్ బృందానికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. తన పోస్ట్‌లో, "ఎలక్ట్రిక్ పీటర్ కే. ఎలక్ట్రిక్‌గా మారడంలో నాకు సహాయం చేసినందుకు porsche_gb కి ధన్యవాదాలు. #PorscheTaycan" అవి ఉంది.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

Porsche Taycan Turbo S ఎలక్ట్రిక్ కారు గురించి..

పోర్ష్ టేకాన్ టర్బో ఎస్ (Porsche Taycan Turbo S) ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లలో విక్రయించబడుతోంది. భారతీయ కరెన్సీలో ఈ కారు విలువ సుమార రూ. 2.13 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. టామ్ హాలండ్ కొనుగోలు చేసింది ఇందులో టాప్-స్పెక్ పోర్ష్ టేకాన్ టర్బో ఎస్ వేరియంట్ అని సమాచారం. ప్రస్తుతం, పోర్ష్ బ్రాండ్ యొక్క ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో టేకాన్ టర్బో ఎస్ అత్యంత శక్తివంతమైన స్పోర్ట్స్ కారుగా ఉంది.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

ఈ ఎలక్ట్రిక్ సూపర్‌ కారులో రెండు పర్మినెంట్-మాగ్నెట్ సింక్రోనస్ (PMS) ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిలో ఒకటి ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటే, రెండవది వెనుక యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది. ఈ ఆల్-వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్టంగా 750 బిహెచ్‌పిల శక్తిని మరియు 1050 న్యూటన్ మీటర్ల గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ నాలుగు-డోర్ల ఎలక్ట్రిక్ సూపర్‌కార్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. పోర్ష్ టేకాన్ టర్బో ఎస్ ఎలక్ట్రిక్ సూపర్ కారు గరిష్ట వేగం గంటకు 260 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌ లకు శక్తినిచ్చేందుకు, పోర్ష్ ఇందులో ఓ భారీ 93.4 kWh బ్యాటరీ ప్యాక్ ని ఉపయోగించింది. ఈ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 390 మరియు 416 కిమీల దూరం వరకూ ప్రయాణించవ్చచు.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

టామ్ హాలండ్‌కు ఇదేమీ మొదటి మరియు అత్యంత వేగవంతమైన సూపర్ కారు ఏమీ కాదు. మన స్పైడర్ మ్యాన్ వద్ద ఇంత కన్నా గొప్ప కార్లు కూడా ఉన్నాయి. కాకపోతే, ఇది అతని గ్యారేజ్‌లో మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. టామ్ హాలండ్ కార్ గ్యారేజ్ లో ఆడి ఆర్ఎస్7 స్పోర్ట్‌బ్యాక్, ఆడి క్యూ7 మరియు రోల్స్ రాయిస్ కుల్లినాన్ బ్లాక్ బ్యాడ్జ్ వంటి గొప్ప మరియు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి.

స్పైడర్ మ్యాన్ కూడా ఎకో-ఫ్రెండ్లీగా మారిపోయాడు.. ఎలక్ట్రిక్ కారులో షికార్లు చేస్తున్నాడు..

స్పైడర్ మ్యాన్ ఫ్రాంచైజీలో టామ్ అతని చివరి చిత్రం 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' (Spider-Man: No Way Home). ఈ చిత్రం 2021లో విడుదలైంది మరియు ఇది మార్వెల్ స్టూడియోస్‌ యొక్క పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఈ చిత్రం మల్టీవర్స్ మరియు పాప్ కల్చర్ సూచనలతో ఇంటర్నెట్‌లో ఆధిపత్యం చెలాయించింది. టామ్ హాలండ్ యాపిల్ టివి+ లో ప్రసారమయ్యే 'ది క్రౌడ్ రూమ్' అనే వెబ్‌ సిరీస్‌లో కూడా కనిపిస్తాడు.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 19:00 [IST]
English summary
Spider man famed actor tom holland buys porsche tycan turbo s electric car details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+