Airplane విమానం టేక్‌ఆఫ్‌కి ముందు రిపేర్.. టేప్ చుట్టిన సిబ్బంది.. ప్రయాణికుల మండిపాటు.. వీడియో వైరల్..!!
ఈ రోజుల్లో ఏరోప్లేన్ లో ప్రయాణించడం సర్వసాధారణంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని చేరుకునేందుకు జనాలు ఈ ప్లేన్స్ లో ప్రయాణిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఏరోసంస్థలు కూడా ఈ సర్వీసులను మరింత సులభతరం చేశాయి. అయితే వీటిపై ప్రయాణించేటప్పుడు జనాలు కాస్త భయాందోళనకు గురవ్వడం సర్వ సాధారణమే. తాజాగా సిబ్బంది చేసిన నిర్వాహకం ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.
టేకాఫ్ కు ముందు స్పిరిట్ ఎయిర్ లైన్స్ చెందిన ఓ కార్మికుడు విమానానికి టేప్ పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ మహిళ ఈ వీడియోను టిక్ టాక్ లో షేర్ చేయగా క్షణాల్లో అది ఖండాతరాలను దాటింది. వీడియో ప్రకారం విమానంలో ఓ భాగాన్ని సరిచేయడానికి సదరు మహిళ టేప్ ను ఉపయోగించడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

అమెరికాలోని నాష్ విల్లే అంతర్జాతీయ విమానాశ్రయంలో టేక్ ఆఫ్ కి సిద్ధంగా ఉన్న విమానం ఎడమ రెక్కపై ఎయిర్ లైన్స్ వర్కర్ మెయింటెనెన్స్ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విమానంలో సమస్యను పరిష్కరించడానికి కార్మికుడు టేప్ ను ఉపయోగించాడు. దీనిని ఓ మహిళ రికార్డు చేశాడు. ఈ వీడియోలోని సంభాషణ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.
ఈ వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. బయలుదేరే ముందు, ఓ కార్మికుడు విమానం రెక్క దెబ్బతిన్న స్థానంలో టేపును కత్తిరించి, దానిని కప్పిపుచ్చే వీడియో వైరల్ అయ్యింది. వీడియోను రికార్డ్ చేసిన మహిళ "అందుకే నేను పరమాత్మతో ఎగరను" అనే సంభాషణ వినవచ్చు. " ప్రజలు విమానంలో ఉన్నప్పుడు మీరు అలా చేస్తారా?" అని ఆమె అతన్ని ప్రశ్నిస్తుంది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో మండిపడుతున్నారు. వీడియో రికార్డ్ చేసిన మహిళ మాదిరిగానే ప్రశ్నల్నీ సంధించారు. 'బేబీ, నేను విమానం నుంచి పారిపోయేదాన్ని. నా డబ్బును తిరిగి పొందాను." 'ఆత్మ కొన్ని నిజమైన ఆత్మలను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది' అని ఓ సోషల్ మీడియా యూజర్ సరదాగా కామెంట్ చేశాడు.
సాధారణంగా విమానయాన సంస్థలు ప్రయాణీకులకు భద్రతను కల్పిస్తాయని..విమానం టేకాఫ్ అయ్యే ముందు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారని కామెంట్ చేశారు. వీడియోలో ఉన్న వ్యక్తి అతికించిన టేప్ ను అన్ని విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్నాయని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇది సాధారణ టేప్ కాదని స్పీడ్ టేప్ అని కొందరు కామెంట్ చేశారు. అంటారు. ఈ స్పీడ్ టేప్ ను విమానాల్లో చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి ఉపయోగిస్తారని వివరించారు. దీనిని ప్రతి విమానయాన సంస్థ ఉపయోగించుకుంటుందని విమానాల్లో మరమ్మతులను త్వరగా రిపేర్ చేయడానికి స్పీడ్ టేప్ ను ఉపయోగిస్తారని గుర్తించాలని అన్నారు. ఈ టేప్ మైనస్ 65 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 600 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదని వివరించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








