గాలిలో కాదు, రోడ్డుపై విహరించే విమానం

విమానాలు గాలిలో కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తే ఎలా ఉంటుంది. ఇక అందరీ కళ్లు దానిపైనే ఉంటాయ్ కదూ. నిజానికి రోడ్డుపై వెళ్లే వారి దృష్టి ఆకట్టుకోవాలంటే ఏ ఫెరారీ కారును లేక లాంబోర్గినీ కారునో నడపాల్సిన అవసరం లేదు. ఇలాంటి విచిత్రమైన విమానాన్ని నడిపినా చాలు. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన జెఫ్ బ్లోచ్ ఇలా రోడ్డుపై విమానం నడిపి అక్కడి వారి దృష్టిని ఆక్టటుకున్నాడు. చివరి స్లైడ్‌లలో వీడియోను తిలకించవచ్చు.

విమానాన్ని కారులా మార్చేసి, దానిని రోడ్డుపై తిప్పుతున్నాడు మన అమెరికన్ బుల్లోడు. 40 ఏళ్ల పోలీస్ ఆఫీసర్, మెకానిక్ మరియు రేస్ అయిన జెఫ్ బ్లోచ్‌ను అందరూ ముద్దుగా 'స్పీడ్ కాప్' (వేగవంతమైన పోలీస్) అని పిలుస్తుంటారు. జెఫ్ మరియు అతని బృందం 1956 సెస్నా 30, సిక్స్-సీటర్ మోనోప్లేన్ విమానపు బాడీని సేకరించి, దానికి రెక్కలు మరియు ఇంజన్‌ను తొలగించి, దాని స్థానంలో కారు ఇంజన్‌ను జోడించి ఇలా రోడ్డుపై నడిపేందుకు అనువుగా మార్చారు.

ఈ ప్లేన్-కార్ పేరు 'స్పిరిట్ ఆఫ్ లీమాన్స్'. సాధారణ విమానాలు గాలిలో విహరిస్తే, ఇది మాత్రం కేవలం రోడ్డుపైనే నడుస్తుంది. అమెరికాలో అత్యంత పాపులర్ అయిన 24 అవర్స్ లీమాన్స్ రేస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ స్పిరిట్ ఆఫ్ లీమాన్స్‌ను తయారు చేశారు. ఈ రేస్‌లో ఇది విజయం సాధించడంతో, ఈ కారును రోడ్ లీగల్ (చట్టపరంగా రోడ్డుపై నడింపేందు)గా మార్చేందుకు మిర్రర్స్, ఇండికేటర్ ల్యాంప్స్, బ్రేక్ లైట్స్ వంటివి జోడించారు. దీంతో ఈ ప్లేన్ కారును ఎంచక్కా రోడ్డుపై తిప్పుకునేందుకు అక్కడి ఆర్టీవో అధికారులు గ్రీన్ సిగ్నల్ ప్రకటించారు.

మరిన్ని వివరాలు, వీడియోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

డిజైన్

డిజైన్

ఈ స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కారును 1956 సెస్నా 30, సిక్స్-సీటర్ మోనోప్లేన్ విమానపు బాడీని సేకరించి, దానికి రెక్కలు తొలగించి, ఇలా రోడ్డుపై నడిపేందుకు అనువుగా మార్చారు.

ఇంజన్

ఇంజన్

ఈ విమానంలో ఇంజన్‌ను తొలగించి దాని స్థానంలో టొయోటా మినీవ్యాన్ నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ ఇంజన్‌ను అమర్చారు.

24 అవర్స్ లీమాన్స్ రేస్

24 అవర్స్ లీమాన్స్ రేస్

27 అడుగుల పొడవు ఉండే స్పిరిట్ ఆఫీ లీమాన్స్ ప్లేన్-కార్‌ను వాస్తవానికి 24 అవర్స్ లీమాన్స్ రేసులో పాల్గొనేందుకు తయారు చేశారు.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

ఈ స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ ప్లేన్ కార్ గరిష్ట వేగం గంటకు 145 కిలోమీటర్లు మాత్రమే.

రోడ్ లీగల్ కారు

రోడ్ లీగల్ కారు

ఈ 24 అవర్స్ లీమాన్స్ రేసులో విజయం సాధించిన తర్వాత జెఫ్ బ్లోచ్ స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ ప్లేన్ కారుకు కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి, దానిని రోడ్ లీగల్ కారుగా మార్చాడు

అందరి దృష్టి దీనిపైనే

అందరి దృష్టి దీనిపైనే

రోడ్డుపై ఈ స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ ప్లేన్ కారులో వెళ్తుంటే అందరి దృష్టి ఈ కారుపైనే ఉంటుందని, ఫెరారీ ఓనర్లు సైతం ఇలాంటి కూల్ కారును తామెన్నడూ చూడలేదని అంటున్నారని జెఫ్ తెలిపాడు.

స్పిరిట్ ఆఫ్ లీమాన్స్

స్పిరిట్ ఆఫ్ లీమాన్స్

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కావాలనుకుంటే, జెఫ్ బ్లోచ్ వెబ్‌సైట్ speedycop.com ను సందర్శించవచ్చు. ఈలోపుగా ఈ ప్లేన్ కార్ రోడ్డుపై చేసిన విన్యాసాలను మనం కూడా ఈ వీడియోలలో తిలకిద్దాం రండి..!

స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్
స్పిరిట్ ఆఫ్ లీమాన్స్ - ప్లేన్ కార్

More from DriveSpark

Article Published On: Friday, June 7, 2013, 16:07 [IST]
English summary
Jeff Bloch from South Carolina, United States has a unique creation. A plane-car. Dubbed the Spirit of LeMons, the ‘car' is the creation of 40 year old police officer, mechanic, racer, Jeff Bolch, aka Speedy Cop, and his team, ‘The Gang of Outlaws'.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+