మరో ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్ శ్రీలీల..ఇంతకీ దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా ?
చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శ్రీలీల. బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసి టాలీవుడ్ సెన్సేషన్ అయిపోయింది. రెండేళ్ల క్రితం వరుసగా డజను పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఈ అమ్మడు ఏ ముహూర్తాన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందో ఏమో కానీ.. కెరీర్ స్టార్టింగులోనే సీనియర్ స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేసింది. ఏకంగా నట సింహం బాలయ్య, మాస్ మహారాజ రవితేజ వంటి వారితో నటించే అవకాశం దక్కించుకుంది.
అందం, అభినయం, అదిరిపోయే స్టెప్పులతో యువత కలల రాణిగా మారిపోయింది. శ్రీలీల యూత్ డ్రీమ్ గర్ల్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. డిసెంబర్లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిస్సిక్ అంటూ ఐటమ్ సాంగ్ చేసి ప్రేక్షకులను వివరీతంగా ఆకట్టుకుంది. ఆ మధ్య అమ్మడు చేసిన సినిమాలన్నీ ఫ్లాపు కావడంతో కాస్త జోరు తగ్గింది. మళ్లీ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతుంది.

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. మరికొందరు దర్శక, నిర్మాతలు కూడా ఈ అమ్మడికి అవకాశం ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శ్రీలీల త్వరలో బాలీవుడ్ ఆరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో అమ్మడు ఓకే అయినట్లు సమాచారం. అలాగే ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో కూడా హీరో శివ కార్తికేయన్ సరసన నటిస్తుంది. ఈ అమ్మడికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
శ్రీలీలకు కన్నడలో కూడా సినిమాలు చేసింది. కిస్, జేమ్స్ లలో నటించి అక్కడ కూడా అభిమానులను సంపాదించుకుంది. శ్రీలీల టాలీవుడ్ లో చిత్రాంగద సినిమాతోనే వెండితెరకు పరిచయం అయింది. పుష్ప 2 సినిమాతో అమ్మడి క్రేజ్ నేషనల్ లెవల్లో పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు రావడంతో మాగ్జిమమ్ టైం ముంబైలోనే స్పెండ్ చేస్తుంది. ఇక్కడ సినిమాలు కూడా ఉండడంతో తను తరచుగా ముంబైకి హైదరాబాద్ కు చక్కర్లు కొడుతుంది.

ఈ క్రమంలోనే శ్రీలీల ముంబైలో తిరగడానికి ఓ కాస్ట్లీ కారును కొనుగోలు చేసింది. 2017 BMW X3 సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల శ్రీలీల అదే కారులో చాలా సార్లు కనిపించింది. గత ఐదు నెలల క్రితం కూడా అమ్మడు అదే కారు నడుపుతూ కనిపించింది. దీని ధర రూ.75.80 లక్షల నుండి రూ.77.80లక్షల(ఎక్స్-షోరూమ్) అని తెలుస్తోంది.
BMW X3 ఫీచర్స్ : ఇది ఒక SUV. దీనిలో ఐదుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఈ కారులో 550 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. BMW X3 రెండు పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లను కలిగి ఉంది. దీని 2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 193 PS హార్స్‌పవర్, 310 Nm (న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.ఈ కారు లీటరుకు 13 నుండి 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

మరొకటి 48V మైల్డ్ హైబ్రిడ్ 2 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 200 PS హార్స్‌పవర్, 400 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. దీనిలో 14.9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, 15-స్పీకర్ హర్మాన్ కార్డన్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ కారు సేఫ్టీపరంగా అద్భుతమైనదని చెప్పుకోవచ్చు.ఇందులో ప్రయాణిస్తున్న వారి సేఫ్టీకోసం ఎయిర్‌బ్యాగులు, ABS(యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD(ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), వెనుక పార్కింగ్ సెన్సార్స్ కలిగి ఉంటుంది. కొత్త BMW X3 SUV మెర్సిడెస్-బెంజ్ GLC, ఆడి Q5 నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటుంది.


Click it and Unblock the Notifications








