సలార్ బైక్ విజేత ఇతడే.. ఎలా గెలుచుకున్నాడంటే?
గత నెలలో 'స్టార్ మా' ఛానల్‌లో సలార్ మూవీ ప్రసారమైంది. ఈ సినిమా చూస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎస్ఎమ్ఎస్ ద్వారా పంపిన వారిలో ఒక్కరికి సలార్ సినిమాలో ప్రభాస్ వాడిన బైక్ అందుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు విజేతను ప్రకటించారు.
స్టార్ మా తాజాగా సలార్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బైక్ గెలుచుకున్న వ్యక్తిని ప్రకటిస్తూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేసింది. సలార్ బైక్ విజేత విజయవాడకు చెందిన వరప్రసాద్. అతని శుభాకాంక్షలు తెలిపింది. మీరు ఈ విజయాన్ని పొందటం మేము గొప్పగా భావిస్తున్నాము. ఈ బైకుతో కొత్త రైడ్ అనుభవిస్తారని ఆశిస్తున్నాము అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో సలార్ బైక్ విజేత వరప్రసాద్.. బైకును తీసుకోవడం చూడవచ్చు. ఇందులో తన పేరు, ఊరు కూడా వెల్లడిస్తూ.. బైక్ గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పడం చూడవచ్చు. చాలామంది సలార్ బైక్ విన్ అవ్వాలని ప్రయత్నించినప్పటికీ.. ఆ అదృష్టం కేవలం ఒక్కరిని మాత్రమే వరించింది. అతడే వరప్రసాద్. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేస్తున్నారు.
నిజానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.700 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఇది పార్ట్1, పార్ట్2 అనే రెండు భాగాలుగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన పార్ట్1 అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పార్ట్2 షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఇది కూడా త్వరలోనే విడుదలకానున్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు విడుదలవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

సలార్ సినిమాలో ఉపయోగించిన బైక్ గురించి..
పాన్ ఇండియా మూవీ సలార్ విడుదలైనప్పటి నుంచి.. ఆ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన బైక్ చాలా మంది దృష్టిని ఆకర్శించింది. చూడటానికి చాలా స్టైలిష్ డిజైన్ పొందిన ఈ బైక్ గురించి ఇప్పటికే పలువురు నెటిజన్లు పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. నిజానికి ఇది ఒక కస్టమైజ్డ్ 'రాయల ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350' బైక్. దీనిని హైదరాబాద్ నగరంలోని ఎయిమోర్ కస్టమ్స్ రూపొందించినట్లు సమాచారం.
కస్టమైజ్డ్ రాయల ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 350 బైకులో అనేక అప్డేట్స్ గమనించవచ్చు. ఇందులో కొత్త ఫ్యూయెల్ ట్యాంక్ ఉపయోగించబడినట్లు సమాచారం. అంతే కాకుండా హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, ఫ్రంట్ వీల్స్, టైర్లు అన్నీ కూడా మార్చినట్లు తెలుస్తోంది. సీటు కూడా కొత్తగా డిజైన్ చేసినది కావడం గమనార్హం. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా తొలగించబడింది. ఈ బైక్ థండర్‌బర్డ్ 350 అయినప్పటికీ.. చూడగానే ఇదో కొత్త బైకు మాదిరిగానే కనిపిస్తుంది.
సైడ్ కవర్లు, ఫ్యానెల్ అన్నీ కూడా కస్టమైజ్ చేశారు. సైడ్ కవర్ మీద మెటల్ కేజ్ ఉండటం చూడవచ్చు. హ్యాండిల్ బార్ కూడా కొత్తగా ఉంది. ఇంజిన్, రిమ్స్ నలుపు రంగులో పూర్తి చేయబడ్డాయి. ఎగ్జాస్ట్ కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కావడం గమనార్హం. బైకులో ఎక్కువ భాగం సిల్వర్ కలర్ పొందినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ బైక్ చూడగానే బైక్ ప్రేమికులను తప్పకుండా ఆకర్శించే విధంగా ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








