Just In
- 10 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 11 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 14 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 14 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- News
కేసీఆర్ మనవడికీ పదవచ్చేదే, కానీ: రవినాయక్ మంచోడంటూ బండి సంజయ్, విజయశాంతి ఫైర్
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 1,100 కి.మీ ప్రయాణించిన కొడుకు
కొంతమంది కొడుకులు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఈ విధంగా కొచ్చికి చెందిన రాహుల్ ఆర్ నాయర్ తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సైకిల్ పై బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్ళాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుదుకుందాం.

రాహుల్ ఆర్ నాయర్ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో స్టార్టప్ కంపెనీని నడుపుతున్నాడు. అతను తన వాహనం ద్వారా కేరళలోని కొచ్చికి వెళ్లాలనుకున్నాడు. కానీ అతని డ్రైవింగ్ లైసెన్స్ 2 నెలల క్రితం ముగిసింది. కొచ్చికి వస్తామని తల్లిదండ్రులకు వాగ్దానం చేసినందున అతడు తమ పర్యటనను వాయిదా వేయడానికి ఇష్టపడలేదు.

అతను తల్లిదండ్రుల వైద్య చికిత్స చేయించడం కోసం తప్పకుండా కొచ్చి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు కేరళలో కరోనా పరిస్థితి కొంత సదాహరణ పరిస్థితికి చేరుకొని ప్రజా రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. అంతే కాకుండా అంతరాష్ట్ర ప్రయాణం కూడా సులభం అయింది.
MOST READ:మీకు తెలుసా.. 2021 డాకర్ ర్యాలీలో పాల్గొనే హీరో మోటార్‌స్పోర్ట్ టీమ్ ఇదే

కానీ రాహుల్ ఆర్ నాయర్ ప్రజా రవాణా ద్వారా ప్రయాణించడానికి నిరాకరించారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందనే భయం దీనికి ప్రధాన కారణం. చివరకు రాహుల్ ఆర్ నాయర్ తన సైకిల్ ద్వారా కొచ్చి చేరుకున్నాడు.

నవంబర్ 18 న బెంగళూరు బయలుదేరిన రాహుల్ నాయర్ నవంబర్ 21 న కొచ్చిలోని తన ఇల్లు చేరుకున్నాడు. సైకిల్ పై ప్రయాణిఉంచి అతని తల్లిదండ్రులతో మాట్లాడాడు. నాయర్ తల్లిదండ్రులు కె రామచంద్రన్ నాయర్ మరియు మృణాలిని. తమ కొడుకు రాకతో రాహుల్ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కొచ్చిలో తన పని పూర్తి చేసిన తర్వాత రాహుల్ ఆర్ నాయర్ నవంబర్ 27 న సైకిల్ ద్వారా బెంగళూరుకు తిరిగి వచ్చారు.
MOST READ:మత్తులో చేసిన పనికి మత్తు దిగేలా గుణపాఠం చెప్పిన పోలీసులు.. ఎక్కడో తెలుసా ?

మూడు రోజుల సైక్లింగ్ తరువాత, అతను బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు నుండి కొచ్చి, కొచ్చి బెంగళూరు వరకు మొత్తం 1,100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. ఇది అతనికి ప్రత్యేక అనుభూతిని కలిగించింది. రాహుల్ ఆర్ నాయర్ సైక్లింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతాడు.

అతను బెంగళూరులో టూ వీల్స్ మరియు హ్యాండిల్ బార్ అనే స్టార్టప్ కంపెనీని నడుపుతున్నాడు. దీని ద్వారా సైక్లింగ్ గురించి ప్రజలకు కూడా తెలుపుతూ ఉంటాడు. రాహుల్ ఆర్ నాయర్ స్వయంగా సైక్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. లాక్డౌన్ సమయంలో చాలా మంది సైకిల్ ద్వారా వేలాది మైళ్ళు ప్రయాణించారు. తమ ఊరు చేరుకోవడానికి ప్రజా రవాణా అవసరం లేనందున ఉద్యోగాలు కోల్పోయిన వారు సైకిల్‌లో ప్రయాణించారు.
MOST READ:దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఇంతకు ముందు చెప్పినట్లుగా, భారతదేశంలో ప్రజా రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. సైకిల్ ద్వారా వేలాది కిలోమీటర్లు ప్రయాణించడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం. చాలా మంది ప్రజలు సైకిల్ ద్వారా లాంగ్ రైడ్ నడుపుతారు. ఈ చిత్రాలు టూ వీల్స్ మరియు హ్యాండిల్ బార్ నుండి తీసుకోబడ్డాయి.