ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

ఉక్కు మనిషిగా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లాభాయ్ పటేల్ దేశ సమైక్యత కోసం చేసిన సేవలకు గుర్తుగా గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం (182 మీటర్లు)గా చరిత్ర సృష్టించిన ఈ విగ్రహ ప్రాంగణం ఇప్పుడు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైంది.

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంతాన్ని 'ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ' జోన్‌గా మార్చారు. ఈ మేరకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ టూరిజం గవర్నెన్స్ అథారిటీ (సౌద్‌టిజిఎ) పేర్కొన్న సమాచారం ప్రకారం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు.

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

జూన్ 05వ తేదీ నుండి కేవడియాలో ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే నడిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కేవడియా అనేది గుజరాత్ రాష్ట్రంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ఉన్న పట్టణం. గత 2019లోనే ప్రధాని మోడీ కేవడియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో నర్మద జిల్లాలోని కేవడియా గ్రామంలో ఉన్న సర్దార్ సరోవర్ ఆనకట్ట వద్ద నిర్మించారు. గత 2018లో ఈ విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు. ఇది గుజరాత్ రాజధాని వడోదర నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

ఈ విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ జోన్‌గా అభివృద్ధి చేయడానికి ఇప్పుడు సౌద్‌టిజిఏ సిద్ధంగా ఉంది. ఈ మార్పును దశలవారీగా చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి సహాయం అందించబడుతుంది. ఈ ప్రాంతంలో మరియు చుట్టుపక్కల పనిచేస్తున్న సౌద్‌టిజిఏ ఉద్యోగులకు కూడా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వబడుతుంది.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

ఈ రాయితీ పొందిన లబ్ధిదారులు అంతర్గత దహన యంత్రాలతో (పెట్రోల్ లేదా డీజిల్‌తో) నడిచే వాహనాలు ఈ ప్రాంతంలో నడపబోమని హామీ ఇవ్వాలి. ఈ ప్రణాళికలో భాగంగా, 50 ఇ-రిక్షాలు ఈ ప్రాంతంలో పనిచేయడానికి అనుమతించబడతాయి మరియు వాటి కోసం మహిళలను రిక్షా డ్రైవర్లుగా నియమించనున్నారు.

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

ఈ మహిళా డ్రైవర్ల కోసం ప్రత్యేక శిక్షణా వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. అలాగే, ఈ ఎలక్ట్రిక్ రిక్షాల కోసం, ఈ ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్లతో పాటు సర్వీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబడతాయి. అయితే, ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఏ బ్రాండ్ ఇ-రిక్షాలు ఉపయోగించబడుతాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

కేవడియాలో కాలుష్యాని వెదజల్లే పరిశ్రమలు లేవని మరియు ఇక్క రెండు శక్తివంతమైన జలవిద్యుత్ ప్లాంట్లు ఉన్నాయని, ఇవి సమృద్ధిగా పర్యావరణ అనుకూల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని సౌద్‌టిజిఏ పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ఎలక్ట్రిక్ వాహనాల కోసం మాత్రమే కేటాయించడం వల్ల గాలి మరియు శబ్ద కాలుష్యం పూర్తిగా తగ్గిపోతుందని మరియు ఈ ప్రత్యేకమైన పర్యాటక కేంద్రం మరింత క్లీన్‌గా ఉంటుందని అభిప్రాయ పడింది.

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

అయితే, స్టాచ్యూ ఆఫ్ యూనిటి వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఓన్లీ జోన్‌గా మారే ప్రాంతం యొక్క పరిమాణం గురించి కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం చాలా కాలంగా కేవడియాను పర్యావరణ అనుకూల నగరంగా మార్చాలని యోచిస్తోంది. ఈ నగరంలో సున్నా-ఉద్గారాలను సాధిస్తే అది ఖచ్చితంగా గొప్ప సాధనే అవుతుంది.

MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

ఉక్కు మనిషికి వద్దకు ఈవీలకు మాత్రమే ఎంట్రీ; పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ!

ఇతర నగరాల నుండి వచ్చే పర్యాటక వాహనాల గురించి ఇందులో ఎలాంటి విషయాన్ని పేర్కొనలేదు. దేశంలోని తాజ్‌మహల్ ప్రాంతం వద్ద కాలుష్య నివారణ కోసం ఎలా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తున్నారు, ఇప్పుడు ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటి వద్ద కూడా అలానే ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించబోతున్నారన్నమాట.

Most Read Articles

English summary
Statue Of Unity Becomes Eco Friendly Vehicle Zone; Only Electric Vehicles Are Allowed Near the Statue. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X