ధూమశకటాల రేసింగ్ చూశారా..? (యానిమేటెడ్ వీడియో)
కార్ రేసింగ్, బైక్ రేసింగ్, బోట్ రేసింగ్, సైకిల్ రేసింగ్, ట్రక్ రేసింగ్ ఇలా పలు రకాల రేస్‌ల గురించి మనం విన్నాం, చూశాం. కానీ ట్రైన్ రేసింగ్ (రైలు రేస్)ను మీరెప్పుడైనా చూశారా.. పోనీ కనీసం దీని గురించి ఎప్పుడైనా విన్నారా..? ఆశ్చర్యంగా ఉంది కదూ..!
వాస్తవానికి ట్రైన్ రేస్ ప్రపంచంలో ఎక్కడా జరగటం లేదు, జరిగితే ఎలా ఉంటుందోనని కొందరు ఔత్సాహికులు ఊహించి ఇదిగో ఈ యానమేటెడ్ వీడియో రూపంలో మన కళ్ల ముందుకు తీసుకువచ్చారు. నిజానికి ఇది రియల్ ట్రైన్ రేస్ కాదు, యానిమేషన్ మాత్రమే.
ఈ వీడియోలో ఆవిరి రైళ్లు (స్టీమ్ ట్రైన్స్) పట్టలాపై ఒకదానితో ఒకటి పోటీపడుతూ దూసుకుపోతుంటాయి. ఇది కల్పితమే అయినప్పటికీ, చూసేవారికి మాత్రం సరదాగా అనిపిస్తుంది. ఈ వీడియోను 5డిలో చిత్రీకరించారు. ఒకవేళ మీరు దీనిని 3డి కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో వీక్షించినట్లయితే, ఇది మరింత థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మరి ఆ అద్భుతాన్ని మనం కూడా ఈ క్రింది వీడియోలో వీక్షిద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/V4RIBmM2ZF0?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








