కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ మునుపటి కన్నా తీవ్రంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, సమాజిక దూరాన్ని పాటిస్తూ మరియు వ్యక్తిగత శుభ్రతను పాటించడం ఎంతో అవసరం. కరోనా వైరస్‌కి ఇప్పటికీ సరైన మందు లేదు, ముందస్తు జాగ్రత్త ఒక్కటే దీని నివారణకు ఏకైక మార్గం.

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రకాల సంస్థలు ఇప్పటికే ఫేస్ మాస్కులను మరియు ఫేస్ షీల్డ్‌లను తయారు చేస్తున్నాయి. ఆటోమొబైల్ రంగానికి చెందిన ప్రముఖ హెల్మెట్ తయారీ బ్రాండ్ స్టీల్‌బర్డ్ కూడా ఇటు కరోనా వ్యాప్తి నివారణకు మరియు అటు టూవీలర్ రైడర్ల సేఫ్టీ కొరకు ఫేస్ షీల్డ్‌లను తయారు చేస్తోంది.

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

స్టీల్‌బర్డ్ ఇటీవల 5-వే ఫేస్ షీల్డ్‌ను ప్రారంభించింది మరియు దీనికి వినియోగదారుల నుండి మంచి స్పందన లభిస్తోంది. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఈ ఫేస్ షీల్డ్ అమ్మకాలు ఇప్పుడు జోరందుకున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో, ఇవి సగటున రోజుకు 10,000 యూనిట్ల వరకూ అమ్ముడయ్యేవి.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

అయితే, ఇటీవలి కాలంలో కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడంతో వీటి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, సెకండ్ వేవ్ మెరుపు వేగంతో వ్యాప్తి చెందుతుండటంతో ఇప్పుడు ఈ స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ అమ్మకాలు తిరిగి ఉపందుకున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 6,000 యూనిట్లు అమ్ముడవుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో, ప్రజలు తిరిగి ముఖాన్ని పూర్తిగా కవర్ చేసే ఫేస్ షీల్డ్‌లవైపు మొగ్గు చూపుతున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఈ ఫేస్ షీల్డులను వివిధ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసింది.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

ఈ ఫేస్ షీల్డ్ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పోలీసు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వంటి ఫ్రంట్‌లైన్ వారియర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. అలాగే, సాధారణ ప్రజలు కూడా దీనిని సులభంగా ఉపయోగించుకోవచ్చు.

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలోని ఉన్న కంపెనీ ప్లాంట్లో స్టీల్ బర్డ్ ఫేస్ షీల్డ్‌లను తయారు చేస్తున్నారు. గడచిన ఆగస్టులో, కంపెనీ ఈ కొత్త ఫేస్ షీల్డ్‌ను ప్రారంభించింది. ఇందులో బిల్ట్ ఇన్ హ్యాండ్స్ ఫ్రీ ఫంక్షన్ కూడా ఉంటుంది. దీని సాయంతో యూజర్లు ఫోన్‌ను బయటకు తీయాల్సిన అవసరం లేకుండానే కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు.

MOST READ:సమంత మనసు ఆకాశమంత.. దీనికి ఇదే నిలువెత్తు నిదర్శనం

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

ఇవే కాకుండా స్టీల్ బర్డ్ కంపెనీ పిల్లల కోసం కూడా ఫేస్ షీల్డ్‌లను తయాపు చేస్తోంది. ఈ సంస్థ అందిస్తున్న ఫేస్ షీల్డ్‌లన్నీ కూడా ముఖాన్ని పైనుంచి క్రింది వరకూ పూర్తి కవర్ చేసేలా ఉంటాయి. ఈ ఫేస్ షీల్డ్ ఉపయోగించడం సులభం మరియు శుభ్రం చేయటం కూడా సులభం.

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

స్టీల్ బర్డ్ బ్రాండ్ ఇటీవలే ఓ కొత్త బ్రాట్ రేంజ్ హెల్మెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ ప్రీమియం హెల్మెట్ ధర రూ.5149 గా ఉంది. స్టీల్ బర్డ్ బ్రాట్ రేంజ్ హెల్మెట్లు యూరోపియన్ మరియు ఐఎస్ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. వీటిని తేలికైన మరియు ధృడమైన హై ఇంపాక్ట్ థర్మోప్లాస్టిక్‌తో తయారు చేశారు.

MOST READ:భారత్‌లో అక్కడ కరోనా లాక్‌డౌన్ స్టార్ట్; కఠినమైన రూల్స్, వీటికి మాత్రమే మినహాయింపు

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

రైడర్ల సేఫ్టీ కోసం అధిక పనితీరు మరియు రక్షణ దుస్తులను ఉత్పత్తి చేసే అమెరికాకు చెందిన బ్లోవర్ అనే సంస్థతో కలిసి స్టీల్ బర్డ్ ఈ హెల్మెట్‌ను రూపొందించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యంలో భాగంగా, స్టీల్ బర్డ్ మరిన్ని హెల్మెట్లను మరియు ప్రొటెక్టివ్ గేర్‌ను తీసుకురానుంది.

కరోనా ఎఫెక్ట్.. పెరిగిన స్టీల్‌బర్డ్ ఫేస్ షీల్డ్ సేల్స్.. రోజుకి 6000 పైనే..

రైడర్ కంఫర్ట్ కోసం స్టీల్ బర్డ్ బ్రాట్ రేంజ్ హెల్మెట్లను మంచి సౌకర్యవంతమైన ఫాబ్రిక్‌తో తయారు చేశారు. ఈ హెల్మెట్‌లను అన్ని స్టీల్‌బర్డ్ అవుట్‌లెట్లలో మరియు కంపెనీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Steelbird Face Shield Daily Sales Crosses 6,000 Units, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X