స్టెప్నీ.. అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా? దాని వెనుక ఉన్న కార‌ణాలివే

అసలు స్పేర్ టైరును స్టెప్నీ అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారు. వినడానికే ఎంతో ఇంట్రెస్టింగా ఉంది కదూ... స్పేర్ టైరును స్టెప్నీ అని ఎందుకు పిలుస్తున్నారు మరియు దీని వెనుకున్న ఆసక్తికరమైన నిజాలు

By N Kumar

టైర్ పంక్చర్.... ఫోర్ వీలర్ నడపడం వచ్చిన ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఈ సమస్యను ఎదుర్కొని ఉంటారు. వాహనం నడుపుతున్నపుడు ఎదురయ్యే సమస్యల్లో టైర్ పంక్చర్ సర్వసాధారణం. మనం నడిపే రోడ్లు బాగోలేకపోయినా... వెహికల్ టైర్లు సరిగ్గా లేకపోయినా.... టైర్లు పంక్చర్‌కు గురవుతుంటాయి.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ఇలా టైర్ పంక్చర్ అయిన ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరు స్టెన్నీ మీద ఆధారపడతారు. క్షమించండి... స్టెప్నీ కాదు స్పేర్ టైర్. నిజమే, ప్రతి వాహనంలో తయారీదారులు అందించే అదనపు చక్రాన్ని స్పేర్ టైర్ అంటారు.

Recommended Video

[Telugu] Toyota Etios Safety Experiential Drive in Bengaluru - DriveSpark
స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

అయితే, చాలా మంది ఇండియన్స్ అదనపు చక్రాన్ని(స్పేర్ వీల్) స్టెప్నీ అంటారు. అసలు స్పేర్ టైరును స్టెప్నీ అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారు. వినడానికే ఎంతో ఇంట్రెస్టింగా ఉంది కదూ... స్పేర్ టైరును స్టెప్నీ అని ఎందుకు పిలుస్తున్నారో.. దీని వెనుకున్న ఆసక్తికరమైన నిజాన్ని డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఇవాళ్టి కథనంలో అందిస్తోంది. మరెందుకు ఆలస్యం చూద్దాం రండి....

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

చక్రం ఆవిష్కరించిన తరువాత మానవ ప్రపంచంలో ఎన్నో మార్పులు సంభవించాయి, మరెన్నో ఆవిష్కరణలు జరిగాయి. ఆటోమొబైల్స్‌ మొత్తం గుండ్రటి ఆకారం మీద ఆధారపడిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చక్రం ఆవిష్కరణతో గుండ్రంగా తిరిగే ఎన్నో యంత్రాలు పురుడుపోసుకున్నాయి. వాటిలో ఒకటి వాహనాలు నడవడానికి ఉపయోగపడే ఇంజన్.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి గుండ్రంగా ఉన్న చక్రాలకు అందడంతో వాహనాలు ముందుకు కదిలేవి. చక్రాలు బరువును తట్టుకోవడానికి రబ్బరు టైర్లను జోడించారు. కొన్నాళ్లకు ట్యూబులతో కూడిన రబ్బరు టైర్లు గల చక్రాలు అందుబాటులోకి వచ్చాయి.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

రబ్బరు టైర్లలోని ట్యూబులు పంకర్చ్ అవడంతో 1900 కాలంలో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునేవారు. దీనికి పరిష్కారంగా వచ్చిన ఆవిష్కరణ స్పేర్ టైర్. ప్రతి వాహనంలో అదనంగా ఓ టైర్ ఉండేది.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

స్పేర్ వీల్ ఎవరు కనిపెట్టారు...?

1904 వ సంవత్సరంలో ఇంగ్లాడులోని వేల్స్ దేశంలో ఉన్న లానెల్లీ నగరానికి చెందిన వాల్టర్ మరియు టామ్ డేవీస్ అనే ఇద్దరు వ్యక్తులు స్పేర్ టైరును ఆవిష్కరించారు. స్టెప్నీ ఐరన్ మోంగర్స్ అనే కంపెనీ స్థాపించి మోటార్ వాహనాలకు అదనపు టైర్లను ఉత్పత్తి చేయడాన్ని ప్రారంభించారు.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

వాల్టర్ మరియు టామ్ డేవీస్ లానెల్లీ నగరంలోని స్టెప్నీ అనే వీధిలో నివశించేవారు. తమ మొదటి స్పేర్ టైర్ తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడే నెలకొల్పడంతో తమ కంపెనీకి స్టెప్నీ ఐరన్ మోంగర్స్ అనే పేరును పెట్టారు.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

20 వ శతాబ్దం తొలి సగ భాగం (1900-1950)లో ఆటోమొబైల్ రంగంలో ఎన్నో మార్పులు జరిగి, సరికొత్త ఆవిష్కరణలు జరిగాయి. అనతి కాలంలోనే వాహనం వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు ప్రపంచాన్ని వణికించిన మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో వాహన వినియోగం విపరీతంగా పెరిగింది. అప్పట్లో ప్రతి వాహనంలో కూడా స్పేర్ వీల్ తప్పనిసరి అయ్యేదు.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

స్పేర్ వీల్ తయారు చేసే సంస్థ స్టెప్నీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. స్టెప్నీ సంస్థ తమ స్పేర్ టైర్లను ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు ఎగుమతి చేసేది. ప్రపంచ వాహన పరిశ్రమకు తొలిసారిగా స్పేర్ టైర్ పరిచయం చేసిన సంస్థ స్టెప్నీ.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్ మరియు ఇటలీలోని దేశాలు స్పేర్ టైర్ అని పిలిస్తే, బ్రిటీష్ సామ్రాజ్యంలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్టా మరియు ఇండియా దేశాలు దీనిని స్టెప్నీ అని పిలిచేవి.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ఇండియాలో స్టెప్నీ అని ఎందుకు పిలుస్తారు....?

భారత్‌ ఆంగ్లేయుల పాలన ఉన్నపుడు వాహనాలను దిగుమతి చేసుకునే వారు. ఒక విధంగా చెప్పాలంటే భారతీయులకు వాహనాలను పరిచయం చేసింది ఆంగ్లేయులే అని చెప్పవచ్చు. బ్రిటిష్ వారి పాలనలో రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. దీంతో వాహనాలు ఎప్పుడు పంక్చర్ అవుతుండేవి.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా స్టెప్నీ ఐరన్ మోంగర్స్ తయారీ చేసే స్పేర్ టైర్లను దిగుమతి చేసుకుని వినియోగించే వారు. బ్రిటిషర్లు పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ మరియు మాల్టా దేశాలను పరిపాలిస్తున్న సమయంలో స్పేర్ టైర్లను స్టెప్నీ అని పిలిచేవారు.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

తరువాత కాలంలో, భారతదేశంలో స్వాతంత్ర్య ఉద్యమాలు ఊపందుకోవడంతో ఆంగ్లేయులు ఇండియాకు స్వాతంత్రం ప్రకటించి దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే, వారు తీసుకొచ్చిన స్టెప్నీ అనే పదం అలాగే భారతీయుల్లో నాటుకుపోయింది. దీంతో ఇప్పటికీ ప్రతి ఒక్కరూ స్పేర్ టైరును స్టెప్నీ అంటారు.

స్టెప్నీ... అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

ఇంగ్లాండులో గల లానెల్లీ నగరంలో స్టెప్నీ అనే వీధి ఉండటం, ఆ వీధి పేరు మీదుగా స్పేర్ టైర్లను తయారు చేసే కంపెనీ ఏర్పడటం, అది తయారు చేసే స్పేర్ టైర్లను ఆంగ్లేయులు ఇండియాకు దిగుమతి చేసుకుని వాటిని స్టెప్నీలుగా పిలవడంతో భారత్‌లో స్టెప్నీ అనే పేరు స్పేర్ వీల్ కన్నా బాగా ప్రాచుర్యం పొందింది.

.

ట్యూబ్ లెస్ టైర్ల ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మానుకోవాల్సిన అలవాట్లు

టైర్లు ఎందుకు పేళుతాయి, టైర్ల పేలడాన్ని ఎలా నిరోధించాలి మరియు వాటి నిర్వహణ ఏలా చేయాలి ?

Most Read Articles

English summary
Read In Telugu: Do you know why India started calling the spare tyre as Stepney? Read this interesting story on how the spare tyre in a car got it's name Stepney.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X