స్టాక్ మార్కెట్‌లో ఒకే ట్రేడింగ్‌లో వచ్చిన భారీ లాభంతో ఏకంగా ఖరీదైన కారు కొనేశాడు

స్టాక్ మార్కెట్‌ అంటే ఇప్పుడంతా మాట్లాడే అంశమే... కానీ అదే సమయంలో చాలామందికి ఇది భయంకరమైన ఆటగా అనిపిస్తుంది. మార్కెట్‌ ఎలా మారుతుందో ముందుగానే చెప్పలేము కాబట్టి చాలా మంది దూరంగానే ఉంటారు. అయితే క్రమశిక్షణ, ఓపిక, సరైన స్ట్రాటజీ ఉంటే ట్రేడింగ్‌ ద్వారా రెగ్యులర్‌ ఆదాయం సంపాదించడం అసాధ్యం కాదు. నిజంగా మన చుట్టూ కూడా ట్రేడింగ్‌ను కెరీర్‌లా తీసుకుని, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారిలో బెంగాల్‌కు చెందిన యువ ట్రేడర్ సౌమిక్ సిన్హా రాయ్ ఒకరు. స్టాక్ మార్కెట్‌లో ఒకే ట్రేడ్ ద్వారా వచ్చిన భారీ లాభంతో అతను నేరుగా మహీంద్రా XEV 9E ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశాడు.

తాజాగా తన కొత్త EV కారుతో తీసుకున్న ఫొటోలను, అలాగే ఆ ట్రేడ్‌ డీటెయిల్స్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సౌమిక్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఒకే ట్రేడ్ లాభంతో నేరుగా కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనడం చాలా అరుదైన విషయం. అయితే ఇది స్టాక్ మార్కెట్‌లో ఉన్న అవకాశాలు ఎంత పెద్దవో కూడా మరోసారి నిరూపిస్తోంది.

Stock Market Profit Helps Trader Buy Mahindra Xev 9e Ev

కచ్చితమైన విశ్లేషణ, రిస్క్ మేనేజ్‌మెంట్‌, మార్కెట్‌పై పట్టుదల ఉంటే ఇలాంటి విజయాలు సాధ్యమే అని సౌమిక్ ఉదాహరణ చెబుతోంది. సౌమిక్ సిన్హా రాయ్ షేర్ చేసిన ఫోటోలో కొత్తగా కొనుక్కున్న ఎలక్ట్రిక్ SUV ముందు, తన తల్లి, భార్యతో కలిసి నిలబడి ఉన్న ఫొటోలు ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కుటుంబంతో కలిసి తీసుకున్న ఈ డెలివరీ మూమెంట్ అతను సాధించిన విజయాన్ని మరింత అర్థవంతం చేస్తోంది.

ఫోటోలలో, అతను తన ల్యాప్‌టాప్‌ను XEV 9E బానెట్‌పై ఉంచి, అందులోని స్క్రీన్‌పై తన ప్రాఫిట్ వచ్చిన ట్రేడింగ్ పొజిషన్లను చూపిస్తున్నాడు. అంటే, ఈ కారు పూర్తిగా స్టాక్ మార్కెట్‌లో ఒకే ట్రేడ్ ద్వారా వచ్చిన లాభంతో కొనుగోలు చేశానని అతను ఓపెన్‌గా చూపించాడు. అతను తీసుకున్న మోడల్ కూడా ప్రత్యేకమే, టాంగో రెడ్ షేడులో ఉన్న Mahindra XEV 9E ఎలక్ట్రిక్ SUV.

Stock Market Profit Helps Trader Buy Mahindra Xev 9e Ev

mahindra XEV 9E ఎలక్ట్రిక్ SUV గురించిన వివరాలను ఒకసారి చూసినట్లయితే, మహీంద్రా XEV 9E EV భారత మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన మోడల్‌గా మారింది. ఈ మోడల్ ధరలు రూ.21.90 లక్షల నుంచి రూ.31.20 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండటం దీని ప్రీమియం స్థానాన్ని స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా, టాప్ వేరియంట్‌లో 11 kW ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుంది.

ఇది బ్యాటరీని తక్కువ సమయంలోనే రీఛార్జ్ చేసేందుకు సహాయపడుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే, రెండు శక్తివంతమైన ఆప్షన్‌లను అందిస్తోంది. కింది వేరియంట్‌లు 59 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఈ వెర్షన్ 228 bhp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 542 కి.మీ. రేంజ్ అందించడం ప్లస్ పాయింట్. రోజువారీ ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్స్.. ఏది అయినా ఈ రేంజ్‌ బెస్ట్.

Stock Market Profit Helps Trader Buy Mahindra Xev 9e Ev

అదే సమయంలో, టాప్ వేరియంట్‌లకు 79 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ అందిస్తోంది. దీని పవర్ అవుట్‌పుట్ మరింత శక్తివంతంగా ఉండి 282 bhp పవర్, 380 Nm టార్క్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ వల్ల 656 కి.మీ. రేంజ్ అందించడం దీన్ని లాంగ్ రేంజ్ ఈవీల్లో ముందంజలో నిలబెడుతోంది. దీని ఇంటీరియర్ కూడా ప్రపంచ స్థాయిగా ఉంది. ముందు, వెనుక కూర్చున్న వారికి అధునాతన సీటింగ్ సౌకర్యంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 24, 2025, 10:57 [IST]
English summary
Stock market profit helps trader buy mahindra xev 9e ev more details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+