42 ఏళ్ల తర్వాత దొరికిన బైక్, కానీ చూడటానికి ఓనర్ లేరు..

By Ravi

పోయిందనుకున్న విలువైన వస్తువు చాలా కాలం తర్వాత తిరిగి లభిస్తే, ఆ వ్యక్తి ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు ఈ కథనం ఇలాంటి అంశానికి సంబంధించినది. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న పురాతన హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ను చూడండండి. ఇది 1954కి చెందిన మోడల్. ఇదొక పోలీస్‌కి చెందిన బైక్. ఇది 1972లో చోరీకి గురైంది. తాజాగా, సెప్టెంబర్ 7, 2014న తిరిగి లభించింది. వివరాల్లోకి వెళితే..

నార్త్ కాలిఫోర్నియాలోని ఎడ్గర్ హోవర్డ్ జాన్సన్ అనే పోలీసుకి చెందిన 1954 హ్యార్లీ డేవిడ్‌సన్ హైడ్రా-గ్లైడ్ మోడల్ మోటార్‌సైకిల్ 1972లో దొంగిలించబడినది. అప్పటి వరకూ ఈ బైక్ ఆచూకీ తెలియలేదు. అయితే, తాజాగా యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సిపిబి) పోలీసులు ఈ బైక్‌ను లాస్ ఏంజిల్స్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గుర్తించారు.

Old Bike

వాస్తవానికి ఈ బైక్‌కి సంబంధించి రికార్డులను తారుమారు చేయటం వల్లనే దీనిని గుర్తించడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఈ బైక్ రికార్డుల ప్రకారం, 2003లో ఓ స్త్రీ ఈ బైక్‌ని కొనుగోలు చేసినట్లుగా ఉంది. ఆ తర్వాత దాదాపు 11 ఏళ్ల వరకు దీనిని ఇంగ్లాండ్‌లో ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాత 2012లో ఆస్ట్రేలియాలోని ఓ ఎగుమతిదారునిని ఈ బైక్‌ని విక్రయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

అయితే, దాదాపు 42 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తన బైక్‌ను కళ్లారా చూసుకునేందుకు, ఈ బైక్ అసలు యజమాని ఎడ్గర్ ఈ భూమ్మీద జీవించి లేరు. దీంతో ఈ బైక్‌ను ఎడ్గర్ పెద్ద కుమారుడు ఎడ్గర్ హోవర్డ్ జాన్సన్ జూనియర్‌కి అందజేశారు. వాస్తవానికి ఈ బైక్ ఒరిజినల్ కలర్ గ్రీన్ (ఆకుపచ్చ), ప్రస్తుతం ఈ బైక్‌ని యల్లో (పసుపు) రంగులోకి మార్చేశారు.

More from DriveSpark

Article Published On: Saturday, October 11, 2014, 12:55 [IST]
English summary
Stolen in 1972 from Edgar Howard Johnson a cop in North Carolina, a 1954 Harley Davidson Hydra-Glide was finally found on September 7 this year in Los Angeles after interception of U.S. Customs and Border Protection (CPB) officers.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+