33 ఏళ్ల క్రింత దొంగిలించబడిన కారు తిరిగొచ్చిన వేళ..
మనకు ఇష్టమైన వస్తువు ఏదైనా మన దగ్గర నుంచి చేజారిపోయి తిరిగి కొంత కాలం తర్వాత దక్కితే, అప్పుడు వచ్చే సంతోషానికి అవధులు ఉండవు. అలాంటి ఓ సంఘటనే ఇది. డెట్రాయిట్‌కు చెందిన జార్జ్ టాల్లే అనే ఓ వ్యక్తికి చెందిన 1979 మోడలల్ షెవర్లే కార్వెట్ కారును దాదాపు 33 ఏళ్ల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. కాగా.. ఇప్పుడు ఆ కారు 33 ఏళ్ల తర్వాత తిరిగి తన స్వంత యజమానికి జార్జ్ వద్దకు చేరింది.
స్థానిక వార్తలలో ఈ విషయాన్ని గుర్తించిన జనరల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ రియుస్ టెల్లీకి ప్రియమైన తమ షెవర్లే కార్వెట్‌ను డెట్రాయిట్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేశాడు. తన కారును తిరిగి దక్కించుకున్న జార్జ్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఎప్పటికీ తిరిగి రాదనుకున్న తన కారు దక్కడంతో జార్జ్ చిన్నపిల్లాడిలా సంతోషంతో గంతులేశాడు.
మరింత సమాచారం తర్వాతి సెక్ష్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

జార్జ్ టాల్లే కారు 1981లో జెఫ్ఫర్సన్ స్ట్రీట్‌లో చోరీకి గురైంది. ఆ తర్వాత ఈ కారును మిస్సిసిపిలోని హాట్టీస్‌బర్గ్ వద్ద కనుక్కొన్నారు. మిస్సిసిపిలో ఈ కారును గుర్తించే నాటికి సదరు షెవర్లే కార్వెట్ 47,000 మైళ్లు దూరం ట్రావెల్ చేసినట్లుగా ఓడోమీటరుపై రీడింగ్ ఉంది.

ఈ షెవర్లే కార్వెట్ 1979 మోడల్‌కు చెందినదైనప్పటికీ, ఇది పూర్తి రన్నింగ్ కండిషన్‌లో ఉంది. ఇదొక అరుదైన మాస్టర్ పీస్ కారు. జనరల్ మోటార్స్ రినైసెన్స్ సెంటర్ ఈ గ్రే కలర్ 1979 షెవర్లే కార్వెట్ కారును తన స్వంత యజమానికి జార్జ్‌కు చేరవేయటంలో సహకరించింది.

జనరల్ మోటార్స్ ఇలాంటి సాయం చేయటం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల నేషనల్ కార్వెట్ మ్యూజియంలో సింక్‌హోల్ ఏర్పడి డ్యామేజ్ అయిన షెవర్లే కార్వెట్ కార్లను కూడా పునఃరిద్ధరించేందుకు కూడా ముందుకొచ్చింది.
తర్వాతి స్లైడ్‌లలో షెవర్లే కార్వెట్ కారు గురించి తెలుసుకోండి.

ప్రపంచపు ఆటోమొబైల్ దిగ్గజాలలో ఒకటైన అమెరికన్ కంపెనీ జనరల్ మోటార్స్‌కు షెవర్లే బ్రాండ్‌లో కంపెనీ అందిస్తున్న అత్యంత పాపులర్ అమెరికన్ స్పోర్ట్స్ కార్ 'షెవర్లే కార్వెట్'. ప్రపంచంలో కెల్లా దీర్ఘకాలంగా, నిరంతరాయంగా ఉత్పత్తి చేయబడుతున్న ప్యాసింజ్ కారు కూడా ఇదే.

జూన్ 30, 1953లో మొట్టమొదటి షెవర్లే కార్వెట్ కారును మిచ్‌లోని ఫ్లింట్‌లో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో తయారయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 లక్షలకు పైగా కార్వెట్ స్పోర్ట్స్ కార్లను జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసింది.

జనవరి 17, 1953లో న్యూయార్క్ సిటీలో జరిగిన జనరల్ మోటార్స్ ఆటోరమా ప్రదర్శనలో తొలిసారిగా కాన్సెప్ట్ రూపంలో కార్వెట్‌ను ప్రదర్శించబడినది. అదే సంవత్సరం(1953)లో జూన్ 30న ఈ కారు ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పట్లో దీని ఉత్పత్తిని 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.
Photo credits: Georg Sander
అన్ని 1953 మోడళ్లు కూడా పోలో వైట్ ఎక్స్టీరియర్ రంగును, రెడ్ ఇంటీరియర్ రంగును కలిగి ఉండేవి. 1953లో షెవర్లే కార్వెట్ ధర 3,498 అమెరికన్ డాలర్లు మాత్రమే. ఇప్పటి మన కరెన్సీ రేటు ప్రకారం చూసుకుంటే, మన దేశం కరెన్సీలో దీని విలువ కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే.
Photo credits: DVS1mn
1955 వరకు షెవర్లే కార్వెట్‌లో ఇన్‌లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఆ సంవత్సరంలో 90 శాతం మంది కొనుగోలుదారురు ఆప్షన్ వి-8 ఇంజన్ కోసం ఆర్డర్లు చేశారు. 1956లో సిక్స్-సిలిండ్ ఇంజన్‌ను నిలిపివేసి, దాని స్థానంలో వి-8 ఇంజన్‌ను ప్రవేశపెట్టారు.

కార్వెట్‌ను మొదటి 10 సంవత్సరాల వరకు కన్వర్టిబల్ రూపంలో మాత్రమే తయారు చేసేవారు. 1963లో ఫిక్స్డ్ రూఫ్, స్ప్లిట్ విండో కలిగిన కార్వెట్ స్టింగ్ రే కూపేను రెండవ తరం (సెకండ్ జనరేషన్) కార్వెట్‌గా విడుదలల చేశారు. షెవర్లే కార్వెట్ స్టింగ్ రే కూపేను విడుదల చేసిన కంపెనీ అమ్మకాలు మునపటి కన్నా రెట్టింపు అయ్యాయి.


Click it and Unblock the Notifications








