ఢిల్లీ సీఎం కారును దొంగలించిన దుండగులు
ఓ ముఖ్యమంత్రి కారుని దొంగలించిన సంఘటన మన ఇండియోలోనే చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారును దుండగలు దోచుకెళ్లారు.
ఓ ముఖ్యమంత్రి కారుని దొంగలించిన సంఘటన మన ఇండియోలోనే చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారును దుండగలు దోచుకెళ్లారు.

భారత రాజధానిలో ఏకంగా ముఖ్యమంత్రి కారును దోచుకెళ్లిన ఘటనతో ప్రతి ఒక్కరూ ఓ ప్రక్కన ఆశ్చర్యపోతుంటే మరో ప్రక్కన ఆయన కారుకే భద్రత లేదు ఇకా సామాన్యుడి పరిస్థితి ఏమిటని విమర్శిస్తున్నారు.

2013లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నీలం రంగులో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారులో నిర్వహించిన ఫేమస్ అయిపోయాడు. లగ్జరీ కార్లు కాకుండా సామాన్యుడి కారు అంటూ, తాను వినియోగించిన వ్యాగన్ఆర్ కారుని ఢిల్లీ సెక్రటేరియడ్ సమీపంలో దొంగలించారు.

కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాక వ్యాగన్ఆర్ నుండి టయోటా ఇన్నోవా కారులోకి మారాడు. అయితే, అధికారికంగా ఇన్నోవా కారును కేటాయించడంతోనే దీనిని ప్రక్కనపెట్టాడు. అయినప్పటికీ తన వ్యక్తిగత అవసరాలకు వ్యాగన్‌ఆర్ కారునే వినియోగించేవాడు.
Recommended Video


ఢిల్లీలో అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో సెక్రటేరియట్ ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే ఢిల్లీ సీఎం కారు దొంగతనానికి గురవ్వడంతో ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది. ఢిల్లీ వీధుల్లో ప్రతి వారం బైకులు కార్లు చోరీకి గురవుతూనే ఉంటాయి. కానీ సీఎం కారుకే భద్రత లేకపోవడం కాస్త ఆందోళనకరమైన విషయమే.


Click it and Unblock the Notifications








