చైనాలో విచిత్రమైన ఫన్నీ బైక్ యాక్సిడెంట్ - వీడియో

By Ravi

ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందులో కొన్ని అతిభయంకరంగా ఉంటాయి. అలాంటి వాటి వలన కలిగి ఆస్తినష్టం, ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే, కొన్ని సందర్భాల్లో జరిగే చిన్న చిన్న ప్రమాదాలు ఇతరులకు నవ్వుపుట్టించేలా ఉంటాయి. నిర్లక్ష్యం, రోడ్డు నిబంధనల పట్ల అవగాహన లేకపోవటం వంటి కారణాల వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి.

చైనాలో ట్రాఫిక్ సిసి కెమెరాకు చిక్కిన ఈ రోడ్డు ప్రమాదాన్ని చూడండి. ఓ వ్యక్తి మరొక వ్యక్తిని వెనుక కూర్చోబెట్టుని స్కూటర్ నడుపుతూ ప్రమాదం యాక్సిడెంట్ చేసిన సంఘటన ఇది. మ్యాన్యువల్ సిగ్నల్స్ ఉన్న ఓ రోడ్డపై మితిమీరిన వేగంతో వచ్చిన ఆ వ్యక్తి అదుపు తప్పి రాంగ్ రూట్‌కు వెళ్లి ఆ జంక్షన్‌లో ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. అతను వెంటనే స్కూటర్ దూకి కాస్తంత దూరం పారిపోయి, తిరిగి మళ్లీ స్కూటర్‌ను తీసుకొని కంగారులో పక్కనే ఉన్న రెయిలింగ్‌ను తోసుకుంటూ పోయి అక్కడ ఉన్న పెద్ద గుంతలో పడిపోయాడు.

ఈ సంఘటన చూసి అయ్యో అనిపించినా, అతని అమాయకత్వం, కంగారుతనం ఇతరులకు నవ్వు తెప్పిస్తుంది. కాగా.. ఈ ప్రమాదంలో సదరు స్కూటర్ రైడర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ అవగాహనా రాహిత్యంతో వాహనాలు నడపటం చాలా ప్రమాదకరం. ఒకవేళ అనుకోకుండా ఏదైనా చిన్న ప్రమాదం జరిగిన కంగారుపడిపోకుండా, సావధానంగా వ్యవరహించి ముందుకు సాగిపోవాలే కానీ కంగారుతో సదరు ప్రమాదాన్ని మరింత పెద్ద ప్రమాదంగా మార్చుకోకూడదని ఈ సంఘటన మనుక గుర్తు చేస్తుంది.

చైనాలో విచిత్రమైన బైక్ యాక్సిడెంట్ - వీడియో

చైనాలోని ఓ ట్రాఫిక్ సిసి కెమెరాకు చిక్కిన స్కూటర్ యాక్సిడెంట్ సన్నివేశం.

More from DriveSpark

Article Published On: Monday, June 3, 2013, 15:53 [IST]
English summary
The video comes from China and was captured by a security camera. Seen in the video is a man on a scooter with a pillion rider. The man crashes into another vehicle in a busy intersection, nothing uncommon there. But what follows is sheer madness and quite funny.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+