ప్రపంచంలో కెల్లా అతి విచిత్రమైన రోడ్డు నిబంధన చట్టాలు!
రోడ్డు నిబంధన చట్టాలు అనేవి ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ, ఈ నిబంధలన్నీ కూడా ప్రజలు, వాహన చాలకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించబడినవే. అయితే, కొన్ని దేశాల్లో అనుసరించే రోడ్డు నిబంధన చట్టాలు మాత్రం చాలా విచిత్రంగాను, సరదాగాను ఉంటాయి.
ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియోలో ఆయా దేశాల్లో అమల్లో ఉన్న/ఉండిన విచిత్రమైన రోడ్డు నిబంధనలకు సంబంధించిన వీడియోని ఒకదానిని వీక్షిద్దాం రండి.
ఈ విచిత్రమైన రోడ్డు చట్టాల్లో ఉదాహరణకు.. యూఎస్ఏలోని యురేకాలో రోడ్డుపై పడుకోవటం నేరం, యూఎస్ఏలోని మస్సాచుస్సెట్‌లో కారు వెనుక సీటులో గొరిల్లాను కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేయటం చట్ట విరుద్ధం, స్వీడన్‌లో 24 గంటల పాటు హెడ్‌లైట్లను ఆన్‌లో ఉంచడం తప్పనిసరి, యూఎస్ఏలోని డబ్లిన్‌లో ప్లే గ్రౌండ్లలో వాహనం నడపటం నేరం, డెన్మార్క్‌లో కారు స్టార్ట్ చేయడానికి ముందు మీ కారు క్రింద చూడటం తప్పనిసరి, యూఎస్ఏలోని ఫ్లోరిడాలో ఏనుగును పార్క్ చేసేటప్పుడు తప్పనిసరిగా పార్కింగ్ రుసుము చెల్లించాలి.
ఇలాంటి మరెన్నో విచిత్రమైన రోడ్డు చట్టాలను ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








