ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పైకి ప్రవేశించిన వీధికుక్క!!

F1 Track Dog
భారత్‌లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఫార్ములా వన్ రేస్, ఢిల్లీకి సమీపంలో ఉన్న గ్రేటర్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చిన్న చిన్న అపశృతులు మినహా ఈ కార్యక్రమం సజావుగా సాగిపోతుంది. శుక్రవారం ప్రాక్టీస్ రేస్ జరుగుతున్న సందర్భంగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ వీధి కుక్క రేస్ ట్రాక్‌పై ప్రవేశించి హల్ చల్ చేసింది.

దీంతో రేస్ ప్రాక్టీస్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న నిర్వాహకులు బోలెరో వాహనంలో వెళ్లి మరీ కుక్కను తరిమికొట్టారు. అంత కట్టుదిట్టమైన రేస్‌ట్రాక్ సాధారణంగా విఐపిలను అనుమతించడమే కష్టం అలాంటి ఓ వీధి కుక్క రేస్ ట్రాక్‌ఫై ఫార్ములా వన్ కార్ల కన్నా వేగంగా పరుగులు పెట్టింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. ఫార్మాల్ వన్ రేస్ కోసం చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

శుక్రవారం ప్రాక్టీస్ రేస్ కావడంతో దాదాపు సీట్లు అన్నీ ఖాలీగా దర్శనమిచ్చాయి. ఈ ట్రాక్ నిర్మాణాన్ని త్వరత్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో అరకొరగా నిర్మించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరో కామన్‌వెల్త్ స్టేడియంను తలపిస్తున్నాయి. ఈ ప్రాక్టీస్ సెషన్ సమయం గురించి చాలా మంది ప్రజలకు సమాచారం లేదు. ఈ సర్క్యూట్‌కు ప్రపంచ స్థాయి లుక్‌ను కల్పించడంలో బిఐసి విఫలమైందని చెప్పవచ్చు. రవాణా సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాగా.. బిఐసి ట్రాక్‌పై ఈ రోజు క్వాలిఫైంగ్ రేస్ జరుగుతోంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 29, 2011, 16:37 [IST]
English summary
For the first time in India Formula One kicked off at Buddh International Circuit, Greater Noida near Delhi on Friday. A stray dog entered into BIC track and interrupted the practice session of F1. BIC failed to make required arrangements at Track.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+