రైళ్లలో రోజు ఒకే రూట్‌లో ఉదయం, సాయంత్రం ప్రయాణిస్తున్న కుక్క.. డ్యూటీకి వెళ్తుంది అనుకుంటున్నారా.?
లోకల్ రైళ్లు లేని జీవితం ఊహించలేనిది. సబర్బన్ రైళ్లు ప్రజల జీవితాల్లో ముఖ్యమైన భాగంగా మారాయి. ఈ రైళ్లు ప్రయాణికుల రోజువారీ జర్నీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెన్నైలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా లోకల్ రైళ్ల సహకారం ఎనలేనిది.
టికెట్ ధర తక్కువగా ఉండటం మరియు సమయానికి చేరుకోగలగడం వల్ల చాలా మంది రైళ్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ముంబయి వంటి నగరాల్లో సబర్బన్ రైళ్లు బాగా ప్రాచుర్యం పొందాయి. నగరంలోని రోడ్లు ట్రాఫిక్‌తో చాలా రద్దీగా ఉండటంతో, ఆ నగరానికి చెందిన చాలా మంది ప్రజలు లోకల్ రైలును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే అక్కడ రైళ్లే జీవనాధారం.

ఇలాంటి పరిస్థితుల్లోనే హాయిగా ఓ శునకం రైలులో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముంబయి వాసుల మాదిరిగానే ఒక కుక్క రోజువారీ రైలులో ప్రయాణిస్తున్నట్లు ప్రయాణికులు గుర్తించారు. ఇదేంటి కుక్క రోజూ అదే రైల్లో ప్రయాణించడం ఏంటని షాక్ అవుతున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.
అవును, ఆ కుక్క ప్రతిరోజూ ఒక నిర్దిష్ట స్టేషన్ నుంచి రైలులో వెళ్లి సాయంత్రం మరొక రైలులో అదే స్టేషన్‌కు తిరిగి వస్తుంది. ఆ శునకం రోజువారీ ప్రయాణాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబయిలోని బోరివాలి స్టేషన్‌లో ఆ కుక్క ఎక్కి అంధేరి రైల్వే స్టేషన్‌లో దిగుతుంది. ఆ తర్వాత సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ బోరివాలి చేరుకుంటుంది.
కుక్క క్రమం తప్పకుండా రోజూ ఇలా రైలులో ప్రయాణించడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి సమస్య తలెత్తడం లేదన్నది సమాచారం. అంతేకాదు, ఇప్పుడు అదే రైలులో రోజూ ప్రయాణించే వారికి ఈ శునకం ఫేవరెట్‌గా మారింది. ఈ రైలు ప్రయాణం కుక్కకు ప్రమాదకరం. కానీ చాలా మంది దాని చర్యను చూసి ఆనందిస్తున్నారు.
కాగా ఈ వైరల్ వీడియో ఇప్పటికే అనేక లక్షల వ్యూస్‌ను సంపాదించుకుంది. ఇప్పటికే ఈ వీడియోకు 8.3 లక్షల వ్యూస్ వచ్చాయి. అలాగే లైక్స్‌ను కూడా పోగుచేసుకుంది. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
'ఈ ప్రపంచం అందరి కోసం.. ఈ శునకం స్వేచ్ఛగా సంచరించడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.' అని ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మరొకరు, "అంధేరి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కేటప్పుడు నేను ప్రతి రోజు కుక్కను చూస్తాను." అని చెప్పుకొచ్చారు. మరో వ్యక్తి ఆ శునకాన్ని చూసేందుకే బోరివాలి రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్నానని వెల్లడించారు. ఏది ఏమైనా ఇది నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
కుక్కలకు ఇలాంటి వింత ప్రవర్తన కొత్త కాదు. గతంలో ఓ కుక్క రైలుకు వేలాడుతూ ప్రయాణికులను లోపలికి వెళ్లమని చూపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అంతే కాకుండా కుక్కలు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నట్లు, కుక్క బస్సులో ప్రయాణించడం వంటి వీడియోలు కూడా విడుదలయ్యాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








