వస్తాడు, భిక్షమెత్తుకుంటాడు, ప్రతి రోజు ఆడి కారులో ఇంటికి వెళతాడు
మూడు పూటలా తినడానికి అడుక్కునే వాళ్ళు చాలా మందే ఉంటారు, అటువంటి వారికి, ఇళ్లు వంటివి ఏవి కూడా ఉండవు. నా అనే వారు అసలే ఉండరు. కాని ఏ పూటకు ఆ పూట పొట్ట నింపుకుంటే చాలు అనుకుంటారు చాలా మంది సాధారణ భిక్షగాళ్లు.
కాని ఈ ప్రొఫెషనల్ బెగ్గర్ అలాంటి వారికి పూర్తి భిన్నంగా ఉంటాడు. ప్రతి రోజు ఆడి టిటి కారులో తన లొకేషన్‌కు చేరుకుంటాడు. సాయంత్రం అయ్యేసరికి తన ఆడి కారులో ఏదో ఒక ప్రాతానికి చేరుకుం్టాడు. అసలు ఇతని కథేంటి అనిపిస్తుంటే క్రింది స్లైడర్ల మీద ఓ లుక్కేయండి.

ఇతని పేరు మాథ్యు బ్రింటన్ ఈ వృత్తి రీత్యా భిక్షగాడు, ఇతను తన పెంపుడు కుక్కతో హజెల్ అనే నగరంలో లోని బ్యాంక్ స్ట్రీట్‌లో అడుక్కోవడం ఇతని ప్రొఫెషన్

అయితే ఇతని అడుక్కుంటుండగా ఒక వ్యక్తి ఇతనికి కొంచెం డబ్బుును దానం చేశాడు. అయితే మ్యాథ్యు ఆడి టిటి కారులో ప్రయాణం అవుతుండగా దానం చేసిన వ్యక్తి చూసి అశ్ఛర్యపోయాడు.

అపుడు బయట పడింది ఈ కాస్ట్లీ భిక్షగాడి బండారం. ఇతనికి ఆడికి చెందిన టిటి మోడల్ కారు ఉంది. దీని విలువ దాదాపుగా 50,000 పౌండ్లుగా ఉంది.

అత్యంత ఖరీదైన కారును కలిగి ఉన్న ఇతనికి సొంత ఇళ్లు, నా అనే వారు ఎవరు లేరు అని తెలిపారు.

ఓ పెంపుడు కుక్క, ఆడి కారు ఇతను ఈ ముగ్గురే ఇతని ప్రపంచం. అయితే ఇతను ఆడి కారులో వెళుతుండగా ఒక వీడియో తీశారు. దీనిని యూ ట్యూబ్‌లో దాదాపుగా 30,660 మంది చూశారు. మరియు 100 మంది వరకు విపరీతమైన కామెంట్లు పెట్టారు.

అయితే దీని గురించి ఈ భిక్షగాడు మాట్లడుతూ నా గురించి సామాజిక వెబ్‌సైట్ల మీద ఉన్న కథనాల గురించి తెలియదు ఎందుకంటే నాకు వాటికి సంభందించిన యాక్సెస్ లేదు అని చెప్పుకొచ్చాడు.

ఎంతో కాలంగా తిండిలేక బాదపడిన సందర్భాలు కూడా ఉన్నాయని మరియు పోలీసుల నన్ను చాలా బయపెట్టారని తెలిపాడు. అయితే ఇంత ఘోరంగా ఉన్న ఇతగాడి జీవితం ఇలా సడెన్‌గా ఇంత మార్పు రావడం వెనుక ఏ నక్క తోక వచ్చాడో ఏమో మరి.

- 170 ఇండియన్ రైల్వే చరిత్రలో 49 ఆసక్తికరమైన విషయాలు
- పైలట్లు మరియు విమానం సిబ్బంది చాటుగా చేసే 20 రహస్య పనులు
- భారత్‌లో అత్యంత రద్దీ గల టాప్-10 అంతర్జాతీయ విమానాశ్రయాలు


Click it and Unblock the Notifications