సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

భారతదేశంలో చాలామంది పిల్లలు గొప్ప ప్రతిభను కలిగి ఉంటారు. వీరు జీవితంలో ఆ ప్రతిభ ద్వారా చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని కలలుకంటూ ఉంటారు. కానీ చాలామంది కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా వారి కలలు కలలుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. కొంత మంది పిల్లలు ఇతరుల సహాయ సహకారాలతో తమ కలలను నిజం చేసుకుంటారు.

ప్రపంచ స్థాయి సైక్లిస్ట్ కావాలని కల కంటున్న ఒక విద్యార్థికి భారత రాష్ట్రపతి ఒక సైకిల్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..రండి.

సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

బీహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన రియాజ్ ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లోని సర్వోదయ బాల్ విద్యాలయ విద్యార్థి. రియాజ్ 9 వ తరగతి విద్యార్ధి. యితడు ఘజియాబాద్ మహారాజ్‌పూర్‌లో అద్దె వసతి గృహంలో ఉండేవాడు.

తన తండ్రి యొక్క చిన్న ఆదాయంతో రియాజ్ ఘజియాబాద్‌లోని తినుబండారాల డిష్‌వాషర్‌గా [వంట పాత్రలు కడిగేవాడిగా] పనిచేస్తున్నాడు. రియాజ్ కి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇతడు స్కూల్ మరియు వర్క్ అయిన తరువాత సైక్లింగ్ ప్రాక్టీస్ చేసుకునే వాడు. రియాజ్ 2017 లో ఢిల్లీలో నిర్వహించిన సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించాడు.

MOST READ:కొడుకు ఇచ్చిన ఐడియాతో తండ్రి సృష్టించిన ఎలక్ట్రిక్ సైకిల్ ; చూసారా..!

సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రకారం గువహతిలో జరిగిన స్కూల్ గేమ్స్ కార్యక్రమంలో పాల్గొని జాతీయ స్థాయిలో నాల్గవ ర్యాంకు సాధించాడు. రియాజ్ యొక్క పోరాట కథను మీడియాలో వచ్చిన నివేదికల ద్వారా రాష్ట్రపతికి తెలిసింది.

సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

రియాజ్ కోచ్ ప్రమోద్ శర్మ నుండి ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో క్రమం తప్పకుండా అతనికి శిక్షణ ఇస్తాడు. కానీ అతడు సైక్లింగ్ అరువు తెచ్చుకున్న సైకిల్ మీద ప్రాక్టీస్ చేసుకునేవాడు. కానీ అతడు ఈద్ సందర్భంగా తాను ఛాంపియన్ కావాలన్నా కలను సొంతం చేసుకోవడానికి ఒక సైకిల్ మంజూరు చేయబడింది.

MOST READ:ఇండియాలో ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతోనే హెలికాఫ్టర్ సర్వీస్.. ఎక్కడో తెలుసా ?

సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

దేశ నిర్మాణానికి యువత పాత్ర చాలా ఉంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేసింగ్ సైకిల్‌ను బహుమతిగా ఇచ్చాడు. రేసింగ్ సైకిల్‌ను బహుమతిగా ఇవ్వడానికి సైక్లిస్ట్‌గా రాణించాలని కలలు కంటూ కష్టపడుతున్న పాఠశాల బాలుడు రియాజ్‌ను ఎంచుకున్నారు అని ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ఛాంపియన్ కావాలని, తన కృషి ద్వారా తన కలను సాకారం చేసుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

సైక్లిస్ట్ కల సహకారం చేసుకోవడానికి స్కూల్ విద్యార్థికి సైకిల్ గిఫ్ట్ ఇచ్చిన భారత రాష్ట్రపతి

పండుగ పర్వదినానికి ఒక రోజు ముందు శుక్రవారం రియాజ్‌కు ఈ సైకిల్ పంపిణీ చేయబడింది. అన్ని అసమానతలను ధిక్కరించిన రియాజ్‌ను అభినందిస్తూ, అధ్యక్షుడు కోవింద్ తన శుభాకాంక్షలు తెలిపారు. రియాజ్ కథ యువకులకు ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

MOST READ:బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుచేసిన సుప్రీంకోర్టు : ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
President Gifts Bicycle To Student Who Washes Dishes After School For A Living. Read in Telugu.
Story first published: Saturday, August 1, 2020, 13:38 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X